Astrology: ఇక రాహువులో వేగం.. ఆ రాశుల వారికి కనక వర్షం పక్కా..!

జ్యోతిష్య శాస్త్రంలో రాహువుకు చాలా ప్రాధాన్యత ఉంది. రాహువు ప్రతి రాశిలోనూ ఏడాదిన్నర పాటు సంచరిస్తాడు. 2023 అక్టోబర్‌లో మీన రాశిలోకి ప్రవేశించిన రాహువు.. ఈ రాశిలో 2025 మే 18 వరకు సంచారం చేస్తాడు. ప్రస్తుతం మీన రాశిలోని ఉత్తరాభాద్ర నక్షత్రంలో సంచారం చేస్తున్న రాహువులో వేగం పెరగడంతో కొన్ని రాశుల వారికి ఇవ్వాల్సిన వరాలను మే లోపు ఇవ్వడం జరుగుతుంది. దీంతో ఆ రాశుల వారికి కనక వర్షం కురవనుంది.

TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Nov 24, 2024 | 6:09 PM

రాహువు ప్రతి రాశిలోనూ ఏడాదిన్నర పాటు కొనసాగుతాడు. 2023 అక్టోబర్‌లో మీన రాశిలోకి ప్రవేశించిన రాహువు ఈ రాశిలో 2025 మే 18 వరకు సంచారం చేయడం జరుగుతుంది. ప్రస్తుతం మీన రాశిలోని ఉత్తరాభాద్ర నక్షత్రంలో సంచారం చేస్తున్న రాహువులో వేగం పెరగడం వల్ల కొన్ని రాశుల వారికి ఇవ్వాల్సిన వరాలను మే లోపు ఇవ్వడం జరుగుతుంది. ఫలితంగా వృషభం, మిథునం, తుల, వృశ్చికం, మకరం, కుంభ రాశుల వారికి అనేక విధాలుగా శుభ ఫలితాలను ఇవ్వడం జరుగుతుంది. ఈ రాశులవారికి రాహువు సంచారం చేస్తున్న స్థానాలను బట్టి శుభ యోగాలను అనుగ్రహించడం జరుగుతుంది.

1 / 7
వృషభం: ఈ రాశికి లాభ స్థానంలో సంచారం చేస్తున్న రాహువు తప్పకుండా ఈ రాశివారికి సిరిసంపదలను అనుగ్రహించే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఇబ్బడిముబ్బడిగా ఆదాయం పెరగ డంతో పాటు, షేర్లు, స్పెక్యులేషన్లు, వడ్డీ వ్యాపారాలు, ఇతర ఆర్థిక లావాదేవీల కారణంగా కూడా ఆదాయాన్ని బాగా పెంచే సూచనలున్నాయి. విదేశీ సొమ్మును అనుభవించే యోగం కూడా ఉంది. ఆస్తిపాస్తుల విలువ పెరుగుతుంది. లాభదాయక పరిచయాలు బాగా వృద్ధి చెందుతాయి.

2 / 7
మిథునం: ఈ రాశివారికి దశమ స్థానంలో రాహువు సంచారం వల్ల తప్పకుండా ఉద్యోగంలో ఉన్నత పద వులు లభించే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు అంచనాలకు మించి అభివృద్ధి చెందుతాయి. నిరుద్యోగులకు, ఉద్యోగులకు విదేశీ అవకాశాలు కూడా లభించే అవకాశం ఉంది. మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి చేసే ప్రయత్నాలు నెరవేరుతాయి. గృహ, వాహన లాభాలు కలుగు తాయి. తండ్రి నుంచి ఆస్తి లాభం కలుగుతుంది. ప్రభుత్వం నుంచి కూడా గుర్తింపు లభిస్తుంది.

3 / 7
తుల: ఈ రాశికి ఆరవ స్థానంలో ఉన్న రాహువు ఈ అయిదారు నెలల కాలంలో తప్పకుండా ఉద్యో గంలో పదోన్నతిని ఇవ్వడం, జీతభత్యాలు పెంచడం జరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు కష్ట నష్టాల నుంచి దాదాపు పూర్తిగా బయటపడతాయి. ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యల నుంచి పూర్తిగా విముక్తి లభించే అవకాశం ఉంది. ఆస్తి వివాదాల్లోనూ, కోర్టు కేసుల్లోనూ విజయాలు సాధించడం జరుగుతుంది. నిరుద్యోగులకు విదేశీ అవకాశాలు అంది వస్తాయి. మానసిక ఒత్తిడి తగ్గిపోతుంది.

4 / 7
వృశ్చికం: ఈ రాశివారికి పంచమ స్థానంలో ఉన్న రాహువుకు చేష్టా బలం కలగడం వల్ల ఈ రాశివారి మీద దాదాపు కనక వర్షం కురుస్తుంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఆస్తి లాభం కలుగుతుంది. ఉద్యోగంలో భారీ జీతభత్యాలతో అందలాలు ఎక్కడం జరుగుతుంది. సామాజికంగా కూడా ప్రతిభా పాటవాలకు, సమర్థతకు ఆశించిన గుర్తింపు లభిస్తుంది. షేర్లు, స్పెక్యులేషన్లు, సెక్యూరిటీల వంటివి అత్యధికంగా లాభాలనిస్తాయి. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. సంతాన యోగానికి అవకాశం ఉంది.

5 / 7
మకరం: ఈ రాశికి తృతీయ స్థానంలో సంచారం చేస్తున్న రాహువు వల్ల పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. అనేక వైపుల నుంచి ఆదాయం పెరుగుతుంది. సోదరులతో ఆస్తి వివాదం సానుకూలంగా పరిష్కారం అవుతుంది. ప్రముఖులతో లాభదాయక సంబంధాలు, ఒప్పందాలు ఏర్పడతాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాల పంట పండుతుంది. ఏ ప్రయత్నమైనా విజ యవంతం అవుతుంది. ఏ రంగంలో ఉన్నా వృద్ధి, పురోగతి తప్పకుండా కలిగే అవకాశం ఉంది.

6 / 7
కుంభం: ఈ రాశికి ధన స్థానంలో సంచారం చేస్తున్న రాహువు వల్ల ఆదాయం అంచనాలకు మించి పెరగ డంతో పాటు, ముఖ్యమైన ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. మాటకు విలువ పెరుగు తుంది. కుటుంబ జీవితం నల్లేరు మీద బండిలా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో రాబడి దిన దినాభివృద్ధి చెందుతుంది. కుటుంబ పరిస్థితులు బాగా చక్కబడతాయి. శుభకార్యాలు జరిగే అవ కాశం కూడా ఉంది. రాజపూజ్యాలు ఎక్కువగా ఉంటాయి. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది.

7 / 7
Follow us