AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Side Effects Of Raisins: ఆరోగ్యానికి మంచిదని ఎండు ద్రాక్షలను అతిగా తింటున్నారా.? మొదటికే మోసం వస్తుంది జాగ్రత్త..

కిస్మిస్ ను ఎక్కువుగా తింటే ఆహారం జీర్ణం కావడంలో సమస్యలు ఎదురుకావచ్చని నిపుణుల మాట..అలాగే ఇది షుగర్ లెవెల్స్ ను పెంచే అవకాశం ఉందని చెబుతున్నారు. బరువు పెరిగేందుకు కూడా దోహదం చేస్తుందని పేర్కొంటున్నారు.

Side Effects Of Raisins: ఆరోగ్యానికి మంచిదని ఎండు ద్రాక్షలను అతిగా తింటున్నారా.? మొదటికే మోసం వస్తుంది జాగ్రత్త..
Raisins
TV9 Telugu Digital Desk
| Edited By: Narender Vaitla|

Updated on: Dec 13, 2022 | 3:20 PM

Share

ఎండు ద్రాక్షను మనం వాడుకలో భాషలో కిస్మిస్‌లుగా పిలుస్తుంటాం. వీటిని తీసుకోవడం వల్ల అనే ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వైద్యులు కూడా ఎండు ద్రాక్షను ఆహారంలో భాగం చేసుకోమని సూచిస్తుంటారు. ఎండు ద్రాక్షలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరంలో ఐరన్‌ స్థాయిలు పెరుగుతాయి, జీర్ణక్రియ సజావుగా సాగుతుంది, ఎముకలు బలంగా మారుతాయి.

ఇలా చెప్పుకుంటే వీటివల్ల కలిగే ప్రయోజనాలు అనేకం. అయితే అతి ఎప్పుడూ అనర్థానికే దారి తీస్తుందన్నట్లు ఎండు ద్రాక్షవల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో, అతిగా తీసుకుంటే అనర్థాలు కూడా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. కిస్మిస్‌లను అతిగా తీసుకుంటే జీర్ణ సంబంధిత సమస్యలు, షుగర్ లెవెల్స్ పెరగడం, బరువు పెరగడం వంటి సమస్యలకు దారి తీసే ప్రమాదం ఉందని చెబుతున్నారు.

కిస్మిస్ ను తినడం వల్ల వచ్చే దుష్ప్రభావాలు

జీర్ణక్రియ సమస్య

ఎండుద్రాక్షలో ఫైబర్ పుష్కలంగా ఉన్నందున మీ జీర్ణక్రియ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, అయితే వాటిని ఎక్కువగా తినడం వల్ల ఇతర పోషకాల శాతం తగ్గుతుంది. ఎక్కువ నీరు తీసుకోకుండా ఎండుద్రాక్ష ఎక్కువగా తీసుకోవడం వల్ల డీహైడ్రేషన్, అజీర్ణం, ఇతర రుగ్మతలు ఏర్పడవచ్చు.

ఇవి కూడా చదవండి

షుగర్ సమస్య

ఎండు దాక్ష అంటే సహజంగానే తీపి పదార్థకం ఇందో అధిక చక్కెర, కేలరీలు ఉంటాయి. కాబట్టి, డయాబెటిస్‌తో బాధపడేవారు ఎండుద్రాక్షను తీసుకుంటే షుగర్ లెవెల్స్ పెరిగే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

బరువు పెరిగే అవకాశాలు

ఎండుద్రాక్షలో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి, మీరు బరువు తగ్గే ప్రయాణంలో ఉంటే, మీరు దానిని తీసుకోకపోవడం మేలు. ఒక వేళ తీసుకోవాల్సి వచ్చినా మితంగా తీసుకోవడం మంచిది.

కణాలకు నష్టం

ఎండు ద్రాక్షలో పాలీఫెనాల్స్, బయోఫ్లేవనాయిడ్స్ మరియు ఫైటోన్యూట్రియెంట్స్ వంటి వివిధ యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి, ఎండుద్రాక్షను ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆరోగ్యకరమైన కణాలకు ఆక్సీకరణ నష్టం జరగవచ్చు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి