AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Helth Tips: మీ డైట్‌లో ఈ ఆహారపదార్థాలను జోడించండి.. మీ ఆరోగ్యం ఎంతో పదిలం..

సూపర్ ఫుడ్స్‌ని ఆహారంలో చేర్చితే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అవి మన ఆరోగ్యానికి ఉపయోగపడే ఎన్నో పోషకాలతో నిండి ఉన్నాయి. అలాగే వీటిలో విటమిన్లు పుష్కలంగా..

Helth Tips: మీ డైట్‌లో ఈ ఆహారపదార్థాలను జోడించండి.. మీ ఆరోగ్యం ఎంతో పదిలం..
Super Foods
Amarnadh Daneti
|

Updated on: Dec 10, 2022 | 3:01 PM

Share

ఆకలి తీర్చుకోవడానికి ఆహారం తీసుకుంటాం. ఏమి తిన్నా.. బతకడం కోసమే.. అలా అని ఏది పడితే అది తింటే ఆరోగ్యం పాడువుతుంది. మన శరీరం ఏ పదార్థాలను జీర్ణించుకోగలదో వాటిని మాత్రమే సాధారణంగా తీసుకుంటాం. అందుకే తినాల్సినవి, తినకూడనివి అని నియమం పెట్టుకుంటాం. ఇదే సమయంలో శాఖహారం, మాంసాహరం అని రెండు రకాల ఆహారాలు..వాటిలో కూడా తినాల్సినవి, తినకూడనివి ఉంటాయి. ప్రస్తుతం ఏం తిన్నా దానివల్ల మన ఆరోగ్యానికి ఎటువంటి ప్రయోజనాలుంటాయనే విషయాన్ని చాలా మంది ఆలోచిస్తున్నారు. ఈ సమయంలో  కొన్ని ఆహార పదార్థాలను సూపర్ ఫుడ్స్‌ అని కూడా అంటారు. ఈ సూపర్ ఫుడ్స్ ని ఆహారంలో చేర్చితే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అవి మన ఆరోగ్యానికి ఉపయోగపడే ఎన్నో పోషకాలతో నిండి ఉన్నాయి. అలాగే వీటిలో విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి. ఇలాంటి ఆహారాలను ఎన్నో విధాలుగా కూడా తీసుకోవచ్చు. సూపర్ ఫుడ్స్ ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడతాయో తెలుసుకుందాం.

అవిసె గింజలు

ఈ గింజల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. ఇవి చర్మాన్ని తేమగా ఉంచేందుకు సహాయపడతాయి. బరువు తగ్గేందుకు ఇది గొప్పగా పనిచేసే సూపర్ ఫుడ్. అలాగే ఇవి కొలెస్ట్రాల్ లేనివి. అందుకే ఇవి మీ గుండెకు చాలా మంచిది. జుట్టు రాలడం ఒక సాధారణ సమస్య. అవిసె గింజలు జుట్టుకు ఎంతో మేలు చేస్తాయి.

కొబ్బరి

కొబ్బరి నూనెను సూపర్ ఫుడ్‌గానే పరిగణిస్తారు. ఇది వంట కోసమే కాదు.. మన అందం కోసం కూడా ఇది ఉపయోగపడుతుంది. కొబ్బరి నూనె మంచి మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. పొడి చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో విటమిన్లు, ఖనిజాలతో పాటు ఫైబర్ కూడా ఉంటాయి. మీరు దీన్ని అనేక రకాల వంటలలో కూడా ఉపయోగించవచ్చు.

ఇవి కూడా చదవండి

బొప్పాయి

బొప్పాయి చర్మాన్ని పునరుద్ధరించేందుకు సహాయపడుతుంది. దీనిని మాస్క్, క్రీమ్, లోషన్‌గా ఉపయోగించవచ్చు. బొప్పాయిలో విటమిన్ ఏ, సీ, ఇ అధికంగా ఉంటాయి. ఇది గుండె జబ్బులు వంటి సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది. రోగనిరోధక శక్తిని పెంచడానికి ఇది మంచి మూలంకంగా పనిచేస్తోంది.

క్వినోవా

కొల్లాజెన్ ఉత్పత్తికి క్వినోవా సహాయపడుతుంది. ఇది చర్మాన్ని మరింత కాంతివంతంగా, ఆరోగ్యంగా చేస్తుంది. ఇది ముడతలు, మచ్చలు వంటి వృద్ధాప్య లక్షణాలు రాకుండా సహాయపడుతుంది. ఇది చర్మం నుంచి నూనెను తొలగించడంలో సహాయపడుతుంది. ఇది మొటిమలను కూడా తొలగించేందుకు సహాయపడుతుంది.

కలబంద

కొబ్బరిలాగే కలబంద కూడా మనకు చాలా ఉపయోగపడుతుంది. ఇది అనేక చర్మ సంబంధిత సమస్యలను అధిగమించేందుకు సహాయపడుతుంది. మొటిమలు, మచ్చలు, వడదెబ్బలకు చికిత్స చేయడానికి దీనిని ఉపయోగిస్తారు. కలబంద జెల్ చర్మం వృద్ధాప్యాన్ని నివారిస్తుంది. కలబంద రసం తాగడం వల్ల మలబద్దకం, గుండెల్లో మంటను తగ్గిస్తుంది. ఇది కాంతివంతమైన చర్మంతో పాటు చక్కని జీర్ణక్రియకు ఉపయోగపడుతుంది.

ఆలివ్ ఆయిల్

ఈ నూనె ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఇది రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడుతుంది. కొలెస్ట్రాల్, గుండె, రొమ్ము లేదా జీర్ణ సంబంధ రోగాలను తగ్గిస్తుంది. దీని కోసం వర్జిన్ ఆలివ్ నూనెను ఉపయోగించవచ్చు. ఇది ఆహారానికి మంచి రుచిని జోడించడమే కాక, మీ అందాన్ని అందిచేందుకు సహాయపడుతుంది. ఇది యాంటీ ఏజింగ్ లక్షణాలను కలిగి ఉంది. జుట్టు లేదా గోళ్ళపై పూయడం నుంచి లిప్ స్క్రబ్ వరకు దీనిని ఉపయోగించవచ్చు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం చూడండి..