Dieting Tips: ఫలితం కన్పించడం లేదని.. డైట్‌ ప్లాన్‌ తరచూ మారుస్తున్నారా.. ఈ విషయాలు మీకోసం..

డైటింగ్‌ పేరుతో రోజూ తినే ఆహారంలో ఎన్నో మార్పులు చేసుకుంటూ ఉంటారు. అయితే కొద్ది రోజులకే ఫలితం కన్పించకపోతే.. వెంటనే మళ్లీ డైట్‌ను మార్చేస్తారు. ఇలా చేయడం ద్వారా అనుకున్న ఫలితం రాకపోగా.. ఆరోగ్య సమస్యలు..

Dieting Tips: ఫలితం కన్పించడం లేదని.. డైట్‌ ప్లాన్‌ తరచూ మారుస్తున్నారా.. ఈ విషయాలు మీకోసం..
Food
Follow us
Amarnadh Daneti

|

Updated on: Dec 13, 2022 | 8:10 AM

మారుతున్న జీవనశైలిలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం, ఆరోగ్య రక్షణకు ప్రాధాన్యత తగ్గించడంతో చాలా మంది బరువు పెరగడంతో పాటు ఎన్నో ఆరోగ్య సమస్యల బారిన పడుతున్నారు. దీంతో విషయం తెలసుకున్నాక.. చాలా మంది బరువు తగ్గేందుకు డైటింగ్ చేస్తున్నారు. రోజూ తినే ఆహారంలో.. తీసుకునే సమయంలో.. పరిమాణంలో అనేక మార్పులు చేసుకుని.. బరువు తగ్గేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే కొంత మంది ఈడైటింగ్ ను పర్ ఫెక్ట్ గా ఫాలో అవుతుంటే మరికొంత మంది ఏదో నామ్ కీ వాస్త్ అన్నట్లు చేస్తున్నారు. అయితే కొంత మంది ప్లాన్ ప్రకారం డైటింగ్ చేస్తున్నా.. ఫలితం మాత్రం కన్పించదు. ఎందుకంటే ఈడైటింగ్ లో కొన్నిసార్లు చిన్న చిన్న లాజిక్ లు మిస్ అవుతూ ఉంటారు. మధ్యాహ్నం లంచ్, రాత్రి డిన్నర్ టైమ్ లోనే ఈడైటింగ్ టిప్స్ ను ఫాలో అవుతూఉంటారు. డైటింగ్ చేసే వారు మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ టైమ్ లో కొద్దిగా ఎక్కువ ఆహారం తీసుకుంటుంటారు. మనం ప్రతిరోజూ తీసుకునే ఆహారంలో ఎక్కువ మొత్తం ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లోనే చేసేస్తే క్యాలరీలు సమర్థవంతంగా ఖర్చు చేయవచ్చు, తద్వారా బరువు తగ్గించుకోవచ్చు అనే భావన కూడా చాలా మందిలో ఉంటుంది. కానీ ఇక్కడ చిన్న లాజిక్ ఉంది.

అల్పాహారం అంటేనే అల్పంగా, తక్కువ పరిమాణంలో తీసుకునేది అని అర్థం. తాజాగా చేపట్టిన ఒక అధ్యయనం ప్రకారం ఒక రోజులో ఎక్కువ మొత్తంలో ఆహారం ఏ సమయంలో తిన్నప్పటికీ, అది బరువును ఎంత మాత్రం ప్రభావితం చేయదు. అల్పాహారం ఎక్కువ మొత్తంలో తింటే బరువు తగ్గుతారనేది అపోహ మాత్రమేనని తాజా పరిశోధనలో వెల్లడైంది. అందుకే డైటింగ్ చేసేటప్పుడు మన సందేహాలను డైటీషియన్స్ లేదా ఆరోగ్య నిపుణులను అడిగి నివృత్తి చేసుకోవాల్సి ఉంటుంది. వారి సలహాలు, సూచనల ప్రకారం సరైన పద్ధతిలో డైటింగ్ చేస్తే మాత్రం ఆశించిన ఫలితాలు వస్తాయంటున్నారు నిపుణులు.

డైటింగ్‌ పేరుతో రోజూ తినే ఆహారంలో ఎన్నో మార్పులు చేసుకుంటూ ఉంటారు. అయితే కొద్ది రోజులకే ఫలితం కన్పించకపోతే.. వెంటనే మళ్లీ డైట్‌ను మార్చేస్తారు. ఇలా చేయడం ద్వారా అనుకున్న ఫలితం రాకపోగా.. ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం లేకపోలేదంటున్నారు నిపుణులు. ఏదైనా డైట్ తీసుకునేటప్పుడు.. అది మన లైఫ్ స్టైల్‌లో భాగం కావడానికి కొంత టైమ్ పడుతుంది. రోజే అదే డైట్ తీసుకుంటే.. దానికి శరీరం అలవాటుపడటానికి సమయం తీసుకుంటుంది. అలా కొద్దిరోజులకు మనం తీసుకునే డైట్‌కు శరీరం అలవాటుపడిన తర్వాత.. ఫలితం కనిపిస్తుంది. అందుకే తరచూ డైట్ ప్లాన్‌ను మార్చుకోవడం కూడా అంత మంచిది కాదని సూచిస్తున్నారు. ఆరోగ్య నిపుణులు.

ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్ వార్తల కోసం చూడండి..