Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bihar: ఎన్‌డీయే కూటమి నుంచి జేడీయూ బయటకు రావడానికి వారే కారణమా..? సీఎం ఎవరెవరి పేర్లను చెప్పారంటే..

ఎన్‌డీయే కూటమి నుంచి జేడీయూ బయటకు రావడానికి గల కారణాలు ఏమిటంటే.. ఎవరికీ సరైన అవగాహన లేదు. అయితే దానిపై జేడీయూ అధినేత పెదవి విప్పారు. కూటమి నుంచి బయటకు రావాలని.. ఆయనకు ఎవరు..?

Bihar: ఎన్‌డీయే కూటమి నుంచి జేడీయూ బయటకు రావడానికి వారే కారణమా..? సీఎం ఎవరెవరి పేర్లను చెప్పారంటే..
Nitish Kumar
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Dec 12, 2022 | 9:30 AM

ఈ ఏడాది ఆగష్టులో బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ కూటమి నుంచి జేడీయూ అధినేత,  బిహార్ సీఎం నితీష్ కుమార్ బయటకు వచ్చి ఆర్‌జేడీ పార్టీ పొత్తు పెట్టుకుని తన పదవిని కాపాడుకున్న సంగతి మనకు తెలిసిన విషయమే. అసలు ఎన్‌డీయే కూటమి నుంచి జేడీయూ బయటకు రావడానికి గల కారణాలు ఏమిటంటే.. ఎవరికీ సరైన అవగాహన లేదు. అయితే దానిపై జేడీయూ అధినేత పెదవి విప్పారు. కూటమి నుంచి బయటకు రావాలని ఆయనకు ఎవరు సూచించారనేది తెలిపారు. జెడీయూ జాతీయాధ్యక్షుడు లాలన్ సింగ్, క్యాబినెట్ మంత్రి బిజేంద్ర యాదవ్ సలహా మేరకు బీజేపీతో పొత్తును తెంచుకున్నట్లు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఆదివారం వెల్లడించారు. బిహార్ రాజధాని పాట్నా వేదికగా గాంధీ మైదాన్‌లో శ్రీకృష్ణ మెమోరియల్ హాల్‌లో జరుగుతున్న పార్టీ బహిరంగ సభ రెండో రోజు ఆయన మాట్లాడుతూ.. “మేము ఎన్‌డీఏలో ఉన్నప్పుడు పరిస్థితులు ప్రతికూలంగా ఉండేవి. అలాంటి స్థితిలో కూటమి నుంచి వైదొలగాలని లాలన్ సింగ్, బిజేంద్ర యాదవ్ నాకు సూచించారు. మేము దేశవ్యాప్తంగా ఉన్న మా పార్టీ నాయకుల నుంచి సలహాలను తీసుకున్నాము.  అందుకు వారు నేను బీజేపీతో పొత్తును తెంచుకుని ప్రాంతీయ పార్టీలతో కూటమిగా కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు” అని అన్నారు.

ఇంకా ఆయన తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ “ఇప్పుడు మేము బీహార్‌లో ఏడు ప్రాంతీయ పార్టీలతో కలిసి మా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఉమ్మడిగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నాము. లాలన్ సింగ్ జేడీయూ పార్టీ జాతీయ అధ్యక్షుడు. ఆయనకు మద్దతు ఇవ్వాలని మీ అందరినీ కోరుతున్నాను’ అని నితీష్ కుమార్ పేర్కొన్నారు. అయితే ఈ కూటమికి, నితీష్ ప్రభుత్వానికి 7 పార్టీల మద్దతు ఉన్నప్పటికీ కుర్హానీ ఉపఎన్నికలో జేడీయూ అభ్యర్థి ఓడిపోయాడు. మరోవైపు బీహార్‌లో మహాఘటబంధన్ ప్రభుత్వం ఏర్పడిన మూడు నెలల తర్వాత నితీష్ కుమార్ అలాంటి ప్రకటన ఎందుకు చేశారని రాజకీయ పండితులు భావిస్తున్నారు.

కాగా, బీహార్‌లో ఎన్డీయే కూటమిని విచ్ఛిన్నం చేసినందుకు లాలన్ సింగ్, బిజేంద్ర యాదవ్‌లను నిందించడం ద్వారా నితీష్ కుమార్ బీజేపీకి దగ్గర కావాలనుకుంటున్నారని కూడా ప్రచారం జరుగుతోంది. బీహార్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహాఘట్‌బంధన్ మూడు ఉప ఎన్నికలలో పోటీ చేసి రెండు స్థానాలలో ఓడిపోయింది. ఈ ఫలితాల మేరకు  నితీష్ కుమార్ ప్రాంతీయ పార్టీలతో ఉన్న కూటమి పనితీరుతో సంతోషించకపోవచ్చని కూడా వార్తలు వస్తున్నాయి. ఇంకా నితీష్ కుమార్ నేతృత్వంలోని ప్రభుత్వం కూడా పెరుగుతున్న నేరాలపై విమర్శలను ఎదుర్కొంటోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.