AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pak Ex-Captain: భారత ప్లేయర్లపై అక్కసును వ్యక్తం చేసిన మరో పాక్ ప్లేయర్.. కోహ్లీ చేసిన సెంచరీ గురించి అతను ఏమన్నాడంటే..?

బంగ్లాదేశ్ పర్యటనలో భాగంగా శనివారం ఛటోగ్రామ్‌లో అతిథ్య జట్టుపై భారత్ సాధించిన ఘన విజయంలో మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ తన 44వ సెంచరీ చేశాడు.  దాదాపు 1214 రోజుల సుదీర్ఘ వ్యవధి తర్వాత కోహ్లీ తన బ్యాట్ ద్వారా.. మరో శతకం..

Pak Ex-Captain: భారత ప్లేయర్లపై అక్కసును వ్యక్తం చేసిన మరో పాక్ ప్లేయర్.. కోహ్లీ చేసిన సెంచరీ గురించి అతను ఏమన్నాడంటే..?
Rashid Latif On Kohli
శివలీల గోపి తుల్వా
|

Updated on: Dec 12, 2022 | 11:43 AM

Share

బంగ్లాదేశ్ పర్యటనలో భాగంగా శనివారం ఛటోగ్రామ్‌లో అతిథ్య జట్టుపై భారత్ విజయం సాధించిన మ్యాచ్‌లో మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ తన 44వ సెంచరీ చేశాడు.  దాదాపు 1214 రోజుల సుదీర్ఘ వ్యవధి తర్వాత కోహ్లీ తన బ్యాట్ ద్వారా మరో శతకాన్ని నమోదుచేశాడు. కోహ్లీ ఈ సెంచరీతో ఆస్ట్రేలియా దిగ్గజ ప్లేయర్ రికీ పాంటింగ్‌ను అధిగమించి, అత్యధిక అంతర్జాతీయ శతకాలు బాదినవారి జాబితాలో రెండవ స్థానానికి చేరాడు. భారత దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్ తర్వాత స్థానంలో కోహ్లీ ఇప్పుడు ఉన్నాడు. అందుకే సచిన్ 100 సెంచరీల రికార్డును కోహ్లీ బద్దలు కొట్టగలడా..? అనే చర్చ మూడేళ్ల తర్వాత మరోసారి తెరమీదకు వచ్చింది. అయితే భారత క్రికెట్‌పై ఎప్పుడూ తమ అక్కసును వ్యక్తం చేసుకునే పాక్ మాజీలు మరోసారి తమ బుద్ధిని చూపించుకున్నారు. కోహ్లీ 200 సెంచరీలతో తన కెరీర్ ముగించినా పర్వాలేదని.. భారత్‌కు ఇప్పుడు కావలసింది ట్రోఫీ అని పాకిస్థాన్ మాజీ కెప్టెన్ అభిప్రాయపడ్డాడు. అంతర్జాతీయ వన్డేలలో సెంచరీల పరంగా సచిన్ (49) కంటే కోహ్లీ(44) కేవలం ఐదు సెంచరీలే వెనుకబడి ఉన్నాడు. కోహ్లి ఇప్పటికీ మూడు ఫార్మాట్లలో చురుకుగా పాల్గొంటున్నందున అతను సచిన్ రికార్డును బద్దలు కొట్టే అవకాశం ఉంది.

అయితే ఇదే విషయంపై పాక్ మాజీ కెప్టెన్ రషీద్ లతీఫ్‌ను ఓ యూట్యూబ్ ఇంటర్వ్యూలో ప్రశ్నించగా అతను మాట్లాడుతూ.. సచిన్ రికార్డును కోహ్లీ బద్దలు కొట్టడం కోసం అభిమానులు ఎదురుచూడటం లేదని వ్యాఖ్యానించాడు. భారత్ మరో ఐసీసీ టైటిల్ గెలవాలని వారు తహతహలాడుతున్నారిన అభిప్రాయపడ్డాడు. “సెంచరీల సంఖ్యను లెక్కించడానికి ఇది సమయం కాదు. భారత్ ట్రోఫీ గెలిచి చాలా ఏళ్లు గడిచాయి. కోహ్లి 100 సెంచరీలు చేసినా, 200 చేసినా.. భారత క్రికెట్‌కు, అభిమానులకు ఒక టైటిల్ ముఖ్యం. ఇప్పుడు తమకు టైటిల్ కావాలని అభిమానుల నుంచి, మీడియా నుంచి క్రికెటర్లకు ఒత్తిడి వస్తోంది. కోహ్లి కావాలంటే 100 సెంచరీలు చేయగలడు. కానీ డిమాండ్ మారింది. ఆసియా కప్ పోయింది, అలాగే ఛాంపియన్స్ ట్రోఫీ, 2019 ప్రపంచ కప్, చివరి రెండు T20 ప్రపంచ కప్‌లు కూడా పోయాయి. 100 సెంచరీలకు దానికంటూ ప్రత్యేక స్థానం ఉంది. కానీ భారతదేశం,  భారత క్రికెట్ బోర్డు ఐసీసీ టైటిల్ గెలవాలి, ”అని అతను చెప్పాడు.

కాగా శనివారం జరిగిన మూడో వన్డే మ్యాచ్‌లో 227 పరుగుల తేడాతో బంగ్లా జట్లుపై భారత్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో భారత యువ ఆటగాడు ఇషాన్ కిషన్ 210 పరుగులతో డబుల్ సెంచరీ చేయగా, కోహ్లీ 113 పరుగులతో తన కెరీర్‌లో 44వ శతకాన్ని సాధించాడు. చివరి మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు చెలరేగినా సిరీస్‌ను మాత్రం బంగ్లాదేశ్ గెలుచుకుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..