Viral Video: ప్రేమతో ఇచ్చే గిఫ్ట్‌కు విలువ కట్టలేమంటే ఇదేనేమో.. ఇచ్చింది చిన్న బహుమతి అయినా.. ఎగిరి గంతేశాడుగా..

మన బంధువులు, స్నేహితులు కాకపోయినా.. ఏళ్ల తరబడి చుట్టుపక్కల ఉండేవారి పట్ల కూడా ప్రేమ, ఆప్యాయతలు కలిగి ఉంటారు చాలామంది. ఒకే చోట కలిసి ఉండటంతో వారిని కూడా సొంత కుటుంబ సభ్యుల వలె భావిస్తుంటారు. అదే మన పరిసరాల్లో దీర్ఘకాలంగా..

Viral Video: ప్రేమతో ఇచ్చే గిఫ్ట్‌కు విలువ కట్టలేమంటే ఇదేనేమో.. ఇచ్చింది చిన్న బహుమతి అయినా.. ఎగిరి గంతేశాడుగా..
Sign Board
Follow us
Amarnadh Daneti

|

Updated on: Dec 11, 2022 | 6:36 PM

మన బంధువులు, స్నేహితులు కాకపోయినా.. ఏళ్ల తరబడి చుట్టుపక్కల ఉండేవారి పట్ల కూడా ప్రేమ, ఆప్యాయతలు కలిగి ఉంటారు చాలామంది. ఒకే చోట కలిసి ఉండటంతో వారిని కూడా సొంత కుటుంబ సభ్యుల వలె భావిస్తుంటారు. అదే మన పరిసరాల్లో దీర్ఘకాలంగా ఎదైనా వ్యాపారాలు చేస్తున్నవారు, లేదా చిరు తిళ్ల దుకాణాలు నడిపేవారితో కూడా మంచి పరిచయాలు ఏర్పడతుంటాయి. అలాంటి సందర్భాల్లో కొన్నిసార్లు మనకు ఇష్టమైన వారిని అప్పుడప్పుడు సర్‌ప్రైజ్ చేస్తూ ఉంటాం. మరోవైపే చిన్నప్పటి నుండి మన చుట్టుపక్కల ప్రాంతాల్లో రుచికరమైన ఫుడ్ విక్రయించేవారికి మనం రెగ్యులర్ ఖాతాదారులుగా కూడా మారుతూ ఉంటాం. కొంతమంది క్రమం తప్పకుండా ఆ దుకాణానికి వెళ్లి ఫుడ్ కొనుక్కుంటూ ఉంటారు. కొన్ని ఫుడ్ స్టాల్స్‌ ఇళ్ల పక్కనే ఉంటాయి. అక్కడి ఆహారం కోసం ఎంతో మంది వస్తుంటారు. వీళ్లను వీధి వ్యాపారులగా కూడా చెబుతుంటారు. స్ట్రీట్ వెండర్స్‌ అని అంటారు. వీరు ఏళ్ల తరబడి ఒకే ప్రాంతంలో వ్యాపారం చేస్తూ ఉంటారు. ముఖ్యంగా పానీపూరీ, భేల్ పూరీ విక్రేతలు ఒకే చోట ఉంటూ కొన్ని సంవత్సరాలుగా వ్యాపారం నిర్వహిస్తూ ఉంటారు. వారితో చాలా మందికి వ్యక్తిగత పరిచయాలు కూడా ఏర్పడతాయి. తాజాగా ఓ భేల్ పూరీ విక్రేతకు.. అదే ప్రాంత నివాసి ఇచ్చిన ఓ బహుమతికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ వీడియోలో ఓ వ్యక్తి భేల్ పూరీ విక్రేతకు సంబంధించిన దుకాణం పేరుతో స్వయంగా తయారుచేసిన సైన్ బోర్డును బహుమతిగా ఇచ్చి సర్‌ప్రైజ్ చేస్తాడు. ఆ సైన్ బోర్డు చూసి భేల్ పూరీ విక్రేత కూడా అవాక్కైనట్లు కనిపిస్తోంది. తాను తన ఇంటి పక్కన ఉన్న భేల్ పూరీ వాలే భయ్యా కోసం ఈ బోర్డు తయారు చేశా.. అనే క్యాప్షన్‌ను కూడా వీడియోతో పోస్టు చేశారు. ఆ వ్యక్తి 35 సంవత్సరాలుగా అదే ప్రదేశంలో నిల్చుని వ్యాపారం చేస్తున్నాడు. ఇదెంతో గ్రేట్‌ అంటూ పేర్కొన్నాడు.

