Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Green Coriander Juice: బరువు తగ్గడం నుంచి రోగ నిరోధక శక్తిని పెంచడం వరకు.. కొత్తిమీర రసంతో ఎన్నో ప్రయోజనాలు..

Coriander Juice Health Benefits: ఇందులో ప్రోటీన్, కొవ్వు, ఫైబర్, కార్బోహైడ్రేట్, కాల్షియం, ఫాస్పరస్, ఐరన్, కెరోటిన్, థయామిన్, పొటాషియం, విటమిన్ సి వంటి మూలకాలు ఉంటాయి. ఇది అనేక వ్యాధుల నుంచి మిమ్మల్ని రక్షించడంలో సహాయపడుతుంది.

Green Coriander Juice: బరువు తగ్గడం నుంచి రోగ నిరోధక శక్తిని పెంచడం వరకు.. కొత్తిమీర రసంతో ఎన్నో ప్రయోజనాలు..
Green Coriander Juice
Follow us
Venkata Chari

|

Updated on: Dec 13, 2022 | 10:38 AM

పచ్చి కొత్తిమీరను ఎక్కువగా వంటలలో ఉపయోగిస్తుంటారు. అలాగే పచ్చి కొత్తిమీర వంటల రుచిని రెండింతలు పెంచుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే మీరు ఎప్పుడైనా పచ్చి కొత్తిమీర జ్యూస్ (Green Coriander Juice) తాగారా? పచ్చి కొత్తిమీర రసం తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. ఎందుకంటే పచ్చి కొత్తిమీరలో ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. పచ్చి కొత్తిమీర రసం తీసుకోవడం వల్ల బరువు తగ్గుతారు. అలాగే పచ్చి కొత్తిమీర రసం కూడా అనేక ఆరోగ్య సంబంధిత సమస్యలను దూరం చేయడంలో సహాయపడుతుంది. ఎందుకంటే పచ్చి కొత్తిమీరలో ప్రోటీన్, కొవ్వు, ఫైబర్, కార్బోహైడ్రేట్, కాల్షియం, ఫాస్పరస్, ఐరన్, కెరోటిన్, థయామిన్, పొటాషియం, విటమిన్ సి వంటి మూలకాలు ఉంటాయి. ఇది అనేక వ్యాధుల నుంచి మిమ్మల్ని రక్షించడంలో సహాయపడుతుంది. కాబట్టి పచ్చి కొత్తిమీర రసం తాగడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

పచ్చి కొత్తిమీర రసం తాగడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి..

1. బాడీని డిటాక్స్ చేయడంలో..

పచ్చి కొత్తిమీర రసం తీసుకోవడం వల్ల శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్స్ తొలగిపోతాయి. ఎందుకంటే శరీరాన్ని నిర్విషీకరణ చేయడంలో సహాయపడే అనేక అంశాలు ఇందులో ఉన్నాయి. దీని వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది.

ఇవి కూడా చదవండి

2. బరువు తగ్గేందుకు..

పెరుగుతున్న బరువు గురించి ఆందోళన చెందుతున్నారా.. మీరు కచ్చితంగా బరువు తగ్గాలని కోరుకుంటే, పచ్చి కొత్తిమీర రసం తప్పక తీసుకోవాలి. ఎందుకంటే ఇందులో ఉండే గుణాలు బరువును అదుపులో ఉంచుతాయి.

3. ఎముకలకు మంచిది..

పచ్చి కొత్తిమీర రసం తీసుకోవడం వల్ల ఎముకల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. ఎందుకంటే పచ్చి కొత్తిమీర రసంలో కాల్షియం, మెగ్నీషియం పుష్కలంగా ఉన్నాయి. ఇది ఎముకలను బలపరుస్తుంది. ఎముక సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

4. రోగనిరోధక శక్తి పెరుగుతుంది..

పచ్చి కొత్తిమీర రసంలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. అందుకే ఈ జ్యూస్‌ని తీసుకుంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దీనివల్ల వైరస్‌లు, బ్యాక్టీరియా బారిన పడకుండా ఉండొచ్చు.

5. రక్తపోటు అదుపులో ఉంటుంది..

అధిక రక్తపోటు సమస్య ఉన్నప్పుడు పచ్చి కొత్తిమీర రసం తీసుకోవడం వల్ల మేలు జరుగుతుంది. పచ్చి కొత్తిమీరలో మంచి మొత్తంలో పొటాషియం ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇది గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.

6. గుండెకు మంచిది..

పచ్చి కొత్తిమీర రసం తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. ఎందుకంటే పచ్చి కొత్తిమీరలో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్‌ను పెంచడంలో సహాయపడుతుంది. దీని వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది.

7. జీర్ణవ్యవస్థ బలపడుతుంది..

జీర్ణక్రియకు సంబంధించిన సమస్య ఉంటే పచ్చి కొత్తిమీర రసం తీసుకోవడం మంచిది. ఎందుకంటే ఇందులో ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను బలోపేతం చేయడం, జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలను తొలగించడంలో సహాయపడుతుంది.

8. మధుమేహం తగ్గేందుకు..

పచ్చి కొత్తిమీర రసం తీసుకోవడం మధుమేహ వ్యాధిగ్రస్తులకు చాలా మేలు చేస్తుంది. ఎందుకంటే ఈ జ్యూస్‌లో యాంటీ డయాబెటిక్ లక్షణాలు ఉన్నాయి. ఇది రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది.

9. చర్మానికి ఎంతో మంచిది..

పచ్చి కొత్తిమీర రసాన్ని తీసుకోవడం వల్ల చర్మానికి అనేక ప్రయోజనాలు కలుగుతాయి. ఎందుకంటే పచ్చి కొత్తిమీర రసం తాగడం వల్ల శరీరంలోని టాక్సిన్స్ తొలగిపోతాయి. ఇది అనేక చర్మ సంబంధిత సమస్యలను దూరం చేస్తుంది . చర్మం మెరిసేలా కూడా చేస్తుంది.

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం కేవలం అవగాహన కోసమే అని గుర్తించాలి. అర్హత కలిగిన వైద్య అభిప్రాయానికి ఇది ఏ విధంగానూ ప్రత్యామ్నాయం కాదు. వీటిని పాటించే ముందు నిపుణుడిని లేదా వైద్యుడిని సంప్రదించాలి.

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..