AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Desk Job Health Risk: ఎక్కువ సేపు కంప్యూటర్ ముందే కూర్చొని పని చేస్తున్నారా? అయితే మీకు ఓ షాకింగ్ న్యూస్..

Health News in Telugu: మారుతున్న కాలంలో చాాలా మంది కంప్యూటర్ ముందు పని చేయాల్సి వస్తుంది. ప్రతి చిన్న అవసరానికి కంప్యూటర్ మీద ఆధార పడాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో కంప్యూటర్ ఆధారిత ఉద్యోగాలు చేసే యువత సంఖ్య గణనీయంగా పెరిగింది.

Desk Job Health Risk: ఎక్కువ సేపు కంప్యూటర్ ముందే కూర్చొని పని చేస్తున్నారా? అయితే మీకు ఓ షాకింగ్ న్యూస్..
Desk Job Health RiskImage Credit source: TV9 Telugu
Janardhan Veluru
|

Updated on: Dec 10, 2022 | 3:36 PM

Share

Health News in Telugu: మారుతున్న కాలంలో చాాలా మంది కంప్యూటర్ ముందు పని చేయాల్సి వస్తుంది. ప్రతి చిన్న అవసరానికి కంప్యూటర్ మీద ఆధార పడాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో కంప్యూటర్ ఆధారిత ఉద్యోగాలు చేసే యువత సంఖ్య గణనీయంగా పెరిగింది. అయితే కొన్ని ఉద్యోగాల్లో తప్పనిసరిగ్గా ఎక్కువసేపు కంప్యూటర్ ముందు పని చేయాల్సి వస్తుంది. ఇది వారి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. గంటల తరబడి కంప్యూటర్లకు అతుక్కుపోయి.. ఇలా పని చేసేవారు అనేక అనారోగ్య సమస్యలకు గురికావాల్సి ఉంటుందని వార్నింగ్ ఇస్తున్నారు. కంప్యూటర్‌లో పనిచేయకున్నా.. తమ కార్యాలయాల్లో ఒకే చోట కూర్చొని గంటల తరబడి పనిచేసినా వారు.. గుండె సంబంధ  సమస్యలతో పాటు పలు అనారోగ్య సమస్యలకు వెల్కమ్ చెప్పినట్లే..

ఆలా పనిచేసేవారు మరీ ముఖ్యంగా గుండె సంబంధిత సమస్యలకు గురికావాల్సి ఉంటుంది.  ఎలాంటి విరామం లేకుండా ఎక్కువసేపు కంప్యూటర్ ముందే కూర్చొని పని చేస్తే వీరికి గుండె పోటు వచ్చే అవకాశాలు 40 శాతం అధికంగా ఉన్నాయని తాజా అధ్యయనంలో వెల్లడయ్యింది. అయితే ఈ పరిస్థితికి రావడానికి వివిధ సమస్యలు దోహదం చేస్తాయి.

గంటల తరబడి ఒకే చోట కూర్చొని పనిచేస్తే ఈ సమస్యలకు వెల్కమ్ చెప్పినట్లే..

ఊబకాయం సమస్య..

ఎక్కువసేపు కూర్చుని పని చేసే వారు ఊబకాయంతో బాధపడే అవకాశం ఉంది. ఎక్కువ గంటలు కూర్చోవడం వల్ల శరీరంలోని లిపోప్రొటీన్ లైపేస్ కొద్ది మొత్తంలో విడుదల అవుతుంది, దీని వల్ల వివిధ ప్రదేశాలలో కొవ్వు పేరుకుపోతుంది. టెక్ జాబ్స్‌లో నిమగ్నమైన వ్యక్తుల పొత్తికడుపు ప్రాంతంలో కొవ్వు పేరుకుపోతుంది. అలాంటి వ్యక్తులు ఊబకాయంతో బాధపడుతున్నారు, ఇది గుండె జబ్బులకు ప్రధాన కారణం కావచ్చు.

ఇవి కూడా చదవండి

మధుమేహ సమస్య…

ఎక్కువ సేపు ఒకే చోట కూర్చొని పని చేస్తే మధుమేహం వచ్చే ప్రమాదాన్ని పెంచుతుందని పరిశోధనలో వెల్లడైంది.. ఎక్కువసేపు కూర్చోవడం వల్ల ఇన్సులిన్ సామర్థ్యం ప్రభావితమయ్యే అవకాశం ఉంది. ఎక్కువసేపు కూర్చోవడం వల్ల చాలా మంది ఎముకలు, కండరాల్లో నొప్పులు వస్తాయి. అలాగే వారి మోకాళ్లు, మోచేతులు, మెడలో కూడా నొప్పి వస్తుంది. ఈ నొప్పి స్త్రీలలో కంటే పురుషులలో ఎక్కువగా గమనించవచ్చు.

ఇవి చేస్తే ప్రమాదం నుంచి బయటపడినట్టే

  1. ఎక్కువ సేపు కూర్చొని పని చేసే వారు ప్రతి అరగంటకు ఓ సారి విరామం తీసుకుని, కాసేపు నడవాలి.
  2. ప్రతి రెండు గంటలకు ఓ సారి శరీరాన్ని కదిపేలా తేలికపాటి వ్యాయామం చేయాలి.
  3. గంట కంటే ఎక్కువ సేపు ఒకే పొజిషన్లో పని చేయకుండా జాగ్రత్త పడాలి.
  4. పని చేసే సమయంలో వెన్నెముక నిటారుగా ఉండేలా కూర్చోవాలి. అలాగే కరెక్ట్ పొజిషన్ లో కూర్చొవడం తప్పని సరి.

మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ చదవండి..