AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Funny Video: కళ్లజోడు అంత ఖరీదా.. కుమార్తె కొన్న చెష్మా రేటు తెలుసుకుని.. తండ్రి ఎలా రియాక్ట్‌ అయ్యాడో తెలుసా..

మహిళలు షాపింగ్‌ అంటే ఎంతో ఇష్టపడతారు. ఒక్కోసారి కుటుంబ సభ్యులతో కలిసి షాపింగ్‌ చేస్తూ ఉంటాం. మరికొన్ని సందర్భాల్లో ఒక్కరే షానింగ్‌కు వెళ్తుంటారు. ఒక్కోసారి మన షాపింగ్‌ చూసి కుటుంబ సభ్యులే ఎగతాళి చేస్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో మంచి వస్తువులు కొంటే..

Funny Video: కళ్లజోడు అంత ఖరీదా.. కుమార్తె కొన్న చెష్మా రేటు తెలుసుకుని.. తండ్రి ఎలా రియాక్ట్‌ అయ్యాడో తెలుసా..
Father Reaction On Daughter
Amarnadh Daneti
|

Updated on: Dec 11, 2022 | 8:06 PM

Share

మహిళలు షాపింగ్‌ అంటే ఎంతో ఇష్టపడతారు. ఒక్కోసారి కుటుంబ సభ్యులతో కలిసి షాపింగ్‌ చేస్తూ ఉంటాం. మరికొన్ని సందర్భాల్లో ఒక్కరే షానింగ్‌కు వెళ్తుంటారు. ఒక్కోసారి మన షాపింగ్‌ చూసి కుటుంబ సభ్యులే ఎగతాళి చేస్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో మంచి వస్తువులు కొంటే.. షాపింగ్ చేస్తే నీతో కలిసి చేయాలని అంటుంటారు. ఫ్రెండ్స్ కూడా మన షాపింగ్‌పై కామెంట్స్ చేస్తుంటారు. నీకు అసలు టేస్టే లేదని కొంతమంది అంటుంటారు. అయితే తాజాగా కుమార్తె షాపింగ్‌లో కొన్న కళ్లజోడు గురించి తండ్రి రియాక్షన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సాధారణంగా కళ్లజోళ్లు బ్రాండ్‌ను బట్టి ధరలు ఆధారపడి ఉంటాయి. వంద రూపాయల నుంచి మొదలుపెడితే లక్షల రూపాయల ఖరీదు ఉంటాయి. తాజాగా ఓ తండ్రి తన కుమార్తెతో ఖరీదైన ఫెండీ గాగుల్స్ గురించి సరదాగా మాట్లాడిన వీడియో ఒకటి ఇంటర్నెట్‌లో వైరల్‌గా అవుతోంది. ఇన్‌స్టాగ్రామ్ యూజర్ కృతిక శర్మ షేర్ చేసిన వీడియోలో, ఆమె తన తండ్రితో జరిపిన ముచ్చట్లు చూడవచ్చు.

వీడియో ప్రారంభంలో షాపింగ్‌కు వెళ్లివచ్చిన యువతి తన తండ్రికి ఫెండి గాగుల్స్ పెట్టెను అందజేస్తుంది. ఆమె తండ్రి కళ్లజోడు గురించి అడుగుతూ.. ధర గురించి తెలుసుకుంటాడు. వెంటనే 1900 దిర్హామ్‌లు.. దాదాపు ఇండియన్‌ రూపీస్‌లో 42వేల రూపాయలుగా చెప్తుంది. రేటు తెలుసుకున్న వెంటనే తన తండ్రి అవాక్కయ్యారు. లోపల కళ్లజోడు జాగ్రత్తగా ఉంచుకోమని సలహా ఇచ్చాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది.

ఈ వీడియో షేర్ చేసినప్పటి నుండి మూడు లక్షల కంటే ఎక్కువ మంది లైక్ చేశారు. అలాగే పలువురు ఫన్నీ రియాక్షన్స్ ఇచ్చారు. కొంతమంది నెటిజన్లు అమ్మాయి అందంపై కామెంట్స్ చేస్తే మరికొంతమంది రిచ్ గర్ల్ అంటూ కామెంట్స్ చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం చూడండి..

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..