AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Capital: ఉద్యమానికి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా ‘చలో ఢిల్లీ’ అంటున్న అమరావతి రైతులు.. దేశ రాజధానిలో ఏం చేయబోతున్నారంటే..?

అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ ‘అమరావతి పరిరక్షణ సమితి’ మొదలు పెట్టిన ఉద్యమానికి డిసెంబర్ 17 తేదీ నాటికి మూడేళ్లు పూర్తవనున్నాయి. ఈ సందర్భంగా అమరావతి రైతులు 18 వేల మంది ‘ఛలో ఢిల్లీ’ కార్యక్రమానికి..

AP Capital: ఉద్యమానికి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా ‘చలో ఢిల్లీ’ అంటున్న అమరావతి రైతులు.. దేశ రాజధానిలో ఏం చేయబోతున్నారంటే..?
Amaravathi Farmers Protest
శివలీల గోపి తుల్వా
|

Updated on: Dec 14, 2022 | 8:04 AM

Share

అమరావతినే ఆంధ్రప్రదేశ్ రాజధానిగా కొనసాగించాలంటూ ‘అమరావతి పరిరక్షణ సమితి’ మొదలు పెట్టిన ఉద్యమానికి డిసెంబర్ 17 తేదీ నాటికి మూడేళ్లు పూర్తవనున్నాయి. ఈ సందర్భంగా అమరావతి రైతులు 18 వేల మంది ‘ఛలో ఢిల్లీ’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దీనికోసం మూడు రోజుల కార్యాచరణ కూడా సిద్దం చేయడమే కాక దేశ రాజధానిలో నిరసన తెలపాలని అమరావతి పరిరక్షణ సమితి నిర్ణయించింది. డిసెంబర్‌ 17, 18, 19 తేదీల్లో ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వేదికగా ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టనున్నట్లు అమరావతి పరిరక్షణ సమితి అధ్యక్షుడు శివారెడ్డి, కార్యదర్శి గద్దె తిరుపతి రావు ప్రకటించారు.  ధరణి కోట నుంచి ఎర్రకోట వరకు నిరసన యాత్ర ఉంటుందని ఐకాస నేతలు తెలిపారు. 1800 మందితో ప్రత్యేక రైలులో అమరావతి రాజధాని ప్రాంత రైతులు ఢిల్లీ వెళ్తారని వారు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అమరావతినే ఏకైక రాజధానిగా ప్రకటించాలని డిమాండ్‌ చేశారు.  17న జంతర్‌ మంతర్‌లో ధర్నా చేపడతామని, 18న ఇతర రాస్ట్రాల ఎంపీలను కలవనున్నట్లు తెలిపారు. 19న రామ్‌లీలా మైదానంలో జరిగే కిసాన్‌ సంఘ్‌లో పాల్గొంటామని చెప్పారు.

అమరావతి రాజధాని కోసం తాము 33 వేల ఎకరాలు ఇచ్చామని ఆ ప్రాంతంలోని ప్రజలు, రైతులు అంటున్నారు. అయితే ప్రభుత్వం మూడు రాజధానుల అంశానికి కట్టుబడి ఉండటం, ఇంకా రాజధాని అనేది రాష్ట్ర స్ధాయి నిర్ణయం అని కేంద్రం ఇటీవలే ప్రకటించడంతో అమరావతి రైతులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే క్రమంలో మూడు సంవత్సరాలుగా అమరావతి కోసం పోరాటం చేస్తున్నామని, కేంద్రానికి వినిపించేలా నిరసన గళం ఎత్తాలని అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ నిర్ణయించింది. మూడు రాజధానులను ఏర్పాటు చేసే పరిస్ధితి లేదని, అమరావతే రాజధానిగా ఉండాలని, మా ఉద్యమానికి 3 సంవత్సరాలు పూర్తి కానుండటంతో అమరావతి టూ ఢిల్లీ వెళుతున్నామని అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ కన్వీనర్ శివారెడ్డి‌ తెలిపారు.

డిసెంబర్ 17న ఢిల్లీలో మా అమరావతి రైతుల గళం వినిపించాలని నిర్ణయించుకున్నాం. ఈనెల 17న స్పెషల్ ట్రైన్‌లో 18 వేల మంది దాకా ఢిల్లీ వెళ్ళి.. ముందుగా జంతర్ మంతర్ లో నిరసన కార్యక్రమాన్ని చేపడతాం. అక్కడ అమరావతి రైతులు ఒక్కసారిగా తమ గళం విప్పి కేంద్ర మంత్రులకు, ఎంపీలకు, ప్రధానికి వినపడేలా చేస్తాం. 18న కేంద్ర మంత్రులను, ఎంపీలను కలిసి మా గోడు వినిపిస్తాం. 19న రామ్‌లీలా మైదానంలో జరిగే కిసాన్‌ సంఘ్‌లో పాల్గొంటాము. ఇక మా కోసం స్పెషల్‌ ట్రైన్‌ వేసినందుకు రైల్వే శాఖామంత్రి ధన్యవాదాలు’’ అని జేఏసీ కన్వీనర్ శివారెడ్డి తెలిపారు.

ఇవి కూడా చదవండి