AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BAN vs IND: 25 ఏళ్ల వయసులో ట్రిపుల్ సెంచరీ.. 5 ఏళ్ల క్రితం చివరి మ్యాచ్.. టీమిండియాలో మరో ఛాన్స్ కోసం వెరైటీ ట్వీట్..

ట్రిపుల్ సెంచరీ చేసిన ఆ ఇన్నింగ్స్ తర్వాత, భారత బ్యాట్స్‌మన్ మరో 4 టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు. కానీ, ఆ తర్వాత జట్టులోకి తిరిగి రాలేకపోయాడు.

BAN vs IND: 25 ఏళ్ల వయసులో ట్రిపుల్ సెంచరీ.. 5 ఏళ్ల క్రితం చివరి మ్యాచ్.. టీమిండియాలో మరో ఛాన్స్ కోసం వెరైటీ ట్వీట్..
Ban Vs Ind Karun Nair Tweet Viral
Venkata Chari
|

Updated on: Dec 11, 2022 | 8:35 AM

Share

ట్రిపుల్ సెంచరీ సాధించిన బ్యాట్స్‌మెన్ ఇప్పటికీ జట్టులో చోటు దక్కించుకోవడం చాలా అరుదు. కానీ, కరుణ్ నాయర్ దీనికి మినహాయింపు కాదు. 31 ఏళ్ల కరుణ్ నాయర్ 25 ఏళ్ల వయసులో టెస్టు క్రికెట్‌లో ట్రిపుల్ సెంచరీ సాధించాడు. అది కూడా తన కెరీర్‌లో రెండో టెస్టు మ్యాచ్ ఆడుతున్నప్పుడు. ఇంగ్లండ్‌తో జరిగిన ఆ ఇన్నింగ్స్ తర్వాత కరుణ్ నాయర్ మరో 4 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. కానీ, ఆ తర్వాత మళ్లీ పునరాగమనం చేయలేకపోయాడు. కానీ, ఇప్పుడు జైదేవ్ ఉనద్కత్ రీఎంట్రీ ఇవ్వడం చూసి, అతను కూడా విష్ చేశాడు.

వాస్తవానికి, కరుణ్ నాయర్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో అతను క్రికెట్‌కు వినయపూర్వకమైన అభ్యర్థన చేస్తూ మరో అవకాశం అడుగుతున్నాడు. నాయర్ చేసిన ఈ ప్రయత్నం సరిగ్గా ఉనద్కత్ చేసినట్లే, తాజగా కరణ్ కూడా విజయం సాధించాడు.

కరుణ్ నాయర్ మరో అవకాశం కోసం ఎదురుచూస్తున్నాడు..

ఉనద్కత్ ఏం చేశాడో చెప్పే ముందు కరుణ్ నాయర్ ట్వీట్ గురించి తెలుసుకుందాం. “ప్రియమైన క్రికెట్, నాకు మరో అవకాశం ఇవ్వండి” అని రాసుకొచ్చాడు.

టెస్ట్ క్రికెట్‌లో ట్రిపుల్ సెంచరీ చేసిన నాయర్ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ కావడానికి ఎక్కువ సమయం పట్టలేదు. ఆయన చేసిన ఈ ట్వీట్‌పై ప్రజల స్పందన కూడా తెరపైకి వచ్చింది. టీమిండియా మాజీ క్రికెటర్ దోడా గణేష్ స్పందిస్తూ తనపై నమ్మకం ఉంచాలని చెప్పుకొచ్చాడు. అతను ఖచ్చితంగా తిరిగి వస్తానని కూడా రాసుకొచ్చాడు.

జనవరి 2022లో ఉనద్కత్ చేసిన ట్వీట్ వైరల్..

ఈ ఏడాది జనవరిలో ఫాస్ట్ బౌలర్ జయదేవ్ ఉనద్కత్ చేసిన ట్వీట్ కూడా వైరల్ అయింది. ఆ సమయంలో ఉనద్కత్ – “ప్రియమైన రెడ్ బాల్, దయచేసి నాకు మరో అవకాశం ఇవ్వండి, నేను మీకు కోపం తెప్పించను” అంటూ ట్వీట్ చేశాడు.

ఉనద్కత్ తర్వాత కరుణ్ ఎదురుచూపులు ముగుస్తాయా?

బంగ్లాదేశ్ టూర్ నుంచి షమీకి బదులుగా అతనిని పిలిచిన వెంటనే ఉనద్కత్ కోరిక నెరవేరింది. మరి రాబోయే రోజుల్లో కరుణ్ నాయర్ టీమ్ ఇండియా తరపున మళ్లీ ఆడతాడనే ఎదురుచూపు కూడా ఫలిస్తుందేమో చూడాలి. 2016లో భారత్ తరపున అరంగేట్రం చేసిన కరుణ్ నాయర్ తన చివరి అంతర్జాతీయ మ్యాచ్‌ను 5 సంవత్సరాల క్రితం అంటే 2017లో ధర్మశాలలో ఆస్ట్రేలియాతో ఆడాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..