Business Idea: తక్కువ పోటీ.. ఎక్కువ లాభాలు.. లక్షలు సంపాదించే వ్యాపారం..
వ్యాపారం చేయాలనే ఆసక్తి చాలా మంది ఉంటుంది. అయితే మార్కెట్ లో నెలకొన్న పోటీ నేపథ్యంలో ఆ దిశగా అడుగు పెట్టేందుకు వెనుకడుగు వేస్తుంటారు. అయితే పోటీలేని వ్యాపారాలు కూడా ఉన్నాయి. అలాంటి ఒక మంచి బిజినెస్ ఐడియా గురించి ఈ రోజు తెలుసుకుందాం..
తక్కువ సమయంలో ఎక్కువ సంపాదించాలన్నా, నలుగురికి ఉపాధి కల్పించాలన్న బెస్ట్ ఆప్షన్ వ్యాపారం మాత్రమే. అందుకే చాలా మంది యువత ఇటీవల వ్యాపారానికి మొగ్గు చూపుతున్నారు. ఐఐటీ, ఐఏఎమ్‌ల వంటి పెద్ద విద్యా సంస్థల్లో చదువుకున్న వారు కూడా ఉద్యోగం కంటే వ్యాపారానికే జై కొడుతున్నారు. రకరకాల మార్గాలను ఎంచుకుంటూ వ్యాపారాల్లో రాణిస్తున్నారు.
వ్యాపారం అనగానే మొదట గుర్తొచ్చేది పోటీ. ఈ పోటీ ప్రపంచంలో ఏ వ్యాపారం ప్రారంభించాలన్నా ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎలాంటి పోటీ లేని ఓ వ్యాపారం ఉంది. అదే టాయిలెట్ బ్రష్ తయారీ వ్యాపారం. మనకు తెలిసినంత వరకు హోల్‌సేల్‌లో వీటిని అమ్మే వారు ఉన్నారు కానీ.. తయారు చేసే వారు తెలిసి ఉండరు. ఇలాంటి తయారీ యూనిట్‌ను మీరు ఏర్పాటు చేసుకుంటే ఊహించని లాభాలు పొందొచ్చు. ఇంతకీ టాయిలెట్ బ్రష్ తయారీ వ్యాపారానికి ఎంత ఖర్చు అవుతుంది.? లాభాలు ఎలా ఉంటాయి.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ వ్యాపారాన్ని ప్రారంభించేందుకు ప్లాస్టిక్ స్టిక్స్, బ్రష్‌కు ముందు ఉండే ఫైబర్ మెటీరియల్, బ్రష్ తయారీకి ఉపయోగించే మిషిన్. పెట్టుబడి విషయానికొస్తే.. ఈ బ్రష్‌ల తయారీ మిషిన్ సెమీ అటోమెటిక్ వేరియంట ధర రూ. 1 లక్ష నుంచి రూ. లక్షన్నర వరకు ఉంటుంది. ఫుల్లీ ఆటోమేటిక్ మిషిన్ సుమారు రూ. 6 లక్షల వరకు ఉంటుంది. బ్రష్‌ల తయారీకి అవసరమైన రా మెటీరియల్ మీ కెసాపిటీ బట్టి రూ. 50 వేల నుంచి కొనుగోలు చేసుకోవచ్చు. ఈ మిషిన్స్‌ను విక్రయించే వారే రా మెటీరియల్‌తో పాటు, తయారీ విధానాన్ని నేర్పిస్తుంటారు.
ఇక లాభాల విషయానికొస్తే సాధారణంగా ఒక బాత్‌రూమ్ బ్రష్‌ను తయారు చేయడానికి సుమారు రూ. 20 వరకు ఖర్చు అవుతుంది. ప్రస్తుతం మార్కెట్లో తక్కువలో తక్కువ రూ. 60 వరకు విక్రయిస్తున్నారు. హోల్ సేల్‌లో రూ. 40కి ఒక్క బ్రష్‌ను విక్రయించుకోవచ్చు. ఈ లెక్కన ఒక్కో బ్రష్‌పై సుమారు రూ. 20 లాభం వస్తుంది. ఇలా రోజుకు 100 బ్రష్‌లను హోల్‌సేల్‌గా విక్రయించినా రూ. 6000 సంపాదించవచ్చు. అంటే నెలకు ఎంతకాదన్నా లాభం రూ. లక్షపైమాటే అన్నట్లు. మీ వ్యాపారం వృద్ధి చెందుతున్నకొద్దీ ఫుల్లీ ఆటోమెటిక్ మిషిన్ కొనుగోలు చేస్తే లాభాలు మరింత ఎక్కువగా ఆర్జించవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..