Avatar 2: తెలుగు రాష్ట్రాల్లో అవతార్ 2 హంగామా.. థ్రిల్లింగ్‌ ఎక్స్‌పీరియెన్స్‌ కోసం స్పెషల్‌ స్ర్కీన్స్‌

జేమ్స్ కామెరూన్‌ డైరెక్షన్ లో సినిమా ప్రపంచం లో మొదటిసారిగా అండర్ వాటర్ మోషన్ క్యాప్చర్ టెక్నిక్ ని ఈ అవుతార్ సీక్వెల్లో వాడారు. అవతార్ పార్ట్ వన్ చూసిన ప్రేక్షకులు అదే ఎక్స్‌పెక్టేషన్స్‌తో ఈ సీక్వెల్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే అడ్వాన్స్‌ బుకింగ్‌ కూడా పూర్తయ్యాయి.

Avatar 2: తెలుగు రాష్ట్రాల్లో అవతార్ 2 హంగామా.. థ్రిల్లింగ్‌ ఎక్స్‌పీరియెన్స్‌ కోసం స్పెషల్‌ స్ర్కీన్స్‌
Avatar 2
Follow us
Basha Shek

|

Updated on: Dec 13, 2022 | 3:32 PM

ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రేమికులు వేయికళ్లతో ఎదురుచూస్తోన్న అవతార్‌ 2 (ది వే ఆఫ్ వాటర్) మరో మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. శుక్రవారం (డిసెంబర్‌16) ఈ విజువల్‌ గ్రాండియర్‌ థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్‌ కానుంది. 250 మిలియన్ డాలర్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రంలో ప్రతి ఫ్రేమ్ ఒక అద్భుతం అంటున్నారు మేకర్స్.  జేమ్స్ కామెరూన్‌ డైరెక్షన్ లో సినిమా ప్రపంచం లో మొదటిసారిగా అండర్ వాటర్ మోషన్ క్యాప్చర్ టెక్నిక్ ని ఈ అవుతార్ సీక్వెల్లో వాడారు. దీనికోసం 34 లక్షల లీటర్ల నీటి తో ఒక పెద్ద పూల్ క్రియేట్ చేసి అందులో చిత్రీకరించారు. ఈ సినిమా చిత్రీకరణ కోసం సోని ఒక సరికొత్త కెమెరా ని తీసుకొచ్చింది. అవతార్ పార్ట్ వన్ చూసిన ప్రేక్షకులు అదే ఎక్స్‌పెక్టేషన్స్‌తో ఈ సీక్వెల్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే అడ్వాన్స్‌ బుకింగ్‌ కూడా పూర్తయ్యాయి. ఈ హాలీవుడ్ మూవీ ఇంగ్లిష్‌, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో అవతార్‌2 సినిమా విడుదల కానుంది.

అంతకు మించి..

ఇదిలా ఉంటే విజయవాడ నగరంలో శైలజ థియేటర్లో ముంబై నుంచి ఈ సినిమా కోసం ప్రత్యేకించి ఒక స్క్రీన్ ని తీసుకొచ్చారు..2.6 గైన్ నుండి 3.8 గైన్ స్క్రీన్ గా అప్డేట్ చేశారు శైలజ థియేటర్ నిర్వాహకులు. ఈ అవతార్ సినిమాని ఇలాంటి స్క్రీన్ లో చూస్తే మంచి థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్‌ వస్తుందని శైలజా థియేటర్ నిర్వాహకులు అంటున్నారు. సినిమా ప్రమోషన్ లో భాగంగా అవతార్ వేషధారణతో వేసిన అవతారం చూపరులను ఆకట్టుకుంటుంది. కాగా జేమ్స్ కామెరూన్ దర్శకత్వం వహించిన అవతార్ 2009లో విడుదలైంది. ఇందులో జో సల్దానా, సామ్ వర్తింగ్టన్, సిగౌర్నీ వీవర్, లాజ్ అలోన్సో నటించారు. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా కనీవినీ ఎరుగని కలెక్షన్లు సాధించింది. ఇప్పుడు దీనికి కొనసాగింపుగానే అవతార్‌ 2 (ది వే ఆఫ్‌ వాటర్‌) రిలీజ్‌ కానుంది

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!