IPL 2023: 14 దేశాలు.. 405 మంది ప్లేయర్స్.. ఐపీఎల్ వేలానికి సర్వం సిద్ధం.. కోట్ల వర్షం కురిసేది మాత్రం వీరిపైనే..
IPL 2023 Mini Auction: డిసెంబర్ 23న కొచ్చిలో జరగనున్న ఐపీఎల్ వేలంలో భారత్ సహా 14 దేశాల నుంచి మొత్తం 405 మంది ఆటగాళ్లు పాల్గొననున్నారు. భారత ఆటగాళ్లు 273 మంది వేలంలోకి రానున్నారు.
IPL 2023 Mini Auction: ఐపీఎల్ 2023 మినీ వేలానికి సన్నాహాలు ప్రారంభమయ్యాయి. డిసెంబర్ 23న కొచ్చిలో జరిగే వేలంలో 405 మంది ఆటగాళ్లు పాల్గొననున్నారు. IPL 2023 వేలంలో మొత్తం 10 ఫ్రాంచైజీలు తమ జట్టును పూర్తి చేయడంపైనే ఫోకస్ చేశాయి. మొత్తం 991 మంది ఆటగాళ్లలో, 369 మంది ఆటగాళ్లు వేలం కోసం షార్ట్‌లిస్ట్ చేశారు. అయితే ఫ్రాంచైజీల అభ్యర్థన తర్వాత, మరో 36 మంది ఆటగాళ్లు కూడా ఈ లిస్టులో చేరారు. అంటే వేలంలో పాల్గొనే మొత్తం ఆటగాళ్ల సంఖ్య 405కు చేరింది.
భారత ఆటగాళ్ల సంఖ్య 273 కాగా, 132 మంది విదేశీ ఆటగాళ్లు వేలానికి వెళ్లనున్నారు. వేలంలో ప్రవేశించిన మొత్తం ఆటగాళ్లలో 119 మంది ఆటగాళ్లు అంతర్జాతీయ క్రికెట్ ఆడబోతున్నారు. 282 మంది అన్‌క్యాప్డ్ ప్లేయర్లు.
మినీ వేలంలో భారత్ సహా మొత్తం 14 దేశాలకు చెందిన ఆటగాళ్లు పాల్గొంటారు. చాలా మంది ఆటగాళ్లు భారత్‌కు చెందినవారే కావడం విశేషం. 273 మంది భారతీయ ఆటగాళ్లపై ఫ్రాంచైజీలు పోటీపడనున్నాయి. భారత్ తర్వాత అత్యధికంగా ఇంగ్లండ్ నుంచి 27 మంది ఆటగాళ్లు, దక్షిణాఫ్రికా నుంచి 22 మంది ఆటగాళ్లు వేలానికి ఎంపికయ్యారు.
దేశం | ఆటగాడు |
భారతదేశం | 273 |
ఇంగ్లండ్ | 27 |
దక్షిణ ఆఫ్రికా | 22 |
ఆస్ట్రేలియా | 21 |
వెస్ట్ ఇండీస్ | 20 |
న్యూజిలాండ్ | 10 |
శ్రీలంక | 10 |
ఆఫ్ఘనిస్తాన్ | 8 |
ఐర్లాండ్ | 4 |
బంగ్లాదేశ్ | 4 |
జింబాబ్వే | 2 |
నమీబియా | 2 |
నెదర్లాండ్స్ | 1 |
యూఏఈ | 1 |
13 సెట్లలో ఆటగాళ్ల వేలం..
మినీ వేలంలో 13 సెట్లలో 405 మంది ఆటగాళ్లను వేలం వేయనున్నారు. మొదటి, రెండవ సెట్లలో మయాంక్ అగర్వాల్, అజింక్యా రహానే, జో రూట్, కేన్ విలియమ్సన్, సామ్ కరణ్, కామెరాన్ గ్రీన్, షకీబ్ అల్ హసన్, జాసన్ హోల్డర్ వంటి పేర్లు ఉంటాయి. మూడు, నాలుగో సెట్లలో లిటన్ దాస్, నికోలస్ పూరన్, జయదేవ్ ఉనద్కట్, ఆడమ్ మిల్నే సహా పలువురు ఆటగాళ్లు ఉంటారు. 19 మంది విదేశీ ఆటగాళ్లతో సహా రూ.2 కోట్లు అత్యధిక బేస్ ధర. 1.5 బేస్ ప్రైస్‌లో 11 మంది, మనీష్ పాండే, మయాంక్ అగర్వాల్ సహా కోటి బేస్ ప్రైస్‌లో 20 మంది ఆటగాళ్లు ఉన్నారు.
రూ. 2 కోట్ల బేస్ ప్రైస్ ఉన్న ప్లేయర్స్..
టామ్ బాంటన్, సామ్ కర్రాన్, క్రిస్ జోర్డాన్, టైమల్ మిల్స్, జామీ ఓవర్‌టన్, క్రెయిగ్ ఓవర్‌టన్, ఆదిల్ రషీద్, ఫిల్ సాల్ట్, బెన్ స్టోక్స్, కామెరాన్ గ్రీన్, ట్రావిస్ హెడ్, క్రిస్ లిన్, కేన్ విలియమ్సన్, ఆడమ్ మిల్నే, రిలే రస్సో, రాస్సీ వాండర్ డస్సెన్, హోల్డర్, నికోలస్ పూరన్ లాంటి కీలక ఆటగాళ్లు రూ. 2 కోట్ల బేస్ ప్రైస్ కలిగి ఉన్నారు.
రూ. 1.5 కోట్ల బేస్ ప్రైస్ ఉన్న ప్లేయర్స్..
సీన్ అబాట్, రైలీ మెరెడిత్, ఝై రిచర్డ్‌సన్, ఆడమ్ జంపా, షకీబ్ అల్ హసన్, హ్యారీ బ్రూక్స్, విల్ జాక్స్, డేవిడ్ మలన్, జాసన్ రాయ్, షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, నాథన్ కౌల్టర్-నైల్ లాంటి ఆటగాళ్లు ఈ లిస్టులో ఉన్నారు.
రూ. 1 కోటి ప్రాథమిక ధర కలిగిన ఆటగాళ్లు వీరూ..
మయాంక్ అగర్వాల్ , మనీష్ పాండే, మహ్మద్ నబీ, ముజీబ్ ఉర్ రెహమాన్, మోయిసెస్ హెన్రిక్స్, ఆండ్రూ టై, జో రూట్, ల్యూక్ వుడ్, మైఖేల్ బ్రేస్‌వెల్, కైల్ జామీసన్, మాట్ హెన్రీ, టామ్ లాథమ్, డారిల్ మిచెల్, హెన్రిచ్ క్లాసెన్, రోస్సాల్టన్ పెరహమ్, రోస్సాల్టన్ పెరహమ్, చేజ్, రహ్కీమ్ కార్న్‌వాల్, షాయ్ హోప్, డేవిడ్ వీస్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..