AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Eggs Side Effects: పౌష్టికాహారం కోసమని ఎగ్స్ ఎక్కువుగా తింటున్నారా.. ఈ సమస్యలు వచ్చే అవకాశం.. కొంచెం జాగ్రత్త..

పౌష్టికాహారం తీసుకోవాలనుకునే చాలా మంది ప్రిపర్ చేసే ఫుడ్ కోడి గుడ్లు. కొంత మంది ఉదయం అల్ఫాహరంగా, సాయంత్రం స్నాక్స్ గాయ కూడా కోడిగుడ్లను తింటారు. కోడిగుడ్లను రోజూ తినాలని వైద్య నిపుణులే సూచిస్తున్నప్పటికి.. వాటిని ఓ మోతాదులో మాత్రమే తినాలని..

Eggs Side Effects: పౌష్టికాహారం కోసమని ఎగ్స్ ఎక్కువుగా తింటున్నారా.. ఈ సమస్యలు వచ్చే అవకాశం.. కొంచెం జాగ్రత్త..
Eggs
Amarnadh Daneti
|

Updated on: Dec 11, 2022 | 10:30 PM

Share

పౌష్టికాహారం తీసుకోవాలనుకునే చాలా మంది ప్రిపర్ చేసే ఫుడ్ కోడి గుడ్లు. కొంత మంది ఉదయం అల్ఫాహరంగా, సాయంత్రం స్నాక్స్ గాయ కూడా కోడిగుడ్లను తింటారు. కోడిగుడ్లను రోజూ తినాలని వైద్య నిపుణులే సూచిస్తున్నప్పటికి.. వాటిని ఓ మోతాదులో మాత్రమే తినాలని.. ఎక్కువుగా తినడం మంచిది కాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. గుడ్డును సూపర్ ఫుడ్, హెల్తీ ఫుడ్ అంటారు. ఇది సంపూర్ణ ఆహారం. దీనిలో ఎన్నో రకాల పోషకాలుంటాయి. రోజూ బ్రేక్ ఫాస్ట్ లో ఉడకబెట్టిన గుడ్డును తింటే రోజంతా ఎనర్జిటిక్ గా, హుషారుగా ఉంటారు. అందుకే సండే అయినా.. మండే అయినా రోజూ తినండి గుడ్డు అనే మాట పుట్టుకొచ్చింది. ఇందంతా బానే ఉన్నా.. అసలు రోజుకు ఎన్ని గుడ్లను తినాలి.. ఒకవేళ గుడ్లను రోజులో ఎక్కువ సార్లు తింటే ఏమౌతుందో తెలుసుకుందాం. కోడి గుడ్లలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. గుడ్లు మన ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. అందుకే ఆరోగ్య నిపుణులు దీన్ని రోజూ తినాలని చెబుతుంటారు. గుడ్లలో విటమిన్ బి12, విటమిన్ డి, కాల్షియం, ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. అయినా గుడ్లను తినే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఎన్ని గుడ్లు తినాలి

ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి రోజుకు ఒక గుడ్డు తింటే సరిపోతుంది. దీని నుంచి అతని శరీరానికి కావాల్సిన ఎన్నో పోషకాలు అందుతాయి. అయితే ఇది మన జీవన శైలిపై కూడా ఆధారపడి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. మీకు ఏ చిన్న అనారోగ్య సమస్యలు కూడా లేనట్టైతే మూడు గుడ్లను తినొచ్చు. రోజూ రెండుకంటే ఎక్కువ గుడ్లు తినే వాళ్లు రెగ్యులర్ గా వ్యాయామం చేసే వారై ఉండాలి. ఎందుకంటే వ్యాయామం చేసే వారికి ప్రోటీన్ అవసరం ఎక్కువగా ఉంటుంది. ఇవి గుడ్ల నుంచే ఎక్కువగా అందుతాయి.

గుడ్లను ఎక్కువుగా తినడం వల్ల నష్టాలు

అతిసారం 

ఆరోగ్యానికి మేలు చేస్తుందని గుడ్లను మోతాదుకు మించి తింటే మాత్రం ఆరోగ్యం ప్రమాదంలో పడినట్లే. రోజూ ఒక ఉడక బెట్టిన గుడ్డును తింటే చాలు. పరిమితికి మించి తింటే మీరు డయేరియా బారిన పడొచ్చు. దీనివల్ల శరీరం బలహీనంగా తయారవుతుంది. అందుకే గుడ్లను అతిగా తినవద్దని సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మలబద్దకం

గుడ్లను మోతాదుకు మించి తింటే.. జీర్ణవ్యవస్థపై చెడు ప్రభావం పడుతుంది. ఇది మలబద్దకానికి దారితీస్తుంది. ఇక కొన్ని సందర్భాల్లో అయితే కడుపులో చికాకు పుడుతుంది. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ను కూడా ఎదుర్కొంటారు.

కొలెస్ట్రాల్

గుడ్డులో మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో రకాల పోషకాలు లభిస్తాయి. అయితే గుడ్డు పచ్చసొనలో ఎక్కువ మొత్తంలో ఆరోగ్యకరమైన కొవ్వు ఉంటుంది. ఇది శరీరానికి ఎలాంటి హాని కలిగించనప్పటికీ.. ఇది కొవ్వును పెంచుతుంది. అందుకే కొలెస్ట్రాల్ ను తగ్గించుకోవాలనుకునే వారు గుడ్లను తక్కువ మొత్తంలో తినాలి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం చూడండి..

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్