Ola: ఇది కదా గుడ్‌ న్యూస్‌ అంటే.. రూ. 39 వేలకే ఓలా ఎలక్ట్రిక్‌ స్కూటర్‌..

ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ కొనుగోలు చేయాలనుకుంటున్న వారికి ఓలా గుడ్‌ న్యూస్‌ చెప్పిందిచ కేవలం రూ. 39వేలలోనే ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ను సొంతం చేసుకునే అవకాశం కల్పించింది. ఇందులో భాగంగానే తాజాగా ఓలా గిగ్‌ సిరీస్ పేరుతో కొత్త స్కూటర్లను తీసుకొస్తోంది. ఈ సిరీస్‌లో మొత్తం 4 స్కూటర్లను లాంచ్‌ చేశారు..

Ola: ఇది కదా గుడ్‌ న్యూస్‌ అంటే.. రూ. 39 వేలకే ఓలా ఎలక్ట్రిక్‌ స్కూటర్‌..
Ola Scooter
Follow us
Narender Vaitla

|

Updated on: Nov 26, 2024 | 6:12 PM

ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ రంగంలో తనదైన ముద్ర వేసిన ఓలా మార్కెట్లోకి సరికొత్త స్కూటర్లను తీసుకొస్తోంది. ఇప్పటికే ఈవీ రంగంలో దూసుకుపోతున్న ఓలా కొత్తగా ఓలా గిగ్‌ సిరీస్‌లో భాగంగా 4 కొత్త స్కూటర్లను తీసుకొచ్చింది. ఇందులో ఓలా గిగ్‌, ఓలా గిగ్‌+, ఓలా ఎస్‌1 జెడ్‌, ఓలా ఎస్‌1 జడ్‌+, ఓలా పవర్ ప్యాడ్ పేరుతో ఈ స్కూటర్లను తీసుకొచ్చారు. ఇంతకీ వీటిలో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

* తక్కువ దూరం ప్రయాణించే వారి కోసం ఈ స్కూటీని తీసుకొచ్చారు. ఇందులో 1.5 కేడబ్ల్యూహెచ్‌ రిమూవబుల్‌ బ్యాటరీని అందించారు. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 113 కిలోమీటర్లు దూసుకెళ్లొచ్చు. ఈ స్కూటర్‌ గరిష్టంగా గంటకు 25 కి.మీల వేగంతో వెళ్తుంది. అయితే ఈ స్కూటీని బిజినెస్‌ టు బిజినెస్‌తో పాటు రెంటల్‌ కోసం అందుబాటులోకి తీసుకొచ్చారు. ధర విషయానికొస్తే రూ. 39,999గా నిర్ణయించారు.

* ఓలా గిగ్‌+ విషయానికొస్తే.. ఇందులో 1.5 కేడబ్ల్యూహెచ్‌ డ్యూయల్‌ బ్యాటరీ ప్యాక్‌ను ఇచ్చారు. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 81 కిలోమీటర్లు వెళ్లొచ్చు. రెండు బ్యాటరీలతో 157 కిలో మీటర్లు వెళ్లొచ్చు. టాప్‌ స్పీడ్‌ గంటకు 45 కి.మీల వేగంతో వెళ్తుంది. ఈ స్కూటీని కూడా బిజినెస్‌ టు బిజినెస్, రెంటల్స్‌ కోసం అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ధరపరంగా చూస్తే రూ. 49,999గా నిర్ణయించారు.

* ఓలా ఎస్‌1 జడ్‌ స్కూటర్‌లో 1.5 కేడబ్ల్యూహెచ్‌తో కూడిన డ్యూయల్‌ బ్యాటరీని అందించనున్నారు. సింగిల్‌ బ్యాటరీపై 75 కి.మీలు, డబుల్‌ బ్యాటరీలతో కలిపి 146 కి.మీల రేంజ్‌ ఇస్తుంది. టాప్‌ స్పీడ్‌ గంటకు 70 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. ఇందులో ఎల్‌సీడీ డిస్‌ప్లేను సైతం అందించారు. ఈ స్కూటర్‌ ధర రూ. 59,999గా నిర్ణయించనున్నారు.

* ఓలా ఎస్‌1 జడ్‌+ విషయానికొస్తే ఇందులో.. 1.5kWh డ్యూయల్‌ బ్యాటరీని ఇవ్వనున్నారు. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 75 కిలోమీటర్లు వెళ్తుంది. రెండు బ్యాటరీలైతే 146 కి.మీలు వెళ్తుంది. గంటకు 70 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తుంది. ఈ స్కూటీ ధర రూ. 64,999గా నిర్ణయించారు. ఈ స్కూటర్లను రూ. 499 చెల్లించి మంగళవారం నుంచి బుక్‌ చేసుకునే అవకాశం అందించారు. వచ్చే ఏడాదిలో ఈ స్కూటర్స్ అందుబాటులోకి రానున్నాయి.

* ఈ స్కూటర్లతో పాటు ఓలా పవర్‌పాడ్‌ను కూడా తీసుకొస్తోంది. ఓలా పోర్టబుల్ బ్యాటరీని ఇన్వెర్టర్‌లా వాడుకోవచ్చు. 1.5kWh బ్యాటరీ సాయంతో 5 ఎల్‌ఈడీ బల్బులు, 3 సీలింగ్‌ ఫ్యాన్లు, 1 టీవీ, 1 మొబైల్‌ ఫోన్‌, 1 వైఫై రూటర్‌ను 3 గంటల పాటు నడిపించవచ్చు. దీని ధరను రూ.9,999గా నిర్ణయించారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..