Bay Leaf Tea: బిర్యానీ ఆకులతో టీ చేసుకోవచ్చు తెలుసా.. ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలంటే..

బిర్యానీలో రుచి కోసం బిర్యానీ ఆకులను ఉపయోగిస్తాం. అలాగే చికెన్ కర్రీతో పాటు.. మరిన్ని నాన్ వెజ్ కూరల్లో కూడా బిర్యానీ ఆకులను వేస్తారు. అయితే బిర్యానీ ఆకులతో టీ కూడా చేసుకోవచ్చు. అంతేకాదు బిర్యానీ ఆకుల టీతో ఎన్నో..

Bay Leaf Tea: బిర్యానీ ఆకులతో టీ చేసుకోవచ్చు తెలుసా.. ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలంటే..
Bay Leaves
Follow us
Amarnadh Daneti

|

Updated on: Dec 10, 2022 | 5:01 PM

బిర్యానీలో రుచి కోసం బిర్యానీ ఆకులను ఉపయోగిస్తాం. అలాగే చికెన్ కర్రీతో పాటు.. మరిన్ని నాన్ వెజ్ కూరల్లో కూడా బిర్యానీ ఆకులను వేస్తారు. అయితే బిర్యానీ ఆకులతో టీ కూడా చేసుకోవచ్చు. అంతేకాదు బిర్యానీ ఆకుల టీతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. బిర్యానీ ఆకులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇది అనేక ఆరోగ్య సమస్యలకు దివ్య ఔషధంగా పనిచేస్తుంది.  దీనిని అనేక విధాలుగా తీసుకోవచ్చు. ఈ ఆకులతో టీ కూడా తయారుచేసుకోవచ్చు. బిర్యానీ ఆకుల అన్ని లక్షణాలను ఈ టీ గ్రహిస్తుంది. బిర్యానీ ఆకులతో టీ ఎలా చేయాలో తెలుసుకుందాం. బిర్యానీ ఆకుల టీ రుచికరంగా ఉండటంతో పాటు మంచి వాసన కలిగి ఉంటుంది. ఇందుకోసం 2-3 కప్పుల నీరు, 4-5 బిర్యానీ ఆకులు అవసరం. తాజా బిర్యానీ ఆకులు ఉంటే మీరు 3-4 బే ఆకులను తీసుకొని వాటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు. అవి దొరకకపోతే ఎండిన బిర్యానీ ఆకులను కూడా ఉపయోగించవచ్చు. ఒక కుండలో నీరు వేసి మరిగించాలి. దానికి బిర్యీనీ ఆకులను జోడించాలి. నీటిని ఫిల్టర్ చేసి ఒక కప్పులో వేసి వేడి వేడిగా తాగొచ్చు. బిర్యానీ ఆకుల టీతో ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం.

ఆరోగ్యకరమైన గుండె

ఈ టీ గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. ఇందులో రుటిన్, కెఫిక్ ఆమ్లం ఉంటాయి. దీనితో పాటు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గించడానికి తోడ్పడుతుంది.

నొప్పి నుంచి ఉపశమనం

ఈ ఆకులు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి బెణుకులు, కీళ్ల నొప్పి, ఆర్థరైటిస్‌తో సహా ఎలాంటి నొప్పినైనా తగ్గించడంలో సహాయపడతాయి.

ఇవి కూడా చదవండి

క్యాన్సర్ నిరోధక ప్రభావం

కొన్ని అధ్యయనాల ప్రకారం బిరియానీ ఆకులు క్యాన్సర్ కణాలను తొలగించడంలో సహాయపడే లక్షణాలను కలిగి ఉంటాయి. ఇది ఫైటోన్యూట్రియెంట్స్ కలిగి ఉంటాయి.

మూత్రపిండాల్లో రాళ్లకు చికిత్స

తరచుగా మూత్రపిండాల్లో రాళ్ళు ఇతర గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తాయి. బిరియానీ ఆకులు శరీరంలో యూరియా స్థాయిని తగ్గించడంలో సహాయపడతాయి. అందువల్ల ఈ సమస్య నుంచి ఉపశమనం పొందడానికి బిరియానీ ఆకులను ఉపయోగించవచ్చు.

గొంతు నొప్పి

బిరియానీ ఆకులు బ్యాక్టీరియాను వదిలించుకోవడానికి సహాయపడతాయి. తద్వారా మీకు జలుబు లేదా దగ్గు నుంచి ఉపశమనం లభిస్తుంది. శ్వాసకోశ సమస్యలకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.

మధుమేహం

టీని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల టైప్ 2 డయాబెటిస్‌తో పోరాడవచ్చు ఎందుకంటే ఇది శరీరంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రిస్తుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం చూడండి..

