AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: బ్రెజిల్‌ ఓటమికి ఆ పిల్లి శాపమే కారణం? ఇదిగో సాక్ష్యం అంటోన్న ఫ్యాన్స్..

FIFA WC 2022: బ్రెజిల్‌ జట్టు ఫిఫా వరల్డ్ కప్ 2022 క్వార్టర్ ఫైనల్స్ భారీ పరాజయాన్ని చవిచూసింది. పెనాల్టీ షూటౌట్‌లో క్రొయేషియా బ్రెజిల్‌ను ఓడించింది. ఆ తర్వాత ప్రజలు బ్రెజిల్‌ను తీవ్రంగా ట్రోల్ చేశారు.

Watch Video: బ్రెజిల్‌ ఓటమికి ఆ పిల్లి శాపమే కారణం? ఇదిగో సాక్ష్యం అంటోన్న ఫ్యాన్స్..
Fifa World Cup 2022 Brazil Viral Video
Venkata Chari
|

Updated on: Dec 11, 2022 | 7:11 AM

Share

ఫిఫా వరల్డ్ కప్ 2022లో, ఐదుసార్లు ప్రపంచ కప్ విజేత బ్రెజిల్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో క్రొయేషియా చేతిలో ఓటమిని ఎదుర్కోవలసి వచ్చింది. ఈ మ్యాచ్‌లో పెనాల్టీ షూటౌట్‌లో క్రొయేషియా 4-2తో బ్రెజిల్‌ను ఓడించింది. ఈ మ్యాచ్ శుక్రవారం జరిగింది. ఈ మ్యాచ్‌కు ముందు, బ్రెజిల్ ప్రపంచానికి బలమైన పోటీదారుగా పరిగణించారు. క్వార్టర్‌ఫైనల్‌లో బ్రెజిల్‌ ఓటమి తర్వాత అభిమానులు సోషల్‌ మీడియాలో బ్రెజిల్‌పై విమర్శలు గుప్పించారు. ఈ మేరకు ఫ్యాన్స్ ఓ పిల్లి వీడియోను షేర్ చేస్తూ, ట్రోల్ చేయడం ప్రారంభించారు. ఈ పిల్లి వల్ల బ్రెజిల్‌కు శాపం తగిలిందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

బ్రెజిల్ పిల్లి శాపానికి గురైందా?

బ్రెజిల్ ఓటమి తర్వాత సోషల్ మీడియాలో చాలా వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోలలో బ్రెజిల్ జట్టు పిల్లితో తప్పుగా ప్రవర్తించింది. బ్రెజిల్ స్టార్ ప్లేయర్ వినిసియస్ జూనియర్ మీడియా సమావేశం నిర్వహిస్తున్నట్లు వీడియోలో చూడవచ్చు. ఇంతలో ఒక పిల్లి అతని టేబుల్ దగ్గరకు వచ్చింది. ఆ పిల్లిని రెండు చేతులతో ఎత్తుకుని టేబుల్ కింద పడేశాడు. ఈ వీడియోనే బ్రెజిల్ ఓటమికి కారణమని అభిమానులు ఆరోపిస్తున్నారు. ఈ పిల్లి వల్ల జట్టు శాపానికి గురైందని ప్రజలు అంటున్నారు.

ఇవి కూడా చదవండి

నెట్టింట్లో విపరీతమైన ట్రోల్స్..

వీడియోను షేర్ చేస్తూ, ఒక వినియోగదారు బ్రెజిలియన్ భాషలో ఇలా వ్రాశాడు, “పిల్లి విజయాన్ని ఇవ్వాలని అనుకుంది, కానీ అవమానం జరిగింది” అంటూ రాసుకొచ్చాడు. ఈ పిల్లి బ్రెజిల్‌ను శపించిందని మరొక వినియోగదారు కామెంట్ చేశాడు.

కాగా, క్రొయేషియా సెమీఫైనల్‌కు చేరుకోవడం గమనార్హం. ఈ జట్టు తన సెమీ-ఫైనల్ మ్యాచ్‌ను డిసెంబర్ 14వ తేదీ బుధవారం లియోనెల్ మెస్సీ జట్టు అర్జెంటీనాతో ఆడుతుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..