IPL 2023: రిలీజ్ చేయనందుకు ఐపీఎల్ ఫ్రాంచైజీకి ప్రతిఫలం.. డబుల్ సెంచరీతో బౌలర్ల బెండ్ తీసిన యంగ్ ప్లేయర్..
Ranji Trophy 2022: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) తదుపరి సీజన్‌కు ముందు ప్రభ్‌సిమ్రాన్ సింగ్‌ను పంజాబ్ కింగ్స్ రిలీజ్ చేయలేదు. కాగా, రంజీ ట్రోఫీ మొదటి రోజునే ఈ ప్లేయర్ తన ప్రతిభను చాటిచెప్పాడు.
Prabhsimran Singh, Punjab Kings: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఫ్రాంచైజీ పంజాబ్ కింగ్స్ ప్రస్తుతం చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే లీగ్ తదుపరి సీజన్ కోసం తమ వద్దే ఉంచుకున్న ఓ ప్లేయర్.. ఎర్ర బంతితో అద్భుతాలు చేశాడు. భారత దేశవాళీ క్రికెట్ టోర్నమెంట్ రంజీ ట్రోఫీ మంగళవారం నుంచి ప్రారంభమైంది. మొదటి రోజునే పంజాబ్‌కు చెందిన యువ బ్యాట్స్‌మెన్ డబుల్ సెంచరీ సాధించాడు. ఈ బ్యాట్స్‌మెన్ పేరు ప్రభ్‌సిమ్రాన్ సింగ్ . ఈ కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్ దేశవాళీ క్రికెట్‌లో పంజాబ్ జట్టుకు కూడా ఆడుతున్నాడు. ఈ సీజన్‌లోని మొదటి మ్యాచ్‌లో పంజాబ్ జట్టు చండీగఢ్‌తో తలపడింది.
మొహాలీ వేదికగా జరుగుతున్న గ్రూప్-డి మ్యాచ్‌లో తొలి రోజు పంజాబ్ బుధవారం ముగిసేసరికి మూడు వికెట్ల నష్టానికి 363 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో ప్రభ్‌సిమ్రాన్‌తో పాటు అతని ఓపెనింగ్ భాగస్వామి అభిషేక్ శర్మ కూడా సెంచరీ సాధించాడు. ఈ మ్యాచ్‌లో, అభిషేక్, ప్రభ్‌సిమ్రన్‌ల జోడీ బౌలర్లను చీల్చి చెండాడారు. టాస్ గెలిచిన చండీగఢ్ బౌలింగ్ నిర్ణయం తప్పని వీరిద్దరు తేల్చేశారు.
250 పరుగుల భాగస్వామ్యం..
అభిషేక్, ప్రభ్‌సిమ్రాన్ సింగ్‌లు తొలి వికెట్‌కు 250 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. తొలి సెషన్‌లో చండీగఢ్ జట్టు ఒక్క వికెట్ కూడా తీయలేకపోయింది. రెండో సెషన్ ముగిసే సమయానికి అభిషేక్‌ను ఔట్ చేయడం ద్వారా గురిందర్ సింగ్ భాగస్వామ్యాన్ని విడదీశాడు. అభిషేక్ 146 బంతులు ఎదుర్కొని 11 ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 100 పరుగులు చేశాడు.
ఇక తొలిరోజు చివరి బ్యాట్స్‌మెన్‌గా ప్రభాసిమ్రన్ ఔట్ అయ్యాడు. అతను రోహిత్ దండా (50 పరుగులకు 2 వికెట్లు) వేసిన బంతికి సందీప్ శర్మకు క్యాచ్ ఇచ్చాడు. వికెట్‌కీపర్-బ్యాట్స్‌మెన్ 278 బంతులు ఎదుర్కొని 29 ఫోర్లు, రెండు సిక్సర్లు బాదాడు. నమన్ ధీర్ (34)ను కూడా సందీప్ అవుట్ చేశాడు. తొలిరోజు ఆట ముగిసే సమయానికి కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్ 16, అన్మోల్‌ప్రీత్ సింగ్ ఐదు పరుగులతో ఆడుతున్నాడు.
పంజాబ్ షేర్ చేసిన ట్వీట్..
Our ? Prabhsimran Singh kickstarted the #RanjiTrophy season with a blistering double ton! ??#SherSquad, check out other Shers who will be in action soon. ?https://t.co/iayLjzgJnF#PrabhsimranSingh #PunjabKings @prabhsimran01
— Punjab Kings (@PunjabKingsIPL) December 13, 2022
నమ్మకం ఉంచిన పంజాబ్ కింగ్స్..
IPL-2023 వేలానికి ముందు, పంజాబ్ కింగ్స్ తమ రిటైన్ చేసిన ఆటగాళ్ల జాబితాను విడుదల చేసింది. అందులో ప్రభ్‌సిమ్రాన్ సింగ్ పేరు ఉంది. ఈ ఆటగాడు పంజాబ్ తరపున ఇప్పటి వరకు ఆరు మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. 10.66 సగటుతో 64 పరుగులు చేశాడు. పంజాబ్ ఈ ఆటగాడితో 2019 నుంచి అనుబంధం కలిగి ఉంది. అప్పటి నుంచి ఈ ఆటగాడు నిరంతరం పంజాబ్ జట్టుతోనే ఉన్నాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..