అంబులెన్స్‌ను వెంటాడిన మృత్యువు.. నలుగురు దుర్మరణం..!
అంబులెన్స్‌ను వెంటాడిన మృత్యువు.. నలుగురు దుర్మరణం..!
డేంజర్‌ జోన్‌లో భారతీయులు..ప్రపంచంలోనే అగ్రస్థానం.. సంచలన నివేదిక
డేంజర్‌ జోన్‌లో భారతీయులు..ప్రపంచంలోనే అగ్రస్థానం.. సంచలన నివేదిక
కొత్త ఫోన్‌ కొనే ప్లాన్‌లో ఉన్నారా.? రూ. 25వేలలో బెస్ట్‌ ఇవే..
కొత్త ఫోన్‌ కొనే ప్లాన్‌లో ఉన్నారా.? రూ. 25వేలలో బెస్ట్‌ ఇవే..
తమిళనాడు, పుదుచ్చేరిలో వరదల బీభత్సం
తమిళనాడు, పుదుచ్చేరిలో వరదల బీభత్సం
సామ్‌సంగ్‌ ఫోన్‌పై భారీ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్‌తో కేవలం రూ. 500కే
సామ్‌సంగ్‌ ఫోన్‌పై భారీ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్‌తో కేవలం రూ. 500కే
ఉసిరి- ఆరోగ్య సిరి..! చలికాలంలో రోజుకు ఒకటి తింటే చాలు.. లాభాలు
ఉసిరి- ఆరోగ్య సిరి..! చలికాలంలో రోజుకు ఒకటి తింటే చాలు.. లాభాలు
TRAI: అంతా ఉత్తదేనట.. డిసెంబర్ 1 నుంచి OTPల నిలిపివేతపై క్లారిటీ
TRAI: అంతా ఉత్తదేనట.. డిసెంబర్ 1 నుంచి OTPల నిలిపివేతపై క్లారిటీ
సొరకాయా.. మజాకా! లాబాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..
సొరకాయా.. మజాకా! లాబాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..
అమెరికా ఫ్లైట్ టికెట్ ధరలు ఉన్నఫళంగా అంత ఎందుకు పెరిగాయ్
అమెరికా ఫ్లైట్ టికెట్ ధరలు ఉన్నఫళంగా అంత ఎందుకు పెరిగాయ్
కాకినాడ పోర్టు నుంచి స్మగ్లింగ్ గుట్టు రట్టు చేసిన నాదెండ్ల
కాకినాడ పోర్టు నుంచి స్మగ్లింగ్ గుట్టు రట్టు చేసిన నాదెండ్ల
చేపల పులుసు తినాలనే కోరిక.. ఇట్టా అయితుంది అనుకోలే..
చేపల పులుసు తినాలనే కోరిక.. ఇట్టా అయితుంది అనుకోలే..
నామాల స్వామికే నామాలు పెట్టాలనుకున్నాడు.! శ్రీవారి హుండీలోనే చోరీ
నామాల స్వామికే నామాలు పెట్టాలనుకున్నాడు.! శ్రీవారి హుండీలోనే చోరీ
చలి పెడుతోందా.. ఖావో.. పాయా.. ఒకటి తీసుకుంటే ఒకటి ఫ్రీ.!
చలి పెడుతోందా.. ఖావో.. పాయా.. ఒకటి తీసుకుంటే ఒకటి ఫ్రీ.!
ప్రయాణికులకు అలర్ట్‌.. ఏకంగా 30 రైళ్లు రద్దు.! అదే కారణమా..
ప్రయాణికులకు అలర్ట్‌.. ఏకంగా 30 రైళ్లు రద్దు.! అదే కారణమా..
రాజుకు అవమానం.. ఉదయ్‌పూర్ రాజవంశంలో దాయాదుల పోరు.!
రాజుకు అవమానం.. ఉదయ్‌పూర్ రాజవంశంలో దాయాదుల పోరు.!
ప్రాణం తీసిన పూరి.. అయ్యో చిన్నారి! తినే ఆహారం కూడా పిల్లల ప్రాణం
ప్రాణం తీసిన పూరి.. అయ్యో చిన్నారి! తినే ఆహారం కూడా పిల్లల ప్రాణం
హైదరాబాద్‌ రోడ్లపై రక్త ప్రవాహం.? ఏం జరిగిందోనని భయాందోళనలో స్థాన
హైదరాబాద్‌ రోడ్లపై రక్త ప్రవాహం.? ఏం జరిగిందోనని భయాందోళనలో స్థాన
26 ఏళ్ల క్రితం హత్య... హంతకుడిని పట్టించిన పెండ్లిపత్రిక..
26 ఏళ్ల క్రితం హత్య... హంతకుడిని పట్టించిన పెండ్లిపత్రిక..
మాస్టర్ ప్లాన్ తో తిరుమల దశ తిరుగుతుందా.? మరో 25 ఏళ్ల భవిష్యత్ పై
మాస్టర్ ప్లాన్ తో తిరుమల దశ తిరుగుతుందా.? మరో 25 ఏళ్ల భవిష్యత్ పై
రైల్వే క్యాటరింగ్ సంస్థపై రూ. లక్ష జరిమానా! ఎంఆర్‌పీ కంటే అధిక ధర
రైల్వే క్యాటరింగ్ సంస్థపై రూ. లక్ష జరిమానా! ఎంఆర్‌పీ కంటే అధిక ధర