PPF Investment: నెలనెలా రూ.10 వేల పెట్టుబడితో 82 లక్షల రాబడి.. ఆ ప్రభుత్వ పథకంతోనే సాధ్యం

భారతదేశంలో ఉద్యోగుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ప్రైవేట్ ఉద్యోగులతో పోల్చుకుంటే ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య తక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రైవేట్ ఉద్యోగులతో పాటు సామాన్య ప్రజలు పొదుపు చేసుకునేలా కేంద్ర ప్రభుత్వం వివిధ ప్రభుత్వ పథకాలను లాంచ్ చేసింది. అందులో ముఖ్యంగా పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) అనేది అధిక ప్రజాదరణ పొందింది. కేవలం నెలకు రూ.10 వేల పెట్టుబడితో మెచ్యూరిటీ సమయానికి రూ.82 లక్షల వస్తుందని నిపుణులు చెబుతున్నారు. రూ.10 వేల పెట్టుబడితో రూ. 82 లక్షల రాబడి గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

PPF Investment: నెలనెలా రూ.10 వేల పెట్టుబడితో 82 లక్షల రాబడి.. ఆ ప్రభుత్వ పథకంతోనే సాధ్యం
Money Astrology
Follow us
Srinu

|

Updated on: Nov 26, 2024 | 4:45 PM

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పథకానికి దేశంలోనే అత్యంత ఆదరణ ఉంది. చాలా మంది వ్యక్తులు తమ డబ్బును ఇందులో పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి చూపుతున్ారు. ప్రస్తుతం మీరు ఈ ప్లాన్‌లో పెట్టుబడి పెట్టడం ద్వారా 7.1 శాతం వడ్డీ రేటును పొందవచ్చు. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టడం వల్ల మీకు పన్ను ప్రయోజనాలు కూడా లభిస్తాయి. ఒక ఆర్థిక సంవత్సరంలో, మీరు పీపీఎఫ్ పథకంలో గరిష్టంగా రూ. 1.5 లక్షలు పెట్టుబడి పెట్టడానికి అనుమతి ఉంటుంది. ఈ పథకంలో కనీస పెట్టుబడి పరిమితిని రూ.500గా నిర్ణయించారు.

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్‌లో 15 సంవత్సరాల వరకు పెట్టుబడి పెట్టే అవకాశం మీకు ఉంది. 15 సంవత్సరాల పెట్టుబడి వ్యవధి తరువాత మీరు అదనంగా ఐదు సంవత్సరాల పాటు పెట్టుబడిని కొనసాగించడాన్ని ఎంచుకోవచ్చు. ఈ పథకంలో మీరు నెలకు రూ. 10 వేల పెట్టుబడి పెట్టి 82.46 లక్షల రూపాయల రాబడిని పొందవచ్చు. ఇలా చేయాలని  పీపీఎఫ్ పథకం కోసం ఖాతాను సృష్టించడం అవసరం. 

ఖాతా తెరిచిన తర్వాత మీరు నెలకు రూ.10,000 రూపాయలు డిపాజిట్ చేయాలి. అంటే వార్షికంగా రూ. 1,20,000 జమ చేయాల్సి ఉంటుంది. మీరు ఈ మొత్తాన్ని ఏటా తప్పనిసరిగా పీపీఎఫ్ స్కీమ్‌లో పెట్టుబడికి పెట్టాలలి. ఇలా తప్పనిసరిగా రూ. 25 సంవత్సరాల కాలవ్యవధికి పీపీఎఫ్ ఖాతాలో ప్రతి సంవత్సరం రూ.1,20,000 పెట్టుబడి పెడితే ప్రస్తుత వడ్డీ రేటు 7.1 శాతం గణించడం ద్వారా మీరు 25 సంవత్సరాలలో రూ. 82,46,412 రాబడి వస్తుంది. పీపీఎఫ్ పథకం అనేది ముఖ్యంగా ప్రైవేట్ ఉద్యోగుస్తులకు మెరుగైన ఎంపిక అని నిపుణులు చెబుతున్నారు. నెలవారీ నిర్ణీత మొత్తంలో పెట్టుబడి పెట్టే వారికి తక్కువ సమయంలో అధిక లాభాలాను పీపీఎఫ్ పథకం ద్వారా పొందవచ్చని వివరిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి