AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lord Shani: శనీశ్వరుడి కదలికతో ఈ రాశికి చెందిన వారికి లక్కే లక్కు.. మీరున్నారా చెక్ చేసుకోండి..

ఒక రాశి నుంచి మరొక రాశిలోకి శనీశ్వరుడికి దాదాపు రెండున్నర ఏళ్ళు పడుతుంది. కనుక శనిశ్వరుడి కదిలే సమయంలో రాశులపై మంచి, చెడుల ప్రభావం ఎక్కువ కాలం ఉంటుంది. శనీశ్వరుని కదిలిక వలన కొన్ని రాశులకు శుభ ఫలితాలు కలుగ నున్నాయి. ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం..

Lord Shani: శనీశ్వరుడి కదలికతో ఈ రాశికి చెందిన వారికి లక్కే లక్కు.. మీరున్నారా చెక్ చేసుకోండి..
Lord Shaniswara
Surya Kala
|

Updated on: Nov 28, 2024 | 11:55 AM

Share

జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలకు, రాశులకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. నవగ్రహాలలో శనీశ్వరుడు న్యాయ నిర్ణేత.. కర్మ ఫలదాత.. మంచి చెడుల ఆధారంగా మనిషి జీవితంలో కష్ట సుఖాలను కలిగించే దైవం. అంతేకాదు సూర్య పుత్రుడు శనీశ్వరుడు అత్యంత నెమ్మదిగా కదిలే గ్రహం కూడా.. అందుకనే ఈయనిని మందగమనుడు అని కూడా పిలుస్తారు. రాశుల్లో మకరం, కుంభరాశికి శనీశ్వరుడు అధిపతి. కనుక ఈ రాశులకు చెందిన వ్యక్తులపై ఆయన అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది. కొత్త సంవత్సరంలో మీన రాశిలోకి శనీశ్వరుడు ప్రవేశించనున్నాడు. 2025 మార్చి 30 న మీన రాశిలోకి అడుగు పెట్టనున్నాడు. అయితే శనీశ్వరుడు ఇప్పుడు తిరోగమనంలో ఉండడంతో కొన్ని రాశుల వారికి కలిసి వస్తుంది. ఈ రాశులను ధనవంతులు చేస్తాడు.

మేష రాశి : ఈ రాశికి వారికి శనిశ్వరుడి కదలిక వలన శుభ ఫలితాలు కలుగానున్నాయి. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడంతో.. గతంలో కంటే ఆర్ధిక పరిస్థితి బాగుటుంది. జ్యోతిష శాస్త్రం ప్రకరం ఈ రాశి వారికి శనిశ్వరుడు పది, పదకొండవ ఇంటికి అధిపతి.. కనుక వీరు ఏపని మొదలు పెట్టినా శుభ ఫలితాలను పొందుతారు.

మకర రాశి: ఈ రాశికి శనిశ్వరుడే అధిపతి.. కనుక శనిశ్వరుడి కదలిక ఈ రాశికి చెందిన వారికి శుభ ఫలితాలను కలిగిస్తాడు. కొత్త ఆదాయ అవకాశాలు లభిస్తాయి. జ్యోతిష్యం ప్రకారం ఈ రాశి వారికి శనిశ్వరుడి మొదటి ఇల్లు.. ఈ సమయంలో ఈ రాశికి చెందిన వ్యక్తుల కెరీర్ సంబంధిత సమస్యలు కూడా పరిష్కారమవుతాయి. ఆర్థికంగా బలోపేతం అవుతారు.

ఇవి కూడా చదవండి

కుంభ రాశి: కుంభ రాశికి శనీశ్వరుడు అధిపతి, కనుక శనిశ్వరుడి కదలికలు వీరికి లాభదాయకంగా ఉంటుంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు, గౌరవం పెరుగుతుంది. ప్రత్యేక స్థానాన్ని కూడా పొందే అవకాశం ఉంది. శనిశ్వరుడి కదలికల కారణంగా కృషి తగిన ఫలితాలను అందుకుంటారు. చేపట్టిన పనుల్లో అబివృద్ధి కలుగుతుంది. వృత్తిలో సానుకూల మార్పులు కలుగుతాయి.

మరిన్ని ఆధ్మాతిక వార్తల కోసం క్లిక్ చేయండి..

నోట్ : పైన తెలిపిన విషయాలు పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి.