Horoscope Today: ఉద్యోగంలో వారి హోదా పెరిగే ఛాన్స్.. 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు

Today Horoscope (November 27, 2024): మేష రాశి వారు ధనపరంగా ఎవరికీ వాగ్దానాలు చేయకపోవడం చాలా మంచిది. వృషభ రాశి వారి ఆర్థిక పరిస్థితి మెరుగ్గా, సంతృప్తికరంగా ఉండే అవకాశముంది. మిథున రాశి వారు అదనపు ఆదాయం కోసం ఏ ప్రయత్నం తలపెట్టినా సఫలం అవుతారు. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

Horoscope Today: ఉద్యోగంలో వారి హోదా పెరిగే ఛాన్స్.. 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు
Horoscope Today 27 November 2024
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Nov 27, 2024 | 5:01 AM

దిన ఫలాలు (నవంబర్ 27, 2024): మేష రాశి వారు ధనపరంగా ఎవరికీ వాగ్దానాలు చేయకపోవడం చాలా మంచిది. వృషభ రాశి వారి ఆర్థిక పరిస్థితి మెరుగ్గా, సంతృప్తికరంగా ఉంటుంది. మిథున రాశి వారు అదనపు ఆదాయం కోసం ఏ ప్రయత్నం తలపెట్టినా సఫలం అవుతుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

ఆదాయం సంతృప్తికరంగా వృద్ది చెందుతుంది. రావాల్సిన డబ్బు కొద్ది ప్రయత్నంతో వసూలవుతుంది. ధనపరంగా ఎవరికీ వాగ్దానాలు చేయకపోవడం చాలా మంచిది. సొంత పనులు, వ్యక్తిగత సమస్యల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. బంధు మిత్రులతో ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవడం వల్ల నష్టపోయే అవకాశం ఉంది. ఆర్థిక వ్యవహారాల్లో చిన్నపాటి ఇబ్బందులు తలెత్తుతాయి. ఆరోగ్యం బాగా అనుకూలంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ప్రాభవం బాగా పెరిగే అవకాశం ఉంది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

వృత్తి, ఉద్యోగాల్లో హోదాలు పెరగడం లేదా బాధ్యతలు మారడం జరుగుతుంది. వ్యాపారంలో తక్కువ శ్రమతో ఎక్కువ లాభాలు గడిస్తారు. పెళ్లి సంబంధం విషయంలో బంధువుల నుంచి ఆశించిన శుభవార్త అందుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా, సంతృప్తికరంగా ఉంటుంది. తలపెట్టిన పనులన్నీ దాదాపు పూర్తవుతాయి. ప్రయాణాల్లో మంచి వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి. దైవ కార్యాల్లో పాల్గొంటారు. ఆర్థిక సమస్యలు కొద్దిగా తగ్గుముఖం పడతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

ఆదాయానికి లోటుండకపోవచ్చు. రావలసిన డబ్బు తప్పకుండా వసూలవుతుంది. అదనపు ఆదాయం కోసం ఏ ప్రయత్నం తలపెట్టినా సఫలం అవుతుంది. ముఖ్యమైన వ్యవహారాలు, పనులు నిదానంగా పూర్తవుతాయి. బంధుమిత్రులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. కొత్త ఉద్యోగ ప్రయత్నాల్లో ఒకటి రెండు శుభవార్తలు వింటారు. పెళ్లి ప్రయత్నాలు సానుకూలపడతాయి. ఉద్యో గంలో అదనపు బాధ్యతలను చేపట్టాల్సి వస్తుంది. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

వృత్తి, వ్యాపారాల్లో తక్షణ ఆర్థిక సమస్యల్ని అధిగమిస్తారు. ఉద్యోగంలో ఆశించిన పురోగతి సాధిస్తారు. హోదా పెరిగే అవకాశం కూడా ఉంది. కుటుంబ సభ్యులతో ఇష్టమైన ఆలయాలు సందర్శిస్తారు. ఆదాయపరంగా ఒకటి రెండు శుభవార్తలు వింటారు. ఇంటా బయటా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో, సంతృప్తికరంగా పూర్తవుతాయి. వ్యక్తిగత సమస్యల మీద మీద దృష్టి పెడతారు. కుటుంబ జీవితం ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

కొద్ది శ్రమతో ముఖ్యమైన పనులు, వ్యవహారాలు పూర్తవుతాయి. కుటుంబం మీద బాగా ఖర్చు చేయాల్సి వస్తుంది. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. ఆర్థిక వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఇంటికి ఇష్టమైన బంధువుల రాకపోకలుంటాయి. ఆర్థిక విషయాల్లో తొందరపాటుతనంతో వ్యవహరించడం మంచిది కాదు. జీవిత భాగస్వామిని సంప్రదించి సలహాలు తీసుకోవడం మంచిది. కొందరు మిత్రులతో సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

