Watch Video: మరపురాని విజయం.. అదే లెవల్లో సెలబ్రేషన్స్.. తల్లితో కలసి స్టెప్పులేసిన స్టార్ ప్లేయర్..

Fifa World Cup 2022: ఈ విజయం మొరాకో ఆటగాళ్లకు చాలా పెద్దది. అందుకే మ్యాచ్ ముగిసిన తర్వాత వారు దానిని ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు.

Watch Video: మరపురాని విజయం.. అదే లెవల్లో సెలబ్రేషన్స్.. తల్లితో కలసి స్టెప్పులేసిన స్టార్ ప్లేయర్..
Sofiane Boufal Dance With His Mother Video
Follow us
Venkata Chari

|

Updated on: Dec 11, 2022 | 9:35 AM

Fifa World Cup 2022: గత రాత్రి ఫిపా ప్రపంచ కప్ 2022లో, మొరాకో టీం పోర్చుగల్‌పై తిరుగులేని విజయం సాధించి చరిత్ర సృష్టించింది. మొరాకో 1-0తో పోర్చుగల్‌ను ఓడించి టోర్నీలో సెమీ-ఫైనల్‌కు చేరుకుంది. ఈ విజయం మొరాకో ఆటగాళ్లకు చాలా పెద్దది. అందుకే మ్యాచ్ ముగిసిన తర్వాత వారు దానిని ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. మొరాకో కోసం వింగర్ లేదా అటాకింగ్ మిడ్‌ఫీల్డర్‌గా ఆడే సోఫీ బౌఫాల్, ఈ విజయాన్ని తన తల్లితో కలిసి సెలబ్రేట్ చేసుకున్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో తగె వైరల్ అవుతోంది.

బౌఫాల్, అతని తల్లి మ్యాచ్ ముగిసిన తర్వాత మైదానంలో డ్యాన్స్ చేయడం వీడియోలో చూడొచ్చు. ఈ విజయంతో ఇద్దరూ చాలా సంతోషంగా ఉన్నారు. బౌఫాల్, అతని తల్లి కలిసి డ్యాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కొద్ది గంటల్లోనే దాదాపు లక్షన్నర మంది ఈ వీడియోను వీక్షించారు.

ఇవి కూడా చదవండి

చరిత్ర సృష్టించిన మొరాకో..

ప్రపంచకప్‌లో సెమీఫైనల్‌కు చేరిన తొలి ఆఫ్రికన్ జట్టుగా పోర్చుగల్‌ను ఓడించి మొరాకో చరిత్ర సృష్టించింది. తొలి అర్ధభాగంలో ఏ జట్టు కూడా గోల్ చేయలేకపోయింది. కానీ రెండో అర్ధభాగంలో మొరాకో గోల్ చేయడం ద్వారా మ్యాచ్‌పై పట్టును పటిష్టం చేసుకుంది. మొరాకో టోర్నమెంట్ అంతటా డీప్ డిఫెన్స్ ఆడింది. ఈ మ్యాచ్‌లో కూడా వారి డిఫెన్స్ బలాన్నే నమ్ముకుంది. ఈ ఓటమితో క్రిస్టియానో ​​రొనాల్డో ప్రపంచకప్‌ కల మరోసారి చెదిరిపోయింది. ఇప్పుడు సెమీస్‌లో ఫ్రాన్స్‌తో తలపడనుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం