AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sukruthi Ambati: త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్న ‘కేరింత’ నటి.. నెట్టింట వైరల్ అవుతొన్న ఎంగెజ్మెంట్ ఫొటోలు..

సినీ ఇండస్ట్రీలోని కొందరు నటీనటులు తమ తొలి సినిమాతోనే మంచి క్రేజ్ దక్కించుకుంటారు. ముఖ్యంగా స్కూల్ లేదా కాలేజీ లవ్ నేపథ్యంలో తెరకెక్కే సినిమాలలో కనిపించే హీరోయిన్స్.. యూత్‌కు మరింత

Sukruthi Ambati: త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్న ‘కేరింత’ నటి.. నెట్టింట వైరల్ అవుతొన్న ఎంగెజ్మెంట్ ఫొటోలు..
Sukruthi Alias Bhavana
శివలీల గోపి తుల్వా
|

Updated on: Dec 13, 2022 | 12:59 PM

Share

సినీ ఇండస్ట్రీలోని కొందరు నటీనటులు తమ తొలి సినిమాతోనే మంచి క్రేజ్ దక్కించుకుంటారు. ముఖ్యంగా స్కూల్ లేదా కాలేజీ లవ్ నేపథ్యంలో తెరకెక్కే సినిమాలలో కనిపించే హీరోయిన్స్ యూత్‌కు మరింతగా గుర్తుండిపోతారు. అలా తెలుగులో చేసిన ఒకే ఒక్క సినిమాతో మంచి ఫేమ్ తెచ్చుకున్న ఎందరో నటీనటులలో సుకృతి అంబటి కూడా ఒకరు. ఎవరో మీకు అర్థం కాలేదు కదా.. అదేనండీ కేరింత సినిమాలో భావన పాత్రలో నటించిన అమ్మాయి. ఇప్పుడు కొంత వరకు అయినా మీకు గుర్తు వచ్చే అవకాశం ఉంది. కేరింత సినిమాలో నూకరాజు పాత్రకు జంటగా భావన పాత్రలో నటించిన సుకృతి.. తన తొలి సినిమాతో యూత్‌లో మంచి క్రేజ్,ఫాలోయింగ్ తెచ్చుకుంది. కానీ ఎవో తెలియని కారణాలతో కేరింత తర్వాత మరే ఇతర సినిమాలో ఆమె కనిపించలేదు.

అయితే ఇంతకాలం సుకృతి కనిపించకుండా సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో  యాక్టీవ్‌గానే ఉంటూ వచ్చింది. సమయం దొరికినప్పుడల్లా తన ఫోటోలు పోస్ట్ చేస్తుంటుంది ఈ ‘కేరింత’ నటి. ఆ క్రమంలోనే తాజాగా తన నిశ్చితార్థం ఫొటోలను తన ఇన్‌స్టా ఖాతాలో పోస్ట్ చేసి కుర్రకారును ఒక్కసారిగా సర్ప్రైజ్ చేసింది. అక్షయ్ సింగ్ అనే వ్యక్తిని సుకృతి అంబటి అతి త్వరలోనే పెళ్లాడనుంది. ఈ క్రమంలో తాజాగా తమ ఎంగేజ్మెంట్ కి సంబంధించిన ఫోటోలు పోస్ట్ చేసింది.

ఇవి కూడా చదవండి

కాగా, చిన్నతనంలోనే తల్లి చనిపోవడంతో తండ్రి పెంపకంలోనే పెరిగిన సుకృతి.. ఢిల్లీలోని కులచి హన్స్ రాజ్ స్కూల్లో చదువుకుంది. రాజస్థాన్‌లోని బనస్థలి యూనివర్సిటీలో ఇంజినీరింగ్ పూర్తిచేసిన ఆమె తన తాజా పోస్ట్‌లలో తండ్రి గురించి.. ‘మీరు చాలా స్ట్రాంగ్ పర్సన్. ఇంత మంచి నాన్న దొరకడం నా అదృష్టం’ అంటూ ఫోటో క్యాప్షన్ రాసుకొచ్చింది. అలాగే తనకు కాబోయే భర్త గురించి.. ‘నువ్వే నా సూర్యుడు, చంద్రుడు.. అన్నీ తారలు నువ్వే’ అంటూ తన మనసులోని ప్రేమను బయటపెట్టింది. ప్రస్తుతం సుకృతికి సోషల్ మీడియాలోని ఫ్యాన్స్, నెటిజన్స్ విష్ చేస్తున్నారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.