Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WTC Final: చాంపియన్‌షిప్ ఫైనల్‌కు భారత్ చేరాలంటే ఎలా..? ఇంకా ఎన్ని మ్యాచ్‌లు గెలిస్తే సాధ్యమవుతుంది..? ఆ వివరాలు మీ కోసం

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌ అంతర్జాతీయ క్రికెట్‌లో ప్రతిష్టాత్మకమైన ట్రోఫీలలో ఒకటి. వచ్చే ఏడాది జూన్‌లో లండన్‌లోని ఓవల్‌ వేదికగా ఈ చాంపియన్‌షిప్‌ ఫైనల్ జరుగుతుంది. ఈ చాంపియన్‌షిప్ సీజన్‌లో టీమ్‌ఇండియాకు.. ఇంకా ఆరే ఉన్న..

WTC Final: చాంపియన్‌షిప్ ఫైనల్‌కు భారత్ చేరాలంటే ఎలా..? ఇంకా ఎన్ని మ్యాచ్‌లు గెలిస్తే సాధ్యమవుతుంది..? ఆ వివరాలు మీ కోసం
Team India
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Dec 13, 2022 | 10:29 AM

అంతర్జాతీయ క్రికెట్‌లో ప్రతిష్టాత్మకమైన ట్రోఫీలలో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌ కూడా ఒకటి. వచ్చే ఏడాది జూన్‌లో లండన్‌లోని ఓవల్‌ వేదికగా ఈ చాంపియన్‌షిప్‌ ఫైనల్ జరుగుతుంది. ఈ చాంపియన్‌షిప్ సీజన్‌లో టీమ్‌ఇండియాకు ఇంకా ఆరు టెస్టులు మాత్రమే మిగిలి ఉండగా.. బంగ్లాదేశ్ పర్యటనలో భాగంగా రెండు మ్యాచ్‌లను ఆ దేశంతో ఆడనుంది భారత్. అయితే ఇప్పటికే గాయాల కారణంగా జట్టులోని కీలక ఆటగాళ్లు కొందరు సిరీస్‌కు దూరమయ్యారు. ఇక భారత్‌కు మిగిలి ఉన్న ఈ ఆరు మ్యాచ్‌లలో ఏ ఒక్కటి ఓడినా.. చాంపియన్‌షిప్‌పై పెట్టుకున్న ఆశలు గల్లంతయినట్లేనని అనుకోవాలి. అయితే బంగ్లాదేశ్ పర్యటనలో ఉన్న భారత్ రేపటి(డిసెంబర్ 14) నుంచి ఆతిథ్య జట్టుతో రెండు టెస్టుల సిరీస్ ఆడనుంది. మొదటి  మ్యాచ్ బుధవారం చటోగ్రామ్‌లో ప్రారంభమవుతుంది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) ఫైనల్‌కు భారత్ చేరాలంటే పాయింట్ల పట్టికలో అగ్ర లేదా రెండో స్థానాలలో తనను తాను నిలబెట్టుకోవాలి. అందుకు బంగ్లాదేశ్‌లో జరిగే  రెండు ఇంకా స్వదేశంలో ఆస్ట్రేలియాతో ఆడే నాలుగు టెస్టులతో సహా మొత్తం ఆరు మ్యాచ్‌లను తప్పనిసరిగా గెలవాలి .

అయితే ఈ ఆరు మ్యాచ్‌లలో ఏ ఒక్కటి ఓడినా విషయం చేజారినట్లే. ఇక రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ వంటి కీలక ఆటగాళ్లు గాయాల కారణంగా మ్యాచ్‌లకు దూరంగా ఉన్నారు. వీరు లేకుండానే బంగ్లాదేశ్‌తో టీమ్ ‌ఇండియా తన మొదటి మ్యాచ్ ఆడేందుకు ప్రయత్నిస్తోంది. ఈ ఏడాది జూలైలో ఎడ్జ్‌బాస్టన్‌లో వాయిదా పడిన ఐదవ టెస్టులో ఇంగ్లాండ్‌ చేతిలో ఏడు వికెట్ల తేడాతో ఓడిపోయిన తర్వాత భారత్ తన మొదటి టెస్ట్ రేపు ఆడనుంది.

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టిక:

Wtc Standings

WTC Standings

ప్రస్తుతం ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో టీమ్ ఇండియా 52.08 శాతం పాయింట్లతో నాలుగో స్థానంలో ఉండగా, ఆస్ట్రేలియా (75 శాతం పాయింట్లు), దక్షిణాఫ్రికా (60 శాతం పాయింట్లు) ప్రథమ, ద్వితీయ స్థానాల్లో ఉన్నాయి. వెస్టిండీస్‌పై 2-0తో టెస్ట్ సిరీస్‌ను గెలుచుకున్న ఆస్ట్రేలియా.. అగ్రస్థానంలో తమ స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో మొదటి రెండు స్థానాల నుంచి ఆ జట్టును కిందకి నెట్టడం అసాధ్యమనే చెప్పుకోవాలి. మరోవైపు దక్షిణాఫ్రికా కూడా తమ రెండవ స్థానాన్ని కాపాడుకోవాలని చూస్తోంది. ఇక ఆ జట్టుకు ఇంకా ఐదు టెస్టులే మిగిలి ఉన్నాయి. కాగా, 53.33 శాతం పాయింట్లతో పట్టికలో మూడవ స్థానంలో ఉన్న శ్రీలంక ఫైనల్‌కు అర్హత సాధించేందుకు చాలా తక్కువ అవకాశాలు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..