ఉద్యోగంలో చిన్నా చితకా సమస్యలున్నా పరిష్కరించుకుంటారు. వృత్తి జీవితంలో సానుకూల పరిస్థితులుంటాయి. వ్యాపారాల్లో చాలావరకు ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. ప్రము ఖులతో పరిచయాలు పెరుగుతాయి. గౌరవమర్యాదలకు లోటుండదు. ఆదాయం బాగానే వృద్ధి చెందుతుంది. కొందరు బంధుమిత్రులతో విహార యాత్ర చేసే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో కలిసి భారీగా వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఆర్థిక లావాదేవీలు అనుకూలంగా సాగిపోతాయి.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

ఆదాయ ప్రయత్నాలు ఆశించిన ఫలితాలనిస్తాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా కార్యసిద్ధి కలుగుతుంది. జీవిత భాగస్వామితో కలిసి ఆలయాలు సందర్శించడం జరుగుతుంది. ఉద్యోగంలో అధికారులకు మీ మీద బాగా నమ్మకం కలుగుతుంది. వృత్తి, వ్యాపారాలు రాబడిపరంగా పురోగ మిస్తాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. అనుకోకుండా ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్లు అందే సూచనలున్నాయి. దైవ కార్యాల్లో పాల్గొంటారు.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

వృత్తి, వ్యాపారాలు రాబడిపరంగా నిలకడగా సాగిపోతాయి. వృత్తి జీవితం బాగా బిజీగా సాగిపోతుంది. వ్యాపారాలు సంతృప్తికరంగా ముందుకు సాగుతాయి. ఉద్యోగంలో అధికారులు కొన్ని కొత్త బాధ్యతలు అప్పగించడం జరుగుతుంది. కుటుంబ సభ్యుల సహకారంతో ముఖ్యమైన పనులు, వ్యవహారాల్ని పూర్తి చేస్తారు. ఆదాయం కొద్దిగా పెరిగే అవకాశం ఉంది. పిల్లలు కొద్ది శ్రమతో ఆశిం చిన ఫలితాలు సాధిస్తారు. ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

వృత్తి, వ్యాపారాల్లో పోటీ కొద్దిగా పెరిగే అవకాశం ఉంది. స్వల్ప మార్పులతో పురోగతి చెందుతారు. ఉద్యోగంలో హోదా పెరిగే సూచనలున్నాయి. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు తప్పకుండా ఫలిస్తాయి. అనేక వైపుల నుంచి ఆదాయం వృద్ధి చెందుతుంది. ఆహార, విహారాల్లో జాగ్రత్తలు పాటించడం మంచిది. కుటుంబ సభ్యులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. షేర్లు, స్పెక్యులేషన్ల వల్ల బాగా లాభం ఉంటుంది. విదేశాలలోని పిల్లల నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు. ఒకటి రెండు శుభవార్తలు వింటారు.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

ఆర్థిక వ్యవహారాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండడం మంచిది. ఉద్యోగంలో అధికార యోగం పడుతుంది. కొద్ది శ్రమతో ముఖ్యమైన పనులు, వ్యవహారాలు సజావుగా పూర్తవుతాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలకు లోటుండదు. నిరుద్యోగులకు ఆశించిన శుభవార్త అందుతుంది. సొంత ఇంటి కోసం ప్రయత్నాలు ప్రారంభిస్తారు. ఆదాయం బాగానే వృద్ధి చెందుతుంది. పెళ్లి ప్రయత్నాలకు సమయం అనుకూలంగా ఉంది. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండడం మంచిది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

ఆదాయం నిలకడగా సాగిపోతుంది. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. ధనపరంగా ఎవరికీ మాట ఇవ్వకపోవడం మంచిది. కొందరు బంధుమిత్రులకు ఆర్థికంగా సహాయపడతారు. చేపట్టిన పనులు సజావుగా పూర్తవుతాయి. ఇంటా బయటా గౌరవాభిమానాలకు లోటుండదు. మిత్రులతో విందులో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు ఆశించిన స్థాయిలో పెరుగుతాయి. అధికా రుల్ని మీ పనితీరుతో ఆకట్టుకుంటారు. నిరుద్యోగులకు మంచి ఆఫర్ అందుతుంది. ఆరోగ్యం జాగ్రత్త.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

రోజంతా ప్రశాంతంగా, సానుకూలంగా గడిచిపోతుంది. ముఖ్యమైన వ్యవహారాలను సునాయా సంగా పూర్తి చేస్తారు. అదనపు ఆదాయ ప్రయత్నాలు ఆశించిన ఫలితాలనిస్తాయి. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలను జాగ్రత్తగా పరిష్కరించుకుంటారు. ఉద్యోగంలో అధికారులు మీ పనితీరుతో సంతృప్తి చెందుతారు. వృత్తి, వ్యాపారాల్లో కొద్దిగా లాభాలు పెరుగుతాయి. ప్రయాణాల వల్ల బాగా లాభం ఉంటుంది. పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు. కుటుంబ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది.

బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.