AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sugar Control Tips: మీ షుగర్ లెవెల్స్ ను ఎలా కంట్రోల్ చేసుకోవాలో తెలుసా.? అయితే ఇది చదవండి..

లోషుగర్ కారణంగా గుండె వేగంగా కొట్టుకోవడం, చెమటలు పట్టడం, తూలినట్టు అనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. అధిక షుగర్ కారణంగా శరీరం అలసటకు గురైనట్టు అనిపించడం..

Sugar Control Tips: మీ షుగర్ లెవెల్స్ ను ఎలా కంట్రోల్ చేసుకోవాలో తెలుసా.? అయితే ఇది చదవండి..
Sugar Control Tips High Sugar Low Sugar Tips
Follow us
Anil kumar poka

|

Updated on: Dec 12, 2022 | 9:20 AM

మామూలుగా మనం షుగర్ లెవెల్స్ కారణంగా ఇబ్బంది పడుతుంటాం. కానీ అది గమనించం. అయితే డయాబెటిక్ పేషేంట్స్ చాలా మంది తరచూ తమ షుగర్ లో హెచ్చుతగ్గులు గమనిస్తూ ఉంటారు. షుగర్ లెవెల్ తగ్గినప్పుడు కూడా షుగర్ తగ్గడానికి వేసుకునే ట్యాబ్లెట్స్ వేసుకోవడంతో అది మరింత తగ్గి ప్రాణాపాయ స్థితిలోకి వెళ్తుంటారు. అయితే మరికొంత మందికి షుగర్ లెవెల్స్ పెరిగినా లో షుగర్ ఉందనుకుని షుగర్ పెరగడానికి ట్యాబ్లెట్స్ వేసుకోవడంతో ఇబ్బంది పడతారు. అయితే కొన్ని ఆహార నియమాలు పాటించడం వల్ల వీటి నుంచి ఈ ఇబ్బంది నుంచి బయటపడవచ్చు.

లోషుగర్ కారణంగా గుండె వేగంగా కొట్టుకోవడం, చెమటలు పట్టడం, తూలినట్టు అనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. అధిక షుగర్ కారణంగా శరీరం అలసటకు గురైనట్టు అనిపించడం, కళ్లు బయర్లు కమ్మడం, శరీర బరువు కోల్పోవడం వంటి లక్షణాలు గమనిస్తాం.

షుగర్ అధికంగా ఉన్న సమయంలో దాన్ని స్థిరీకరించడానికి ప్యాంక్రియాస్ తగిన మొత్తంలో ఇన్సులిన్ రిలీజ్ చేసి షుగర్ ను స్థిరీకరించడానికి సాయపడుతుంది. అయితే షుగర్ తక్కువగా ఉన్న సమయంలో గ్లూకగాన్ మరింతగా రిలీజ్ చేసి షుగర్ లెవెల్స్ ను నార్మల్ గా ఉంచుతుంది.

రక్తంలో ఉండే గ్లూకోజ్ షుగర్ హెచ్చుతగ్గుల విషయంలో కీలకపాత్ర పోషిస్తుంది. శరీర జీవక్రియకు కూడా గ్లూకోజ్ చాలా అవసరం. శరీరం మనం తినే వివిధ ఆహారాల ద్వారా గ్లూకోజ్ ను స్టోర్ చేసుకుంటుంది. ఈ గ్లూకోజ్ శరీర కణాలకు శక్తిని ఇస్తుంది.

శరీరంలో షుగర్ లెవెల్స్ ను నియంత్రించడం చాలా అవసరం. ఎందుకంటే రక్తంలో ఉండే గ్లూకోజ్ కొవ్వు, ఇతర ప్రోటీన్లతో కలిపి శరీరానికి శక్తిని ఇచ్చి జీవక్రియకు సాయపడుతుంది. కానీ గ్లూకోజ్ స్థాయిలో హెచ్చు తగ్గుల వల్ల జీవక్రియలో తీవ్రమైన లక్షణాలకు కారణమవుతుంది.

షుగర్ ఎక్కువగా ఉన్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

షుగర్ ఎక్కువుగా ఉన్నప్పుడు పిండి పదార్థాలు తినడం తగ్గించుకోవాలి. దానికి బదులుగా కూరగాయలు, గింజలు, పండ్లు వంటి హై ఫైబర్ ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవడం ఉత్తమం. అలాగే ఇలాంటి సమయంలో అధికంగా నీరు తీసుకోవడం అత్యుత్తమం. అలాగే డాక్టర్ ను సంబంధించి తగిన మోతాదులో సప్లిమెంట్స్ ను తీసుకోవడం మంచిది.

లోషుగర్ ఉన్న ఈ జాగ్రత్తలు తప్పని సరి

లో షుగర్ ఫీలైన వెంటనే చాక్లెట్స్ లేదా జ్యూస్ లు లేదా అధికంగా షుగర్ ఉన్న ఏ వస్తువునైనా వెంటనే తినాలి. దీని ద్వారా శరీరం వెంటనే రిలీఫ్ పొందుతుంది. తర్వాత రోజు నుంచి అధిక కార్భోహైడ్రేట్ ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవడం ఉత్తమం. అలాగే కచ్చితంగా విశ్రాంతి తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.