Tirumala: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. త్వరలో తీరనున్న గదుల కష్టాలు..

కలియుగ వైకుంతం తిరుమల.. ఇక్కడ కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామిని కలియుగ దైవంగా భావిస్తారు. పిలిస్తే పలికే దైవంగా పూజలను అందుకున్న వెంకన్నను ప్రతి హిందువు దర్శించుకోవాలని తపిస్తారు. రోజు రోజుకీ స్వామివారిని దర్శించుకునే భక్తుల సంఖ్య పెరుగుతున్న నేపధ్యంలో అందుకు తగిన విధంగా సదుపాయాలను కల్పించే దిశగా టీటీడీ అడుగులు వేస్తోంది. ముఖ్యంగా భక్తులు ఎదుర్కొనే గదుల కొరతను తీర్చేందుకు కొత్త భవనాలు రెడీ అవుతున్నాయి.

Tirumala: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. త్వరలో తీరనున్న గదుల కష్టాలు..
New Building In Tirumala
Follow us
Surya Kala

|

Updated on: Nov 27, 2024 | 8:59 AM

తిరుమల పుణ్య క్షేత్రంలో భక్తుల రద్దీ నెలకొంటుంది.. దీంతో భక్తులు దర్శనం కోసం క్యూల్లో గంటల తరబడి ఎదురుచూడాల్సి వస్తున్న సంగతి తెలిసిందే.. అంతేకాదు.. గదుల కొరత కూడా ఉండడంతో భారీ సంఖ్యలో భక్తులు స్వామివారి ఆలయ పరిసరాల ఆవరణలోనే గడుపుతూ ఉంటారు. ఈ నేపధ్యంలో శ్రీవారి భక్తులకు గదుల కొరతని తీర్చనుందని తిరుమల తిరుపతి దేవస్థానం గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలో గదుల కొరత తీరనుందని వెల్లడించింది. తిరుమలలో కొత్తగా యాత్రికుల వసతి సముదాయం (పీఏసీ-5) భవనాన్ని టీటీడీ నిర్మిస్తోంది.

ఈ భవన నిర్మాణ పనులపై టీటీడీ అడిషనల్ ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి అధికారులతో కలిసి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఇంజినీరింగ్ అధికారులు ప్రస్తుతం భవన నిర్మాణ పనులు ఎలా జరుగుతున్నాయో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. భవన నిర్మాణ సముదాయంలో 16 హాళ్ళు ఉన్నాయని.. అందులో 8 హాళ్లలో ఫ్లోరింగ్ పూర్తైందని చెప్పారు.. ఇక మిగిలిన పని పూర్తి చేయాలని వెల్లడించారు.

అధికారులకు ఈ భవన నిర్మాణ పనులకు ప్రతి ఒక్క పనికి గడువు పెట్టుకుని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అడిషనల్ ఈవో ఆదేశించారు. భవనంలో భక్తులు ఇబ్బంది పడకుండా అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు. నిర్మాణంలో నాణ్యత విషయంలో రాజీ పడవద్దు అని అధికారులకు చెప్పారు. నూతన భవనం పీఏసీ-5లో భక్తుల సౌకర్యార్ధం కోసం ఏర్పాటు చేస్తున్న అన్న ప్రసాదం డైనింగ్ హాల్, కళ్యాణ కట్ట, డిస్పన్సరీ వంటి వాటిని గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్మాతిక వార్తల కోసం క్లిక్ చేయండి..