Business: లాభాదాయకమైన వ్యాపారం కోసం ఎదురు చూస్తున్నారా.. తక్కువ పెట్టుబడితో అధిక సంపాదన..

ప్రపంచ వ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెరుగుతోంది. వాయు కాలుష్యంతో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరగడంతో వాహనాదారులు ప్రత్యామ్నాయం వైపు..

Business: లాభాదాయకమైన వ్యాపారం కోసం ఎదురు చూస్తున్నారా.. తక్కువ పెట్టుబడితో అధిక సంపాదన..
Ev Charging Station (representative Image)
Follow us
Amarnadh Daneti

|

Updated on: Dec 15, 2022 | 9:23 AM

ప్రపంచ వ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెరుగుతోంది. వాయు కాలుష్యంతో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరగడంతో వాహనాదారులు ప్రత్యామ్నాయం వైపు చూస్తున్నారు. ఎలక్ట్రిక్ వాహనాలు (ఈవీ) ఎప్పటినుంచో మార్కెట్లో ఉన్నప్పటికి.. వీటి వినియోగం పెద్దగా లేదు. అయితే కేంద్రప్రభుత్వం చొరవ, పెరుగుతున్న టెక్నాలజీని ఉపయోగించి ప్రస్తుత అవసరాలను దృష్టిలో పెట్టుకుని, పెట్రోల్, డీజిల్ వాహనాలకు ధీటుగా పలు కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేస్తున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నాయన్న ఉద్దేశంతో తొలుత సీఎన్‌జీ వైపు వాహనాదారులు మొగ్గుచూపారు. ప్రస్తుతం సీఎన్‌జీ ధరలు కూడా పెరుగుతుండటంతో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది. ఎలక్ట్రిక్ వెహికల్స్ కాలుష్య రహిత వాహనాలు, దీనితో పాటు దీన్ని నడపడానికి తక్కువ ఖర్చు అవుతుంది. పెట్రోల్, డీజిల్‌తో పోలిస్తే ఎలక్ట్రిక్ వాహనాలు ఛార్జింగ్ చేయడానికి అయ్యే విద్యుత్తు ఖర్చు తక్కువుగా ఉంటుంది. దీంతో ఇప్పటికే ఢిల్లీ, ముంబయి వంటి మహానగరాలతో పాటు పట్టణ ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాల్లో సైతం ఈ-రిక్షాలు ఎక్కువుగా కనిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్ల వ్యాపారం జోరుగా సాగుతోంది. ఈవీ వెహికల్స్ వాడకం తక్కువుగా ఉన్న సమయంలో ఇంట్లోనే ఛార్జింగ్ పెట్టుకునే వాళ్లు. కేవలం స్థానికంగా తిరిగేందుకే ఈ వాహనాన్ని ఉపయోగించేవారు. కాని దీని వినియోగం పెరిగింది. మరోవైపు ఇంట్లో వెహికల్‌ ఛార్జింగ్‌కు ఎక్కువ సమయం పడుతుంది. ఈ నేపథ్యంలో క్షణాల్లో ఛార్జ్ చేసేందుకు ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ ఛార్జింగ్‌ స్టేషన్లు ఏర్పాటుచేస్తున్నారు. కొంత స్థలం, కనీసం లక్ష రూపాయల మూలధనం ఉంటే మీరు ఎలక్ట్రిక్‌ వెహికల్‌ ఛార్జింగ్‌ స్టేషన్ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. అంతేకాదు మంచి లాభాలు కూడా పొందే అవకాశం ఈ బిజినెస్‌లో ఉందంటున్నారు వ్యాపార నిపుణులు.

మీరు ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్ (ఈవీ ఛార్జింగ్ స్టేషన్) వ్యాపారం చేయాలనుకుంటే, దీనిని ఇన్‌స్టాల్ చేయడానికి అయ్యే ఖర్చు ఛార్జర్ సామర్థ్యంపై ఆధారపడి ఉంటుంది. ఈ వ్యాపారం ప్రారంభించాలనుకుంటే కనీసం లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టాలి. ఎక్కువ కెపాసిటీ ఉన్న ఛార్జర్‌ని అమర్చుకుంటే 40 లక్షల రూపాయల వరకు ఖర్చవుతుంది. ఏసీ స్లో ఛార్జర్లు అయితే తక్కువ ధర ఉంటుంది. ఫాస్ట్ ఛార్జర్‌ల ధర ఎక్కువ. DC ఛార్జర్ ధర రూ. 1 లక్ష నుండి రూ. 15 లక్షల మధ్య ఉండవచ్చు. ఏసీ ఛార్జర్ ధర రూ.20,000 నుంచి రూ.70,000 వరకు ఉంటుంది.

ఎలక్ట్రిక్‌ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్‌ ఏర్పాటుకు ఏలాంటి అనుమతులు తీసుకోవాలి. పర్మిషన్స్ రావడం కష్టం అనే భావన చాలామందిలో ఉంటుంది. కాని ఛార్జింగ్ స్టేషన్లకు ఎలాంటి అనుమతి అవసరం లేదు. కొత్త నిబంధనల ప్రకారం, అనుమతి లేకుండా ఏ వ్యక్తి లేదా ఏదైనా సంస్థ పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్‌ను ఏర్పాటు చేసుకోవచ్చు. సాంకేతికత, భద్రత, పనితీరు ప్రమాణాలు, నిర్దిష్ట ప్రోటోకాల్‌లకు కట్టుబడి ఉండటం తప్పనిసరి. ప్రభుత్వం నిర్ధేశించిన నిబంధనలను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. అలాగే ఇంట్లో కూడా ఛార్జింగ్‌ స్టేషన్‌ ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. మీకు తగినంత మూలధనం లేకపోతే, కొంతమంది వ్యక్తులు ఓ బృందం (సెల్ప్‌ హెల్ఫ్‌ గ్రూప్‌)గా ఏర్పడి.. ఛార్జింగ్‌ స్టేషన్ ఏర్పాటు చేసుకోవచ్చు. స్వయం సహాయక బృందాలకు బ్యాంకు నుంచి రుణం అందుతుంది. దీని సహాయంతో ఛార్జింగ్ స్టేషన్‌ను ఏర్పాటు చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

ద్విచక్ర వాహనాలే కాకుండా.. విద్యుత్తుతో నడిచే మూడు చక్రాల వాహనాలు, వాణిజ్య, ప్రైవేట్ ట్రక్కులు లేదా బస్సులకు ఛార్జింగ్ స్టేషన్లను నిర్మించవచ్చు. ఇటువంటి హెవీ వెహికల్స్‌ ఛార్జింగ్‌ స్టేషన్ ఏర్పాటు చేసుకుంటే ఎంతో లాభదాయకంగానూ ఉంటుంది. ఛార్జింగ్ స్టేషన్ నిర్మించడానికి తొలుత విద్యుత్ కనెక్షన్ పొందాలి. అలాగే ఛార్జింగ్ టవర్‌ను నిర్మించడమే దీనికి సంబంధించిన ప్రధాన వ్యయం. మీరు ఈ వ్యాపారాన్ని ప్రారంభిచాలనుకుంటే ముందుగా ఈ వ్యాపారంలో అనుభవం ఉన్న వారి అభిప్రాయాలను తీసుకోవడం చాలా ముఖ్యం. తొందరపడి ప్రణాళిక లేకుండా డిమాండ్ లేని చోట ఈ స్టేషన్ ఏర్పాటు చేసినా ఆశించినంత ప్రయోజనం ఉండకపోవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం చూడండి..