AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cough: చలికాలపు దగ్గు సమస్యతో బాధపడుతున్నారా..? అయితే ఈ వంటింటి చిట్కాలను పాటించండి..

చలికాలంలోని వాతావరణం కొంతమందికి ఆరోగ్య సమస్యలు తీసుకొస్తుంది. జ్వరం, దగ్గు, జలుబు వంటి వాటితో చాలా మంది సతమతమవుతుంటారు. వీటిలో దగ్గు మరీ ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది. గొంతు వెనకాల.. ఏవో తెలియని.. ఇంకా..

Cough: చలికాలపు దగ్గు సమస్యతో బాధపడుతున్నారా..? అయితే ఈ వంటింటి చిట్కాలను పాటించండి..
Cough In Winter
శివలీల గోపి తుల్వా
|

Updated on: Dec 10, 2022 | 3:36 PM

Share

శీతాకాలంలోని పగటి పూట వాతావరణం అందరికీ నచ్చుతుంది. ఎండలు తక్కువగా ఉండడమే కాక పొడి వాతావరణం.. మనసుకు హాయినిస్తుంది. అందుకే ఈ రోజుల్లోని వాతావరణం చల్లగా ఉంటే అందరికీ నచ్చుతుంది. కానీ, రాత్రిళ్లు శరీరాన్ని గడ్డ కట్టించేలా చలి ఉంటుంది. నిద్ర కూడా సరిగా పోలేము. వాటికి తోడుగా చలికాలంలో కూడా మనం చల్లని పానీయాలనే తాగుతూ ఉంటాం. ఫలితంగా చలికాలంలోని వాతావరణం కొంతమందికి ఆరోగ్య సమస్యలు తీసుకొస్తుంది. జ్వరం, దగ్గు, జలుబు వంటి వాటితో చాలా మంది సతమతమవుతుంటారు. వీటిలో దగ్గు మరీ ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది. గొంతు వెనకాల మ్యూకస్, ఏవో తెలియని చికాకు పెట్టే జీవులు జారుకున్నప్పుడు దగ్గు అసంకల్పితంగా వస్తుంది. ఈ సమస్య మొదలైనప్పటి నుంచి సమస్యను తగ్గించే మార్గాలను వెతుకుతాం.. అయితే కొన్ని ఇంటి చిట్కాల ద్వారా సమస్యను తగ్గించుకోవచ్చు. అవి ఏమిటో తెలుసుకుందాం..

అల్లం, టీ పౌడర్, తులసి: గ్లాసు నీటిలో అర టీ స్పూన్ అల్లం పొడిని, కొద్దిగా టీ పౌడర్, మూడు తులసి ఆకులు వేసి సుమారు 10 నిమిషాలు మరిగించాలి. ఈ ద్రవం చల్లారిన తరువాత తాగితే గొంతులో గరగరతో పాటు దగ్గు తగ్గుతుంది.

గుర్రపు ముల్లంగి సిరప్: పావు కప్పు తేనెలో తురిమిన గుర్రపుముల్లంగిని వేయండి. దీన్ని కొన్ని గంటల పాటు అలాగే ఉంచి దగ్గు సిరప్‌గా వాడండి. ఈ సరిప్‌ను రెండు  వారల పాటు వాడితే సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది.

ఇవి కూడా చదవండి

పొడి దగ్గు : దీని కోసం ముందు 3 కప్పుల నీళ్లలో 2 తమలపాకులు, నాలుగు మిరియాల పొడి వేసి కలిపి 15 నిమిషాలు మగరబెట్టి దించాలి. ఈ మిశ్రమంలో చెంచాడు తేనె కలిపి ఉదయం సాయంత్రం తీసుకోవాలి. అలా చేయడం వల్ల ఈ సమస్య నుంచి మీకు ఉపశమనం లభిస్తుంది.

దీర్ఘకాలంగా దగ్గు : దీర్ఘకాలికంగా దగ్గు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిది. అలాగే గ్లాసు నీటిలో 3 మల్బరీ ఆకులను వేసి 10 నిమిషాలు మరగబెట్టాలి. ఇందులో ఎగ్ వైట్ (తెల్ల సొన) మిక్స్ చేసి తాగాలి. అలా చేయడం వల్ల దగ్గు వెంటనే తగ్గిపోతుంది.

గొంతు గరగర : లవంగాలు చప్పరిస్తే గొంతులో గరగర తగ్గుతుంది. దాంతో పాటు పాలలో పసుపు వేసుకుని తాగితే మరింతగా ప్రయోజనం ఉంటుంది.

(హెచ్చరిక: ఈ కథనంలో అందించిన సమాచారం పాఠకుల ప్రయోజనాల కోసం రాసినది మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏదైనా సూచనను అనుసరించే ముందు దయచేసి వైద్యులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ వార్తల కోసం చూడండి..