Stop Alcohol

సడన్‌గా ఆల్కహాల్ తాగడం మానేస్తే ఏమవుతుందో తెల్సా

image

26 November 2024

Ravi Kiran

Glass Of Alcohol

మితిమీరిన మద్యపానం ఆరోగ్యానికి హానికరం. అయినా చాలా మంది మద్యం తాగడం మానుకోవాలని అనుకోరు. 

Alcohol Kidney Damage

అయితే మద్యం రోజూ తాగినా అప్పుడప్పుడు తాగినా సరే ఇది శరీరంలోకి వెళ్లి కీలక అవయవాలపై ప్రభావం చూపుతుంది.

Alcohol Drinking

ఆల్కహాల్ శరీరంలోకి వెళ్లిన తర్వాత ఏం జరుగతుందనే విషయం చాలా మందికి తెలియదు. అయితే రోజూ మద్యం తాగే వారు సడన్‌గా మానేస్తే చాలా ఇబ్బందులు వస్తాయని వైద్య నిపుణులు అంటున్నారు. 

ఆల్కహాల్ తాగడం సడన్‌గా మానేస్తే కొందరిలో తీవ్రమైన సమస్యలు కనిపిస్తాయి. దీనినే విత్‌డ్రాయల్ సిండ్రోమ్ అని పిలుస్తారు.

మద్యం హఠాత్తుగా మానేస్తే కొంతమందిలో టెన్షన్, అలసట కనిపిస్తాయి. కొన్నేళ్లు మద్యం తాగి మానేస్తే మానసిక సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు.

కొంతమంది మద్యం తాగడం మానిస్తే చెవుల్లో పెద్ద శబ్దాలు వినిపిస్తున్నాయట.. అంతే కాదు ఎవరో తమను పిలుస్తున్నట్టు కూడా అనిపిస్తుందట. దీనినే ఆల్కహాల్ ప్రేరేపిత బ్రాంతి అంటారు.

ఏళ్ల తరబడి మద్యం తాగి.. ఏదో ఒక కారణంతో తాగడం మానేస్తే వారిలో మూడు రోజుల్లోపు మానసిక సమస్యలు తలెత్తుతాయి. కోపం, ముందు ఏం ఉందో తెలియని పరిస్థితి, అయోమయంలోకి వెళ్తారు. 

ఆల్కహాల్ తీసుకోవడం మానేయాలనుకొనే వారు క్రమేణ తగ్గించుకుంటూ రావాలి. ఒక నెల పాటు వారానికి రెండు సార్లు.. వారానికోసారి తగ్గించుకుంటే వస్తే శరీరంపై ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవని వైద్యులు చెబుతున్నారు.