Lifestyle: చలికాలం ఇలా చేస్తే.. పెదవుల అందం పదిలం..
చలికాలం పెదాలు పగలడం సర్వసాధారణమైన సమస్య. ప్రతీ ఒక్కరూ ఈ సమస్య బారినపడే ఉంటారు. అయితే వీటికి మార్కెట్లో లభించే మాయిశ్చరైజర్లను కాకుండా.. ఇంట్లో లభించే నేచురల్ వస్తువులు కూడా ఎంతో ఉపయోగపడతాయి. అలాంటి కొన్ని నేచురల్ టిప్స్ గురిచి ఇప్పుడు తెలుసుకుందాం..
చలి పంజా విసురుతోంది. రోజురోజుకీ ఉష్ణోగ్రతలు తగ్గిపోతున్నాయి. చలికాలం రాగానే ఎదురయ్యే ప్రధాన సమస్యల్లో చర్మ సంబంధిత సమస్యలు ముఖ్యమైనవి. ముఖ్యంగా పెదవులు పొడిబారుతాయి. కొన్ని సందర్భాల్లో ఈ సమస్య ఎక్కువై ఇన్ఫెక్షన్‌కు సైతం దారి తీస్తుంది. ఇది పెదవులపై పుండ్లకు దారి తీస్తుంది. దీంతో చాలా మంది మాయిశ్చరైజర్లను ఉపయోగిస్తుంటారు. అయితే సహజ పద్ధతులతో కూడా పగిలిన పేదాలకు చెక్ పెట్టొచ్చని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
* తేనెను పేదాలకు అప్లై చేయడం వల్ల స్మూత్‌గా మారుతాయి. ఇది యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది. దీంతో పేదాలు పొడిగా మారడం వల్ల వచ్చే ఇన్ఫెక్షన్‌ను తగ్గిస్తాయి. రాత్రి పడుకునే ముందు పేదాలకు తేనెను అప్లై చేసుకోవడం వల్ల పేదాలు స్మూత్‌గా మారిపోతాయి.
* కలబంద కూడా పేదాల ఆరోగ్యాన్ని కాపాడడంలో ఉపయోగపడుతుంది. ఇందులోని మాయిశ్చరైజింగ్ ప్రాపర్టీ డ్రైనెస్ సమస్యను దూరం చేస్తుంది. రాత్రి పడుకునే ముందు కొంచెం అలొవెరా జెల్‌ను పేదలపై అప్లై చేసుకొని కాసేపటి తర్వాత కడిగేసుకోవాలి. ఇలా చేయడం వల్ల పేదాలు స్మూత్‌గా మారుతాయి.
* కొబ్బరి నూనెలో కూడా మంచి మాయిశ్చరైజింగ్ లక్షణాలు ఉంటాయి. ఇది చర్మాన్ని తక్షణమే హైడ్రేట్‌గా చేస్తుంది. కేవలం కొబ్బరి నూనె మాత్రమే కాకుండా.. బాదం నూనె, అవకాడో నూనె, ఆలివ్ నూనెలు కూడా పేదాలను కాపాడుతాయి. కొబ్బరి నూనెలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్ లక్షణాలు పుష్పలంగా ఉంటాయి. ఇది ఇన్ఫెక్షన్ల నుంచి పెదాలను కాపాడుతాయి.
* పేదాలకు నెయ్యిని అప్లై చేయడం వల్ల ప్రభావవంతంగా పనిచేస్తుంది. నెయ్యి నేచురల్ లిప్ బామ్‌గా ఉపయోగపడుతుంది. ఇందులోని ఎన్నో పోషకాలు పేదల ఆరోగ్యాన్ని కాపాడుతాయి. రాత్రి పడుకునే ముందు నెయ్యిని అప్లై చేసుకుంటే ఉదయం లేచే సరికి పెదాలు స్మూత్‌గా మారుతాయి.
నోట్: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..