AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pakistan Protests: పాకిస్తాన్‌లో హింసాత్మక నిరసనలు.. PTI నేత అబ్దుల్ ఖాదిర్ ఖాన్‌తో సహా 10 మంది మృతి

పాకిస్తాన్‌లో కొనసాగుతున్న రాజకీయ అస్థిరత మధ్య ఇస్లామాబాద్‌లో చోటు చేసుకున్న హింస తగ్గే సూచనలు కనిపించడం లేదు. పీటీఐ నేత సహా మొత్తం 10 మంది మరణించారు. నివేదికల ప్రకారం పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పిటిఐ) కౌన్సెలర్ అబ్దుల్ ఖాదిర్ ఖాన్ కాల్చి చంపబడ్డాడు. మంగళవారం రాత్రి ఆయనపై కాల్పులు జరిగాయి.

Pakistan Protests: పాకిస్తాన్‌లో హింసాత్మక నిరసనలు.. PTI నేత అబ్దుల్ ఖాదిర్ ఖాన్‌తో సహా 10 మంది మృతి
Pakistan Protests
Surya Kala
|

Updated on: Nov 27, 2024 | 8:08 AM

Share

పాకిస్థాన్‌లో కొనసాగుతున్న రాజకీయ అస్థిరత నేపథ్యంలో ఇస్లామాబాద్‌లో జరుగుతున్న హింస తీవ్ర రూపం దాల్చింది. ప్రస్తుతం పాకిస్థాన్ అంతటా హింసాత్మక వాతావరణం నెలకొంది. ఈ ఘటనలో పీటీఐ నేత సహా మొత్తం 10 మంది చనిపోయారు. నివేదికల ప్రకారం పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) కౌన్సెలర్ అబ్దుల్ ఖాదిర్ ఖాన్ కాల్చి చంపబడ్డాడు. నిన్న రాత్రి ఆయనపై కాల్పులు జరిగాయి. రాజధానిలోని బ్లూ ఏరియాలో జరిగిన హింసాత్మక ఘర్షణల్లో గాయపడిన వారిని ఆసుపత్రిలో చేర్చారు.

PTI ఛైర్మన్ బారిస్టర్ గోహర్ ఖాన్, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ X లో అబ్దుల్ ఖాదిర్ మరణం పట్ల సంతాపాన్ని వ్యక్తం చేస్తూ ఓ పోస్ట్ చేశారు. ఈ హింసకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని అన్నారు. అదే సమయంలో పాకిస్తాన్ సమాచార మంత్రి అతా తరార్.. బుష్రా బీబీని విమర్శించారు. ఆమె హింసను ప్రేరేపించారని ఆరోపించారు. ఇమ్రాన్ ఖాన్ భార్య బుష్రా బీబీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు కొనసాగించాలని తన మద్దతుదారులకు నిరంతరం పిలుపునిస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు.

డి-చౌక్ వద్ద భద్రతా బలగాలను మోహరింపు

ఇస్లామాబాద్‌లోని డి-చౌక్ నుంచి జిన్నా అవెన్యూలోని చైనా చౌక్ వరకు, లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలు (LEAs) పరిస్థితిని నియంత్రించాయి. బుష్రా బీబీ కాన్వాయ్ 7వ అవెన్యూకి తరలించారు. నగరంలోని ప్రధాన మార్కెట్‌లు, ప్రదేశాలలో హింసాత్మక వాతారణం నెలకొనడంతో LEAలు F-6 సూపర్ మార్కెట్, F-7 జిన్నా సూపర్ మార్కెట్, F-10, F-11, G-6, G-7 , G-8ని మూసివేశారు. నేడు కూడా ఈ కేంద్రాలను మూసివేయాలని అధికారులను ఆదేశించారు.

ఇవి కూడా చదవండి

తీవ్రమవుతున్న హింస

ఇస్లామాబాద్‌లో పరిస్థితి అదుపు తప్పింది. అక్కడ PTI మద్దతుదారులు, భద్రతా దళాల మధ్య ఘర్షణలు నిరంతరం కొనసాగుతున్నాయి. నిరసనకారుల రద్దీ.. ప్రభుత్వ ఆంక్షల మధ్య నగరంలో ఉద్రిక్తత నెలకొంది. శాంతిభద్రతల పరిరక్షణకు పాలనా యంత్రాంగం కఠిన చర్యలు తీసుకున్నప్పటికీ పీటీఐ మద్దతుదారుల ఆగ్రహం చల్లారేలా కనిపించడం లేదు.

ఈ ఘటన దేశంలో రాజకీయ అస్థిరతను మరింత పెంచింది. అబ్దుల్ ఖాదిర్ ఖాన్ మృతి, వ్యాపార సంస్థలు మూతపడటంతో ఇస్లామాబాద్‌లో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. అదే సమయంలో బుష్రా బీబీ.. ప్రభుత్వం మధ్య మాటల యుద్ధం హింసను మరింత ప్రేరేపిస్తోంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..