Tollywood: బొమ్మ దద్దరిల్లిపోతది.. ఈ వారం థియేటర్లు/ఓటీటీలో విడుదలయ్యే బ్లాక్‌బస్టర్ చిత్రాలివే..

Theatre/OTT Movies: డిసెంబర్ సెకండ్ వీక్ వచ్చేసింది. గత వారం కంటే ఈ వీక్ సినిమాల సందడి పెరుగుతుందని అందరూ ఊహించారు..

Tollywood: బొమ్మ దద్దరిల్లిపోతది.. ఈ వారం థియేటర్లు/ఓటీటీలో విడుదలయ్యే బ్లాక్‌బస్టర్ చిత్రాలివే..
Movies This Week
Follow us

|

Updated on: Dec 13, 2022 | 1:28 PM

డిసెంబర్ సెకండ్ వీక్ వచ్చేసింది. గత వారం కంటే ఈ వీక్ సినిమాల సందడి పెరుగుతుందని అందరూ ఊహించారు. అయితే కొంచెం డిఫరెంట్‌గా ఆ సందడి కాస్తా తగ్గింది. పాన్ వరల్డ్ మూవీ ‘అవతార్ 2’ థియేటర్లలోకి వస్తుండటంతో పెద్ద చిత్రాలన్నీ సైడ్ అయిపోయాయి. చిన్న చిత్రాలు క్యూ కట్టాయి. మరి అటు థియేటర్లు, ఇటు ఓటీటీలో విడుదలకు సిద్దమవుతున్న సినిమాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం..

  • విజువల్ వండర్‌గా ‘అవతార్ 2’:

‘అవతార్ -2’.. దర్శకుడు జేమ్స్ కామెరూన్ అద్భుత సృష్టి ఈ చిత్రం. ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులందరూ ఈ మూవీ కోసం ఎదురు చూస్తున్నారు. డిసెంబర్ 16న విడుదల కానున్న ఈ సినిమాలో సామ్‌ వర్దింగ్టన్‌, జోయా సాల్దానా, సిగుర్నే వీవర్‌, కేట్‌ విన్స్‌లెట్‌ ప్రధాన పాత్రల్లో కనిపిస్తారు. ‘అవతార్’కి సీక్వెల్‌గా రూపొందిన ఈ చిత్రంలో పాండోరాను కోల్పోయిన నావీ తెగ.. సముద్రంతో ఎలాంటి బంధాన్ని ఏర్పర్చుకుంది.? అనే విషయాలను చూపించనున్నారు.

  • ‘శాసనసభ’:

ఇంద్రసేన, ఐశ్వర్య రాజ్ ప్రధాన పాత్రల్లో దర్శకుడు వేణు మడికంటి తెరకెక్కించిన పాన్ ఇండియన్ మూవీ ‘శాసనసభ’. ఇందులో సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్, నటి సోనియా అగర్వాల్ కీలక పాత్రల్లో కనిపిస్తారు. పొలిటికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం డిసెంబర్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది.

  • ‘ఆక్రోశం’:

అరుణ్ విజయ్, పలక్ లాల్వనీ జంటగా దర్శకుడు జీఎన్‌ఆర్ కుమరవేలన్ తెరకెక్కించిన క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ ‘ఆక్రోశం’. ఈ సినిమాను మేకర్స్ డిసెంబర్ 16న విడుదల చేస్తున్నారు.

  • ‘పసివాడి ప్రాణం’:

అల్లు వంశీ, ఇతి ఆచార్య ప్రధాన పాత్రల్లో ఎన్‌.ఎస్‌.మూర్తి దర్శకుడిగా రూపొందించిన చిత్రం ‘పసివాడి ప్రాణం’. ‘లైవ్‌ కమ్‌ యానిమేషన్‌’ టెక్నాలజీతో ఈ మూవీని తెరకేక్కించగా.. ఇందులో సీరియల్ నటి సుజిత కీలక పాత్ర పోషించారు. డిసెంబర్ 16న థియేటర్ల విడుదల కానుంది.

ఇవే కాదు హీరోయిన్ శ్రీలీల కన్నడంలో నటించిన ‘కిస్’ మూవీ తెలుగులో ‘ఐ లవ్‌ యు ఇడియట్‌’ పేరుతో రిలీజ్ కానుంది. దీనికి ఏపీ అర్జున్ దర్శకుడు కాగా.. విరాట్ హీరోగా నటించాడు. మరో హీరోయిన్ అపూర్వ గౌడ కీలక పాత్రలో కనిపిస్తుంది. అటు మరో చిన్న సినిమా ‘సుందరాంగుడు’ కూడా ఈ వారం విడుదలకు సిద్దం అవుతోంది. ఇవి రెండూ కూడా డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

ఓటీటీ చిత్రాలు, వెబ్ సిరీస్‌ల లిస్టు ఇదే:

  • ఆహా:

ఇంటింటి రామాయణం(తెలుగు) – డిసెంబర్ 16

  • నెట్‌ఫ్లిక్స్:

డాక్టర్ జీ(హిందీ) – డిసెంబర్ 11

అరియిప్పు(మలయాళం) – డిసెంబర్ 16

కోడ్‌ నేమ్‌ తిరంగా(హిందీ) – డిసెంబర్ 16

ఇండియన్‌ ప్రిడేటర్‌: బీస్ట్‌ ఆఫ్ బెంగళూరు(హిందీ) – డిసెంబర్ 16

ది రిక్రూట్‌(వెబ్‌సిరీస్‌) – డిసెంబర్ 16

  • జీ5:

స్ట్రాంగ్‌ ఫాదర్స్‌, స్ట్రాంగ్‌ డాటర్స్‌(ఇంగ్లీష్) – డిసెంబర్ 12

  • డిస్నీ+హాట్‌స్టార్‌:

నేషనల్‌ ట్రెజర్‌: ఎడ్జ్‌ ఆఫ్‌ హిస్టరీ(వెబ్‌సిరీస్‌) – డిసెంబర్ 14

గోవిందా నామ్‌మేరా(హిందీ) – డిసెంబర్ 16

  • అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో:

ఫిజిక్స్‌ వాలా (హిందీ) – డిసెంబర్ 15

జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు