PM Kisan: రైతులకు బిగ్ అలర్ట్.. అలాంటి వారికి పీఎం కిసాన్ నగదు అందడం కష్టమే.. కేంద్రం క్లారిటీ..!

PM Kisan Yojana: దేశంలో వ్యవసాయ రంగానికి ఊతమిచ్చేందుకు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోంది. దీనిలో భాగంగా భారత ప్రభుత్వం.. 2019 ఫిబ్రవరిలో ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం-కిసాన్ ) పథకాన్ని ప్రారంభించి..

PM Kisan: రైతులకు బిగ్ అలర్ట్.. అలాంటి వారికి పీఎం కిసాన్ నగదు అందడం కష్టమే.. కేంద్రం క్లారిటీ..!
Pm Kisan Update
Follow us

|

Updated on: Dec 15, 2022 | 10:18 AM

PM Kisan Yojana: దేశంలో వ్యవసాయ రంగానికి ఊతమిచ్చేందుకు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోంది. దీనిలో భాగంగా భారత ప్రభుత్వం.. 2019 ఫిబ్రవరిలో ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం-కిసాన్ ) పథకాన్ని ప్రారంభించి.. రైతులకు చేయూతనిస్తోంది. ఏడాదికి రూ. 6,000 చొప్పున రైతులకు అందిస్తోంది. ఈ ఆరు వేల మొత్తాన్ని మూడు వాయిదాలలో రూ.2,000 చొప్పున జమ చేస్తోంది. అయితే, ఇటీవలే ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 12వ విడత నిధులను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ పథకంలో భాగంగా ఇప్పటి వరకు 10 కోట్ల మందికి పైగా రైతులకు 12 వాయిదాలు అందాయి. ఇప్పుడు 13వ విడత పీఎం కిసాన్ నగదు కోసం రైతులు ఎదురుచూస్తున్నారు.

ఈలోగా, ఛత్తీస్‌గఢ్ రైతులు చాలా మందికి భూ ధృవీకరణ, ఇ-కెవైసి చేయని కారణంగా 13వ విడత పొందే అవకాశం తక్కువగా ఉందని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. పీఎం కిసాన్ పథకంలో అవకతవకలు జరగకుండా కేంద్రం కఠిన చర్యలు తీసుకుంది. PM కిసాన్ పథకం తాజా వాయిదాను పొందడానికి, భూ ధృవీకరణ పత్రాలు, e-KYCని చేయడం అవసరం. ఈ పని చేయకుంటే 13వ విడత నగదు అందడం కష్టమే.

ఛత్తీస్‌గఢ్‌లో అర్హులైన రైతుల వివరాలు..

ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్‌లో 27,43,708 మంది రైతులు పీఎం కిసాన్ పథకం లబ్ధిదారుల జాబితాలో యాక్టివ్‌గా ఉన్నారని పార్లమెంట్ శీతాకాల సమావేశాల సందర్భంగా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తెలిపారు. అయితే, PM కిసాన్ పథకం తదుపరి విడత 19,75,340 మంది రైతులు మాత్రమే పొందగలరంటూ పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

13వ విడత నగదు ఎవరు పొందలేరు?

కొంతమంది రైతులు ఇప్పటి వరకు భూ ధృవీకరణ – ఈ-కేవైసీ చేయకపోతే, 13వ విడత నగదు పొందడం కష్టమని అధికారులు పేర్కొంటున్నారు.

పీఎం కిసాన్ హెల్ప్‌లైన్ నంబర్..

ఈలోగా రైతుల కోసం కేంద్రం హెల్ప్‌లైన్ నంబర్‌ను విడుదల చేసింది. మీరు ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కోసం దరఖాస్తు చేసుకున్నట్లయితే, లబ్ధిదారుల స్థితిని తెలుసుకోవడానికి మీరు 155261కి కాల్ చేయవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం..