Liver Health Tips: కాలేయ సమస్యతో బాధపడుతున్నారా? జీవన శైలి, ఆహార నియమాల్లో ఈ మార్పులు చేసుకోండి..
Liver Health Tips: కాలేయం పనితీరు దెబ్బతింటే దాని దుష్ప్రభావం శరీరంలోని పలు అవయవాలపైన పడుతుంది. మన ఆహార నియమాల్లో స్వల్ప మార్పులు చేసుకుని కాలేయ పని తీరును మెరుగుపర్చుకోవచ్చని వైద్యు నిపుణులు సూచిస్తున్నారు.
Liver Health Tips: మానవ శరీరంలో కాలేయం అనేది అత్యంత ముఖ్యమైన అవయువం. వివిధ శరీర భాగాల పనితీరు కాలేయం పనితీరు మీద ఆధారపడి ఉంటుంది. కాలేయం ముఖ్యంగా జీర్ణక్రియకు అవసరమైన పిత్త రసాన్ని ఉత్పత్తి చేస్తుంది. అలాగే రక్తాన్ని శుభ్రపర్చడంలో కీలక పాత్ర పోషిస్తుంది. కాలేయం పనితీరు దెబ్బతింటే దాని దుష్ప్రభావం శరీరంలోని పలు అవయవాలపైన పడుతుంది. జీవనశైలి, ఆహార నియమాల్లో స్వల్ప మార్పులు చేసుకుని కాలేయ పని తీరును మెరుగుపర్చుకోవచ్చని వైద్యు నిపుణులు సూచిస్తున్నారు. ఈ సింపుల్ నియమాలను పాటించడం ద్వారా కాలేయం పనితీరు మళ్లీ గాడిలో పెట్టుకోవచ్చు.
ముఖ్యమైన కాలేయానికి రక్షించుకోవడానికి ఈ ఏడు సూత్రాలను పాటించాల్సిందే..
- ఉదయాన్నే వేడి నీళ్లల్లో నిమ్మరసం వేసుకుని తాగాలి. రోజూ ఇలా చేస్తూ దీన్ని అలవాటుగా మార్చుకోవాలి.
- రోజూ కచ్చితంగా 6 నుంచి 8 గ్లాసుల ఫిల్టర్ చేసిన నీరు తాగాలి. వీటితో పాటు 2 నుంచి గ్లాసుల వేడి నీళ్లు తాగాలి. ఇలా చేయడం ద్వారా లివర్, కిడ్నీలు శుభ్రమవుతాయి. అలాగే బరువు తగ్గడానికి కూడా ఉపయోగ పడుతుంది.
- తాజా కూరగాయలు అంటే బీట్ రూట్, క్యారెట్, ఆకుకూరల జ్యూస్ లాంటివి తాగితే లివర్ ను శుభ్రపర్చడానికి సాయం చేస్తుంది.
- పచ్చి కూరగాయాల్లో పోషకాల శాతం ఎక్కువ ఉంటుంది. దీంతో కచ్చితంగా ప్రతి రోజూ మనం తీసుకునే ఆహారంలో 40 శాతం వీటిని తీసుకుంటే లివర్ టాక్సిన్స్ తో పోరాడడానికి వీలుగా ఉంటుంది.
- లివర్ ను కాపాడుకోవడానికి చక్కెర మైదాకు దూరంగా ఉండాలి. వీటిని తీసుకుంటే లివర్ భారంగా పని చేస్తుంది. వీటికి దూరంగా ఉండడం ద్వారా లివర్ పని తీరు మెరుగుపర్చవచ్చు.
- మొలకెత్తిన పెసలు, శెనగలు, వేరుశెనగ గుళ్లు, గోదుమలు వంటివి తీసుకుంటే లివర్ బాగా పని చేస్తుంది.
- అధిక కొలేస్ట్రాల్ ఉండే పచ్చి పాలు, మాంసాహారానికి దూరంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
కాలేయ పనితీరు మెరుగుపడేందుకు ఇలా చేయండి..
View this post on Instagram
ఇలాంటి ఆహార నియమాలు పాటించడం ద్వారా కాలేయ పని తీరును మెరుగుపర్చుకుని ఆరోగ్యంగా జీవించాలని వైద్యులు సూచిస్తున్నారు.
మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ చదవండి..