వయాగ్రాతో మతిమరుపు సమస్య తగ్గిస్తుందా?.. సంచలన నివేదికలో నివ్వెరపోయే వాస్తవాలు…
దాదాపు 1600 ఔషధాలను పరీక్షించిన తర్వాత వయాగ్రా ఒక్కటే అల్జిమర్స్ మూల కారణాలతో పోరాడుతుందని తేలింది. ఇటీవల కొన్ని పరిశోధనల్లో తరచూ కాఫీ సేవించడం ద్వారా కూడా మతిమరుపు సమస్యను దూరం చేయవచ్చని తేలింది.

లైంగిక సామర్థ్యాన్ని పెంచేందుకు సెక్స్ స్పెషలిస్టులు వయాగ్రాను రోగులకు సిఫార్సు చేస్తారు. కొంతమంది వైద్యుల సిఫార్సు లేకుండానే మెడికల్ షాపులకు వెళ్లి వయాగ్రాను తెచ్చుకుని వాడుతుంటారు. జన బాహుల్యంలో వయాగ్రా అంటే సెక్స్ సమస్యలను దూరం చేయడానికి వాడే మెడిసిన్ అని అందరికీ తెలుసు..కానీ ఇప్పుడు వయాగ్రాను విరివిగా వాడితే అల్జిమర్స్ (మతిమరుపు) సమస్య నుంచి బయటపడవచ్చని వైద్య నివేదికలు పేర్కొంటున్నాయి. దాదాపు 1600 ఔషధాలను పరీక్షించిన తర్వాత వయాగ్రా ఒక్కటే అల్జిమర్స్ మూల కారణాలతో పోరాడుతుందని తేలింది. దీంతో పరిశోధకులు అల్జీమర్స్ కు మెడిసిన్ వయాగ్రాను ఇచ్చే సాధ్యాసాధ్యాలపై పరిశోధనలు చేయగా దాదాపు 69 శాతం సత్ఫలితాలు వచ్చాయి.
వయాగ్రా అల్జీమర్స్ కు కారణమయ్యే టాక్సిన్లను గణనీయంగా తగ్గిస్తుందని తేలింది. దీంతో పాటు జ్ఞాపక శక్తి మెరుగవుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే అల్జీమర్స్ స్టాటింగ్ స్టేజ్ లో ఉన్న వారికి వయాగ్రా ఏ మేరకు పని చేస్తుందో పరిశోధనల్లో తేలాల్సి ఉంది. అయితే పరిశోధకులు మాత్రం ఈ విషయంపై క్లినికల్స్ అవసరమని చెబుతున్నారు.
కాఫీతో వయాగ్రా తీసుకుంటే మరింత మేలా?
ఇటీవల కొన్ని పరిశోధనల్లో తరచూ కాఫీ సేవించడం ద్వారా కూడా మతిమరుపు సమస్యను దూరం చేయవచ్చని తేలింది. ప్రపంచవ్యాప్తంగా చాలా మంది కాఫీని ఇష్టంగా తాగుతున్నారు. దీని ద్వారా కూడా చాలా మంది అల్జీమర్స్ ముప్పు నుంచి బయటపడుతున్నారని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. కొంతమందికి త్వరగా రావాల్సిన అల్జీమర్స్ వ్యాధి కాఫీ సేవించిన కారణంగా కొన్ని సంవత్సరాల తర్వాత వస్తుందని పేర్కొంటున్నారు.




ప్రస్తుతం అల్జిమర్స్ కు మందుగా వయాగ్రా పని చేస్తుందని తేలడంతో కాఫీతో వయాగ్రా వేసుకుంటే మరింత ఫలితాలు వస్తాయనేది మాత్రం ..పరిశోధనల్లో తేలాల్సి ఉంది.
మరిన్ని హెల్త్ వార్తల కోసం చూడండి..



