మన చుట్టూ అనేక రకాల ఔషధ మెుక్కలు ఉంటాయి. కానీ వాటిని మనం పట్టించుకోం. చాలా ఔషధ గుణాలను కలిగిన మెుక్కల్లో తుమ్మ చెట్టు కూడా ఒక్కటి.
TV9 Telugu
నల్ల తుమ్మచెట్టును పంట పొలాలకు కంచెలుగా కూడా ఉపయోగిస్తారు. ఈ చెట్టు కలపతో బొమ్మలు, పడవలు, వివిధ రకాల ఫర్నీచర్ చేసేందుకు ఉపయోగిస్తారు. ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉంటుంది.
TV9 Telugu
నల్ల తుమ్మ బెరడుతోపాటు దాని జిగురును, కాయలను కలిపి మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని మూడు పూటలా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదని చెబుతారు. దీంతో వెన్ను నొప్పి తగ్గుతుంది.
TV9 Telugu
నల్ల తుమ్మ ఆకులు కూడా మనకు ఉపయోగపడతాయి. లేత నల్ల తుమ్మ ఆకులను జ్యూస్ గా చేసుకుని తాగితే.. స్త్రీలలో నెలసరి సమయంలో వచ్చే నొప్పులు తగ్గుతాయి.
TV9 Telugu
నల్ల తుమ్మకాయలను ఎండబెట్టి పొడిగా చేయాలి. దీనిలో తగినన్ని నీళ్లు అలాగే కండె చక్కెరను కలిపి పేస్ట్ చేయాలి. ఇది తీసుకోవడం వలన పురుషుల్లో లైంగిక సామర్థ్యం పెరుగుతుంది.
TV9 Telugu
నల్ల తుమ్మ చెట్టు బెరడుతో కషాయాన్ని చేసుకొని నోట్లో పోసుకుని పుక్కిలించి ఉమ్మి వేయాలి. ఇలా చేస్తే.. నోటిపూత, నోటిలో ఇతర సమస్యలు తగ్గుతాయి.
TV9 Telugu
తుమ్మ ఆకులను వాము , జీలకర్ర కలిపి కషాయంలా చేసుకుని తాగాలి. ఇలా చేస్తే.. డయేరియా సమస్య తగ్గుతుంది. ఈ విధంగా నల్ల తుమ్మ చెట్టు మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది.
TV9 Telugu
నల్ల తుమ్మ చెట్టు బంకను పొడిగా చేసి పాలల్లో కలుపుకొని తాగితే మంచిది. దీనిద్వారా కీళ్ల నొప్పులు తగ్గుతాయి. విరిగిన ఎముకలు సైతం.. అతుక్కుంటాయి.