Post Delivery Diet: డెలివరీ తర్వాత వీటిని తింటే ఎంతో హెల్దీ.. బిడ్డ ఎదుగుదలకు కూడా..

ప్రసవం తర్వాత మొదటి ఆరు నెలల వరకు నవజాత శిశువు పూర్తిగా తల్లి పాలపై ఆధారపడి ఉంటుంది కాబట్టి, తల్లి, బిడ్డ ఇద్దరి ఆరోగ్యానికి మంచి పోషకాహారం అవసరం.

Post Delivery Diet: డెలివరీ తర్వాత వీటిని తింటే ఎంతో హెల్దీ.. బిడ్డ ఎదుగుదలకు కూడా..
Post Delivery Diet
Follow us
Basha Shek

|

Updated on: Dec 10, 2022 | 2:56 PM

ప్రసవానంతర కాలంలో తల్లి, బిడ్డను జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. ఈ సమయంలో తల్లి పోషకాహారం తీసుకోవడం ఎంతో ముఖ్యం. ఎందుకంటే తల్లి తీసుకునే ఆహారం దానిబట్టే బిడ్డ ఎదుగుదల ఉంటుంది. ఇక అప్పుడే ప్రసవించిన తల్లులు డెలివరీ సమయంలో శారీరకంగా పలు నొప్పులు, సమస్యలను అనుభవించి ఉంటారు కాబట్టి డెలివరీ తర్వాత రోజులలో శిశువు కోలుకోవడానికి చాలా పోషకాలు, శక్తి అవసరం. అలాగే బిడ్డకు తల్లిపాలు పట్టడం వల్ల ఆహారం విషయంలోనూ అదనపు జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఇక  ప్రసవం తర్వాత మొదటి ఆరు నెలల వరకు నవజాత శిశువు పూర్తిగా తల్లి పాలపై ఆధారపడి ఉంటుంది కాబట్టి, తల్లి, బిడ్డ ఇద్దరి ఆరోగ్యానికి మంచి పోషకాహారం అవసరం. మరి ప్రసవం తర్వాత ఏయే తల్లి ఏయే ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలో తెలుసుకుందాం రండి.

బాదం

బాదంలో పోషకాలు, విటమిన్లు పుష్కలంగా ఉన్నందున తల్లి, బిడ్డ ఆరోగ్యానికి చాలా అవసరం. కొన్ని బాదంపప్పులను రాత్రంతా నీళ్లలో నానబెట్టి, ఉదయం నిద్రలేచిన తర్వాత పరగడుపునే తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది.

కూరగాయలు

ప్రసవం తర్వాత డాక్టర్లు సూచించిన కూరగాయలు బాగా తినాలి. ఇవి శరీరంలో తేమను పెంచడంతో పాటు బరువు తగ్గడంలో కూడా సహాయపడుతాయి. అలాగే తల్లి పాలను పెంచడానికి కూడా ఇవి చాలా మేలు చేస్తాయి.

ఇవి కూడా చదవండి

జీలకర్ర

ఒక చెంచా జీలకర్ర, కొంచెం బెల్లం, పాలు కలిపి రోజూ తాగాలి. ఈ హెల్దీ డ్రింక్‌ జీర్ణవ్యవస్థ, రోగనిరోధక వ్యవస్థ, రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. జీలకర్రలో కాల్షియం, ఐరన్ పుష్కలంగా ఉన్నాయి.

పాంజీరి

పంజీరి ఒక పోషకాహార సప్లిమెంట్. ఇది తల్లి జీవక్రియను మెరుగుపరుస్తుంది. బరువు నియంత్రణలో సహాయపడుతుంది. ముఖ్యంగా ఇది తల్లి పాలను పెంచుతుంది. నెయ్యి, డ్రై ఫ్రూట్స్‌తో కలిపి లడ్డూ లేదా హల్వా రూపంలో దీనిని తినవచ్చు.

వాము

వాము లేదా అజ్వైన్ తల్లులకు మంచి ఆహారం. ఇది డెలివరీ తర్వాత గ్యాస్, అజీర్ణ సమస్యలను పరిష్కరించడంలో సహాయపడుతుంది. నీటిలో రెండు చెంచాల వాము గింజలు వేసి మరిగించాలి. మరిగిన తర్వాత నీటిని వడకట్టి తాగితే మంచి ఫలితముంటుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.