Marriage Astrology: మకర రాశిలో శుక్రుడు.. ఆ రాశుల వారికి ప్రేమలు, పెళ్లిళ్లు!
Venus Transit 2024: డిసెంబర్ 2వ తేదీన శుక్రుడు మకర రాశిలో ప్రవేశించడంతో కర్కాటక రాశిలో సంచారం చేస్తున్న కుజుడితో సమ సప్తక దృష్టి ఏర్పడుతోంది. కుజ, శుక్రులు పరస్పరం చూసుకోవడం వల్ల ప్రేమ వ్యవహారాల్లో విజయం సాధించడం, పెళ్లి ప్రయత్నాలు సఫలం కావడం, దాంపత్య జీవితం సుఖ సంతోషాలతో నిండిపోవడం, ఆదాయం వృద్ధి చెందడం, యాంబిషన్ పెరగడం వంటివి జరుగుతాయి.
Shukra Gochar in Makara Rashi: డిసెంబర్ 2వ తేదీన శుక్రుడు మకర రాశిలో ప్రవేశించడంతో కర్కాటక రాశిలో సంచారం చేస్తున్న కుజుడితో సమ సప్తక దృష్టి ఏర్పడుతోంది. కుజ, శుక్రులు పరస్పరం చూసుకోవడం వల్ల ప్రేమ వ్యవహారాల్లో విజయం సాధించడం, పెళ్లి ప్రయత్నాలు సఫలం కావడం, దాంపత్య జీవితం సుఖ సంతోషాలతో నిండిపోవడం, ఆదాయం వృద్ధి చెందడం, యాంబిషన్ పెరగడం వంటివి జరుగుతాయి. కొన్ని రాశులకు ఇటువంటి సానుకూల ఫలితాలు అనుభవానికి వస్తుండగా మరికొన్ని రాశులకు కొద్దిగా ప్రతికూల ఫలితాలు అందే అవకాశం ఉంది. మేషం, కర్కాటకం, కన్య, తుల, మకరం, మీన రాశులకు ఈ శుక్ర, కుజుల సమ సప్తక దృష్టి తప్పకుండా శుభ ఫలితాలనిస్తుంది.
- మేషం: చతుర్థ స్థానంలో ఉన్న రాశ్యధిపతి కుజుడి మీద శుక్రుడి దృష్టి పడడం వల్ల దాంపత్య జీవితం నిత్య కల్యాణం పచ్చ తోరణంలా సాగిపోతుంది. కుటుంబంలోకి ధన ప్రవాహం ఉంటుంది. వృత్తి, ఉద్యోగాల్లో అందలాలు ఎక్కడంతో పాటు, యాక్టివిటీ బాగా పెరుగుతుంది. మనసులోని కోరికలు లేదా ఆశలు చాలావరకు నెరవేరే అవకాశం ఉంది. ఆకస్మిక ధన లాభ యోగం పడుతుంది. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి. గృహ, వాహన ప్రయత్నాలు సానుకూలపడతాయి.
- కర్కాటకం: ఈ రాశిలో సంచారం చేస్తున్న కుజుడితో సప్తమ స్థానంలో ఉన్న శుక్రుడికి సమ సప్తమ దృష్టి ఏర్పడినందువల్ల ఉన్నత కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి సంబంధం కుదురుతుంది. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు. ఆదాయ వృద్ధికి గట్టి ప్రయత్నాలు సాగిస్తారు. ఆస్తి వివాదాలను రాజీమార్గంలో పరిష్కరించుకుంటారు. అనేక విధాలుగా సంపద యోగం కలుగుతుంది. విదేశా లకు వెళ్లడానికి అవకాశాలు లభిస్తాయి. నిరుద్యోగులకు, ఉద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి.
- కన్య: ఈ రాశికి లాభ స్థానంలో ఉన్న కుజుడు, పంచమ స్థానంలో ఉన్న శుక్రుడు పరస్పరం వీక్షించుకో వడం వల్ల అనేక విధాలుగా ధన లాభం కలుగుతుంది. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కా రమై, విలువైన ఆస్తి లభిస్తుంది. ఆస్తుల విలువ పెరుగుతుంది. ఉద్యోగంలో సమర్థతకు మంచి గుర్తింపు లభించడంతో పాటు అధికార యోగం పడుతుంది. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ పెరగ డంతో పాటు లాభాలు వృద్ధి చెందుతాయి. వ్యక్తిగత, ఆర్థిక, ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి.
- తుల: ఈ రాశికి దశమంలో ఉన్న కుజుడితో, చతుర్థంలో ఉన్నరాశ్యధిపతి శుక్రుడికి సమ సప్తక దృష్టి ఏర్పడినందువల్ల రాజయోగాలు కలగడంతో పాటు ఒకటికి రెండుసార్లు ధన యోగాలు కూడా కలుగుతాయి. పెళ్లి ప్రయత్నాలు సఫలం అవుతాయి. ప్రేమ వ్యవహారాల్లో విజయాలు సాధిస్తారు. గృహ, వాహన ప్రయత్నాలకు ఇది బాగా అనుకూలమైన సమయం. కుటుంబంలో సుఖ సంతోషాలు వృద్ది చెందుతాయి. దాంపత్య జీవితం సుఖమయం అవుతుంది. ఆరోగ్యం చక్కబడుతుంది.
- మకరం: ఈ రాశిలో ఉన్న శుక్రుడితో సప్తమంలో ఉన్న కుజుడికి సమ సప్తకం ఏర్పడినందువల్ల సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో ప్రేమలో పడడం లేదా పెళ్లి కావడం జరుగుతుంది. వృత్తి, వ్యాపా రాలు ఇబ్బడిముబ్బడిగా లాభాలార్జిస్తాయి. ఉద్యోగంలో ఉన్నత పదవులు లభించడానికి అవ కాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నించేవారు శుభవార్తలు వింటారు. ఉద్యోగులకు, నిరుద్యోగులకు విదేశాల నుంచి ఆఫర్లు అందుతాయి. దాంపత్య జీవితం హ్యాపీగా సాగిపోతుంది.
- మీనం: ఈ రాశికి లాభస్థానంలో ఉన్న శుక్రుడి మీద పంచమ స్థానం నుంచి కుజుడి దృష్టి పడినందువల్ల ఎటువంటి ప్రయత్నమైనా సఫలం అవుతుంది. ఆదాయ ప్రయత్నాలన్నీ ఫలించి సంపద బాగా వృద్ధి చెందుతుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు ఫలించి కలలో కూడా ఊహించని ఫలితాలు కలు గుతాయి. ఉద్యోగంలో సమర్థతకు సరైన గుర్తింపు లభించి హోదా పెరుగుతుంది. వృత్తి, వ్యాపా రాలు ఆర్థిక సమస్యల నుంచి, నష్టాల నుంచి బయటపడతాయి. సంతాన యోగం కలుగుతుంది.
ఇవి కూడా చదవండి