AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

White Rice: రోజూ వైట్ రైస్ తింటున్నారా..? అయితే మీరు ఈ ప్రమాదాలలో పడినట్టే..

తెలుగు రాష్ట్రాలలో నూటికి తొంభై శాతం మంది ఈ ఆహారపు అలవాటునే కలిగి ఉంటారు. వీరంతా ఏది తిన్నా తినకపోయినా అన్నం తినకపోతే ఆ పూట భోజనం చేయనట్టే భావిస్తారు. అయితే తినడం..మన ఆరోగ్యానికి హానికరం. ఎందుకంటే..?

White Rice: రోజూ వైట్ రైస్ తింటున్నారా..? అయితే మీరు ఈ ప్రమాదాలలో పడినట్టే..
White Rice
శివలీల గోపి తుల్వా
|

Updated on: Dec 10, 2022 | 2:39 PM

Share

మన భారతదేశం విభిన్న సంస్కృతులకు, ఆచారాలకు నిలయం. అదే విధంగా అనేక జీవన విధానలకు కూడా పెట్టింది పేరు. ప్రాంతానికి ప్రాంతానికి విభిన్న జీవన విధానాలు, ఆహారపు అలవాట్లు ఉన్నాయి. సాధారణంగా ఉత్తర భారతదేశంలో గోధుమ పిండితో చేసిన వంటకాలను ఇష్టంగా తింటారు. అలాగే దక్షిణ భారతంలో ఎక్కువ శాతం మంది వరి బియ్యంతో చేసిన అన్నాన్నే తింటారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో నూటికి తొంభై శాతం మంది ఈ ఆహారపు అలవాటునే కలిగి ఉంటారు. వీరంతా ఏది తిన్నా తినకపోయినా అన్నం తినకపోతే ఆ పూట భోజనం చేయనట్టే భావిస్తారు. అయితే రోజూ వరి అన్నం తినడం మన ఆరోగ్యానికి హానికరం అని అనేక పరిశోధనలు చెబుతున్నాయి. ఎందుకంటే బియ్యం మానవ శరీరానికి అవసరమైన అన్ని పోషకాలను అందిచదని అనేక నివేదికలు ఇప్పటికే వెల్లడించాయి. రోజూ అన్నం తినే వారిలో మీరు కూడా ఉంటే ఖచ్చితంగా కొన్ని విషయాలపై శ్రద్ధ పెట్టడం అవసరం. అవేమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

బియ్యంతో చేసిన అన్నంలో మానవ శరీరానికి బలాన్నిచ్చే బీ-విటమిన్‌లు సరిగా లేకపోవడం వలన త్వరగా అలసి పోవడం, నీరసం రావడం, పిక్కలు లాగడం వంటి సమస్యలు మనల్ని వేధిస్తాయి. బియ్యం పై పొరలో ఉండే విటమిన్‌ ఈ మనకు త్వరగా ముసలితనం రాకుండా చేస్తుంది. కానీ ఉడికించిన తర్వాత తెల్లటి బియ్యంలో ఇది పూర్తిగా ఉండదు. ఇంకా దానితోపాటు లిసిధిన్‌ అనే పదార్థం కూడా తెల్లటి బియ్యంలో ఉండదు. ఈ పదార్థం మనలో కొవ్వు, కొలెస్ట్రాల్ పదార్థాలు పేరుకోకుండా నివారించేందుకు విరుగుడుగా పని చేస్తుంది. అలాగే గుండె జబ్బులు రాకుండా నివారించే శక్తి తెల్లటి బియ్యంలో ఉండదు. పీచుపదార్థాలన్నీ బియ్యం పై పొరలలోనే ఉండడం వల్ల, ఉడికించిన అన్నంలో అవి లేకపోవడం వల్ల వస్తుంది.

ఈ సమస్యలు మనకు ఒక్క సారి వస్తే ఎన్ని మందులు వాడినా తగ్గవు. అలాగే బరువు కూడా పెరుగుతారు. తెల్లటి అన్నం మెతుకులు సన్నగా ఉండే సరికి సరిగా పంటి కింద పడక, నమలకుండా తేలిగ్గా జారి గొంతులోకి వెళ్లిపోతుంటాయి. వాటిని పూర్తిగా నమలనందున నోటిలో గానీ, పొట్టలో గానీ జీర్ణక్రియ సరిగా ఉండదు. తద్వారా అన్నం తిన్న 3, 4 గంటలలోనే నీరసం వస్తుంది. కాళ్లకు నీరు పట్టడం, తిమ్మిర్లు రావడం లాంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. పైగా తెల్లటి అన్నం రుచిగా కూడా ఉండదు. అందువల్ల రోజూ అన్నం తినేవారు అప్పుడప్పుడు తమ ఆహారపు అలవాట్లకు కొంత విశ్రాంతి ఇచ్చి పోషకాలు ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

ఇవి కూడా చదవండి
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.