ఇవి కూడా చదవండి

ఇటీవల పోస్టు చేయబడిన ఈ వీడియోను వేలాది మంది లైక్‌ చేయగా.. లక్ష మంది వరకు వీక్షించారు. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన స్టైల్‌లో స్పందిస్తున్నారు. చిన్న విషయాలు కూడా ఎంతో ముఖ్యమైనవని ఓ నెటిజన్ కామెంట్ రాస్తే.. ఇదెంతో మధురమైన విషయమని మరో నెటిజన్‌ రాసుకొచ్చాడు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం చూడండి..

శివయ్య పూజలో పొరపాటున ఈ పనులు చేయవద్దు.. శని దోషం ఏర్పడుతుంది
శివయ్య పూజలో పొరపాటున ఈ పనులు చేయవద్దు.. శని దోషం ఏర్పడుతుంది
భారత్ చేతిలో ఓటమి తర్వాత ఏడ్చిన పాకిస్తాన్ ఆటగాళ్లు..వీడియో వైరల్
భారత్ చేతిలో ఓటమి తర్వాత ఏడ్చిన పాకిస్తాన్ ఆటగాళ్లు..వీడియో వైరల్
పశ్చిమ గాలుల ప్రభావంతో.. దిశను మార్చుకుంటోన్న తీవ్ర అల్పపీడనం
పశ్చిమ గాలుల ప్రభావంతో.. దిశను మార్చుకుంటోన్న తీవ్ర అల్పపీడనం
పెళ్లి చేస్తామని ఇంటికి పిలిచి.. నమ్మకంగా హతమార్చారు!
పెళ్లి చేస్తామని ఇంటికి పిలిచి.. నమ్మకంగా హతమార్చారు!
ఇదెక్కడి షాట్ భయ్యా.. ఇలా కూడా సిక్స్ కొడతారా
ఇదెక్కడి షాట్ భయ్యా.. ఇలా కూడా సిక్స్ కొడతారా
చేపల కోసం రాత్రి వల పెట్టి వెళ్లారు.. ఉదయాన్నే వచ్చి చూడగా షాక్..
చేపల కోసం రాత్రి వల పెట్టి వెళ్లారు.. ఉదయాన్నే వచ్చి చూడగా షాక్..
అన్నా క్యాంటీన్ వద్ద అదో మత్తైన వాసన.. ఏంటా అని చెక్ చేయగా..
అన్నా క్యాంటీన్ వద్ద అదో మత్తైన వాసన.. ఏంటా అని చెక్ చేయగా..
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్‌ ఇంటర్వ్యూ తేదీలు వెల్లడి.. వివరాలివే
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్‌ ఇంటర్వ్యూ తేదీలు వెల్లడి.. వివరాలివే
ముచ్చటగా మూడోసారి.. ఎంసీజీలో చరిత్ర సృష్టించనున్న కేఎల్ రాహుల్
ముచ్చటగా మూడోసారి.. ఎంసీజీలో చరిత్ర సృష్టించనున్న కేఎల్ రాహుల్
ఆ ముగ్గురు హీరోలతో సినిమాలు చేయాలనుకున్నా.. డైరెక్టర్ శంకర్
ఆ ముగ్గురు హీరోలతో సినిమాలు చేయాలనుకున్నా.. డైరెక్టర్ శంకర్