పోషకాహారంతో రుతుక్రమ సమస్యలకు చెక్
ఆడవాళ్లలో ప్రతి నెలా వచ్చే రుతుక్రమ సమయంలో వచ్చే నొప్పిని వారు భరిస్తూ ఉంటారు. అలాగే ఆ సమయంలో వారు ఋతుస్రావం వల్ల అలసట, ఉబ్బరం, రొమ్ము సున్నితత్వం, పొత్తికడుపు తిమ్మిరి, మానసిక కల్లోలం , చర్మం పగుళ్లు వంటి సమస్యలతో బాధపడుతుంటారు.
ఆడవాళ్లలో ప్రతి నెలా వచ్చే రుతుక్రమ సమయంలో వచ్చే నొప్పిని వారు భరిస్తూ ఉంటారు. అలాగే ఆ సమయంలో వారు ఋతుస్రావం వల్ల అలసట, ఉబ్బరం, రొమ్ము సున్నితత్వం, పొత్తికడుపు తిమ్మిరి, మానసిక కల్లోలం , చర్మం పగుళ్లు వంటి సమస్యలతో బాధపడుతుంటారు. ప్రతి నెలా వచ్చే సమస్యే కదా అని వారు లైట్ తీసుకుంటారు. కానీ రుతుక్రమ సమయంలో వచ్చే ఏ చిన్న ఇబ్బందైనా ధీర్ఘకాలంలో సమస్యలకు గురి చేసే అంశం కావచ్చని నిపుణులు సూచిస్తున్నారు. సరైన పోషకాహారంతో రుతుక్రమ సమస్యలకు చెక్ పెట్టవచ్చని వివరిస్తున్నారు.
పోషకాహారం కచ్చితంగా మీ హార్మోన్లు, రుతు చక్ర క్రమంపై ప్రభావం చూపుతుందని వారు చెబుతున్న మాట. చాలా కాలంగా ఒకే రకమైన ఆహార అలవాట్ల ఉంటే రుతుస్రావం క్రమం తప్పకుండా వచ్చినా స్త్రీల సెక్స్ హర్మోన్ల ఉత్పత్తి, నియంత్రణపై ప్రభావం పడవచ్చని చెబుతున్నారు. నిర్ధిష్ట ఆహార నియమాలు పాటిస్తే మానసిక స్థితి ప్రభావితమై పిరియడ్స్ లక్షణాలను తగ్గించడంలో సాయం చేస్తాయని పేర్కొంటున్నారు. రుతుక్రమ సమస్యల నుంచి బయటపడడానిక కచ్చితంగా కొన్ని నెలలపాటు తృణ ధాన్యాలు, పండ్లు, కూరగాయలు, గింజలు వంటి ఆహారాన్ని క్రమం తప్పకుండా తీసుకోవాలని అంటున్నారు.
సాధారణంగా 28 రోజులకు రుతు క్రమ సమయాన్ని లెక్కిస్తారు. ఈ సమయాన్ని వివిధ దశల్లో పేర్కొంటారు. ప్రతి దశలోనూ ప్రత్యేకమైన ఆహార నియమాలను పాటించాల్సి ఉంటుంది. ఈ 28 రోజుల్లోని వివిధ దశల్లో ఏ సమయంలో ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలో తెలుసుకుందాం.
రుతుక్రమం పూర్తయిన 1 నుంచి 5 రోజులు ముఖ్యంగా ఐరన్ కోల్పోతారు కాబట్టి ఆకు కూరలు, మాంసం, గుడ్డు, డార్క్ చాక్లెట్ వంటి పోషకాహారాన్ని తీసుకోవాలి. అలాగే 1 నుంచి 14 రోజులను ఫోలిక్యులర్ దశగా చెబుతారు. ఈ దశ చాలా కీలమైంది. ఈస్ట్రోజన్ పెరిగే ఇలాంటి సమయంలో ఆడవారు గర్భధారణకు అవసరమైన పోషకాహారాన్ని శరీరానికి అందించాల్సి ఉంటుంది. పిండి పదార్థాలు, బంగాళదుంప వంటి ఆహారాన్ని తీసుకోవడం చాలా ఉత్తమం వీటితో పాటు అధికంగా నీటిని తాగాలి.
రుతుక్రమానికి 14 రోజులు ముందు కాలాన్ని లూటియల్ దశ అంటారు. ిది చాలా కీలక సమయం. ఈ సమయంలో అండాశయం నుండి గుడ్డు విడుదలై సంభావ్య ఫలదీకరణం కోసం ఫెలోపియన్ ట్యూబ్‌కు వెళ్లినప్పుడు శరీరంలో ఉష్ణోగ్రత పెరుగుదలను గమనిస్తాం. అలాగే తుంటి నొప్పిని కూడా గమనిస్తాం. ఈ నేపథ్యంలో కార్భోహైడ్రేట్లు, విటమిన్లు, కొవ్వు పదార్థాలు ఉండే ఆహారం తీసుకోవడ శ్రేయస్కరం. ఆకు కూరలు, బీన్స్ వంటి వాటిల్లో ఉండే యాంటి ఆక్సిడెంట్లు మన శరీరానికి మేలు చేస్తాయి. కాబట్టి వాటిని తీసుకోవడం ఉత్తమం. ఈ సమయంలో విటమిన్ డీ శరీరానికి చాలా అవసరమని గుర్తుపెట్టుకుని పాలు, గుడ్లు కూడా తప్పనిసరిగా తీసుకోవాలి.
14 నుంచి 28 రోజుల సమయంలో శరీరం రుతుస్రావానికి సిద్ధమవుతుంది. ఈ సమయంలో సంభావ్య గర్భధారణ కోసం గర్భాశయ పొరను నిర్వహించడానికి ప్రొజెస్టెరాన్ స్థాయిలను పెంచడానికి కొన్ని నిర్ధిష్ట ఆహార నియమాలను పాటించాలి. ఈ సమయంలో మన శరీరం కూడా ఆహార కోరికను వ్యక్తపరుస్తుంది. అందువల్ల అధిక ప్రోటీన్లు ఉండే ఆహారాన్ని తీసుకోవడం ఉత్తమం. అలాగే మరికొందరిలో ఆకలిలో మార్పులు, బరువు పెరగడం, పొత్తికడుపు నొప్పి, వికారం, మలబద్ధకం వంటి లక్షణాలను గమనిస్తారు. ఈ లక్షణాలున్న వారు ఫైబర్, ప్రోటీన్ ఉన్న ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలి.
శరీర తత్వాన్ని బట్టి అవసరమైన పోషకాహారాన్ని అందిస్తే అధిక మేలు జరుగుతుందని నిపుణుల అభిప్రాయం. క్రమం తప్పకుండా పోషకాహారం తీసుకున్నా రుతుక్రమ సమస్యతో బాధపడితే తప్పి సరిగా వైద్యులను సంప్రదించాలి.