AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Diabetes: మధుమేహన్ని నియంత్రించడానికి.. ఈ నాలుగు సింపుల్ టిప్స్ ఫాలో అవ్వండి..

షుగర్ దీర్ఘకాలిక వ్యాధుల్లో ఒకటి. ఈ వ్యాధి ఒకసారి వచ్చిందంటే.. దానిని నియంత్రణలో పెట్టుకోవడమే తప్ప.. నివారించే అవకాశాలు లేవనే చెప్పుకోవాలి. మారుతున్న జీవనశైలిలో యువకులు కూడా షుగర్ వ్యాధి బారినపడుతున్నారు. ముఖ్యంగా ఆహారపు అలవాట్లలో మార్పులే షుగర్..

Diabetes: మధుమేహన్ని నియంత్రించడానికి.. ఈ నాలుగు సింపుల్ టిప్స్ ఫాలో అవ్వండి..
Yoga
Amarnadh Daneti
|

Updated on: Dec 11, 2022 | 8:48 PM

Share

షుగర్ దీర్ఘకాలిక వ్యాధుల్లో ఒకటి. ఈ వ్యాధి ఒకసారి వచ్చిందంటే.. దానిని నియంత్రణలో పెట్టుకోవడమే తప్ప.. నివారించే అవకాశాలు లేవనే చెప్పుకోవాలి. మారుతున్న జీవనశైలిలో యువకులు కూడా షుగర్ వ్యాధి బారినపడుతున్నారు. ముఖ్యంగా ఆహారపు అలవాట్లలో మార్పులే షుగర్ వ్యాధిమ రావడానికి కారణంగా తెలుస్తోంది. ఈ వ్యాధి లేని వారు కొన్ని జాగ్రత్తలు పాటిచండ ద్వారా మధుమేహం బారిన పడకుండా జాగ్రత్తపడవచ్చు. కాని ఇప్పటికే చక్కెర వ్యాధి ఉన్నవారు మాత్రం కొన్ని రకాల జాగ్రత్తలు పాటించడం ద్వారా వ్యాధిని నియంత్రణలో పెట్టుకోవచ్చు.  ముఖ్యంగా మధుమేహం వ్యాధి ఉన్న వాళ్లు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే ఈబ్లడ్ షుగర్ జీవితంలో మరిన్ని ఆరోగ్య సమస్యలకు కారణమవుతుంది. డయాబెటిస్ కంట్రోల్ లో లేకపోతే భవిష్యత్తులో తీవ్రమైన సమస్యలకు దారితీస్తుంది. ఈక్రమంలో మధుమేహం వ్యాధిని నియంత్రణలో ఉంచాలంటే జీవనశైలిలో కొన్ని మార్పులు అవసరం. వైద్యులు సూచించిన సలహాలను పాటించడంతో పాటు ఈ నాలుగు చిట్కాలు పాటిస్తే షుగర్ వ్యాధిని కంట్రోల్ లో ఉంచుకోవచ్చు.

శారీరక వ్యాయమం

మధుమేహం వ్యాధి ఉన్న వ్యక్తి ప్రతిరోజూ తన దినచర్యలో భాగంగా శారీరక వ్యాయమం చేయాలి. కనీసం 40 నుంచి 45 నిమిషాల పాటు వ్యాయమం చేయడం ద్వారా రక్తంలో షుగర్ స్థాయిని నియంత్రిస్తుంది. వాకింగ్, సైక్లింగ్, రోలర్ బ్లేడింగ్, జాగింగ్, స్విమ్మింగ్, స్కిప్పింగ్ లేదా క్రీడలు ఆడటం వంటి శారీరక వ్యాయమాలు చేస్తే మధుమేహం నియంత్రణలో ఉంటుంది.

బరువు తగ్గడం 

బరువు అధికంగా పెరగకుండా చూసుకోవడం ద్వారా షుగర్ వ్యాధిని నియంత్రించవచ్చు. ప్రతి రోజు వ్యాయమం చేయడం, సమతూకంలో ఆహారం తీసుకోవడం ద్వారా బరువు తగ్గే ప్రయత్నం చేయాలి. బరువు తగ్గడం కోసం ఎటవంటి ఆహారం తీసుకోకుండా ఉండటం ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది.

ఇవి కూడా చదవండి

ఆహార అలవాట్లలో మార్పు

మధుమేహంతో బాధపడేవారు తప్పనిసరిగా తీసుకునే ఆహారంలో సమతుల్యత పాటించాలి. ఎప్పుడు పడితే అప్పుడు ఏ ఆహారం పడితే అది తీసుకోకూడదు. కొవ్వు పదార్థాలు లేని ఆహార పదార్థాలను తీసుకోవాలి. రక్తంలో షుగర్ స్థాయిని పెంచే పదార్థాలు తినకూడదు. రోజులో నాలుగు చపాతీలు ఒకేపూట తీసుకుంటే.. పూటకు రెండు చొప్పున ఒక రోజులో రెండు సార్లు తీసుకోవాలి.డయాబేటిస్ ఉన్న వారు ఆహారంగా తృణధాన్యాలను ఎక్కువుగా తీసుకోవడం మంచిది. కూరగాయలు, బీన్స్ వంటివి తినాలి. పిజ్జా, బర్గర్లు, నూడిల్స్, పేస్ట్రీలు, అధికంగా కొవ్వు ఉండే జంక్ ఫుడ్ కు మధుమేహం వ్యాధి ఉన్నవాళ్లు దూరంగా ఉండాలి. స్కిన్ లెస్ చికెన్ ను భోజనంతో పరిమితంగా తీసుకొవచ్చు. డయాబెటిస్ ఉన్న వ్యక్తులకు ఆల్కహాల్ తీసుకునే అలవాటు ఉంటే పరిమితంగా తాగాలి.

ఒత్తిడిని తగ్గించుకోవాలి

ఒత్తిడికి గురవ్వకుండా..టెన్షన్ తో కూడిన పనులకు డయాబేటిస్ ఉన్నవాళ్లు దూరంగా ఉండాలి. ఒత్తిడికి గురికావడం వల్ల రక్తపోటుకు గురయ్యే అవకాశం ఉంది. గుండెపోటు లేదా గుండె సంబంధిత వ్యాధులకు గురయ్యే ఛాన్స్ ఎక్కువుగా ఉంది. అందుకే ఒత్తిడికి లోనుకాకుండా ప్రతిరోజూ 8 గంటలకు తక్కువ కాకుండా నిద్రపోవాలి. మనస్సు రీలాక్స్ గా ఉంచుకునేందుకు సంగీతం వినడం, సినిమాలు చూడటం వంటివి చూడటం మంచిది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..