Viral News: అరుదైన ఫ్రాగ్ పిజ్జా వచ్చేసిందోచ్.. పండగ చేసుకుంటున్న చైనీస్ నాన్ వెజ్ ప్రియులు..!

ప్రస్తుతం యువకులు, పిల్లలు అత్యంత ఇష్టంగా తినే ఆహారంలో ఒకటి పిజ్జా. చీజ్, పుట్టగొడుగులు, చికెన్, వంకాయ, టమాటా వంటి రకరకాల పిజ్జాలు మార్కెట్ లో ఉన్నాయి. అయితే ఇప్పుడు మార్కెట్ లోని ఫ్రాగ్ పిజ్జా కూడా వచ్చింది. ఈ వార్త విన్న పిజ్జా ప్రియులు కొంచెం షాక్ లో ఉన్నారు. చైనీస్ పిజ్జా హట్ డీప్ ఫ్రైడ్ ఫ్రాగ్ అనే కొత్త రకం ఫ్రాగ్ పిజ్జాను పరిచయం చేసింది. ఈ వార్త ఇప్పుడు వైరల్ అవుతుంది.

Viral News: అరుదైన ఫ్రాగ్ పిజ్జా వచ్చేసిందోచ్.. పండగ చేసుకుంటున్న చైనీస్ నాన్ వెజ్ ప్రియులు..!
Viral News
Follow us
Surya Kala

|

Updated on: Nov 27, 2024 | 12:25 PM

చైనా ప్రజల ఆహరపు అలవాట్ల గురించి ఎంత చెప్పినా తక్కువే. పాకేవి, ఈదేవి, ఎగిరేవి అనే తేడా లేకుండా.. అంటే చేపలు, మేక, కోడి వంటి వాటినే కాదు కప్పలు, కీటకాల, పాములు, కుక్క , గాడిద ఇలా అన్ని రకాల జీవులను ఆహారంగా తింటారు. అందుకే చైనా ప్రజలను పంచప్రాణ అని పిలుస్తారు. వీరు తినే విచిత్రమైన ఆహారాలతో తరచుగా వార్తల్లో ఉంటారు. ఇప్పుడు ఇదే వార్త వైరల్ అవుతోంది. చైనా మార్కెట్లోకి కప్పతో తయారు చేసిన ఒక ప్రత్యేకమైన పిజ్జా ప్రవేశించింది. ఆహార ప్రియుల కోసం పిజ్జా హట్ ఈ కొత్త రకం పిజ్జాను పరిచయం చేసింది. ఈ పిజ్జా గురించి తెలిసిన తర్వాత చాలా మంది ఏమి జరుగుతుంది అంటూ ఆశ్చర్యపోతున్నారు.

చైనాకు చెందిన పిజ్జా హట్ “గోబ్లిన్ పిజ్జా” పేరుతో కప్ప పిజ్జాను పరిచయం చేసింది. ఈ కొత్త చైనీస్ పిజ్జా వంటకం మొబైల్ గేమ్ డంజియన్స్ , ఫైటర్స్ ఆరిజిన్స్ బ్రాండ్‌ల మధ్య సహకారంలో భాగం. ఇది పిజ్జా ప్రియులను, పాప్ సంస్కృతి అభిమానులను ఒకేలా ఆకర్షించేలా లక్ష్యంగా పెట్టుకుంది. నవంబర్ 18న లాంచ్ అయిన గోబ్లిన్ పిజ్జా చైనాలోని మూడు పిజ్జా హట్ అవుట్‌లెట్లలో అందుబాటులో ఉంది. దీని ధర 169 యువాన్లు (సుమారు రూ. 2,000).

ఇవి కూడా చదవండి

వైరల్ పోస్ట్‌ను ఇక్కడ చూడండి:

దీని గురించిన ఒక పోస్ట్‌ను జేమ్స్ వాకర్ (jwalkermobile) తన X ఖాతాలో షేర్ చేసారు. ఈ టాప్ ఫ్రాగ్ పిజ్జాను చైనాలో ప్రయత్నిస్తారా?” టైటిల్ తో షేర్ చేశారు. వైరల్ అయిన ఫోటోలో పిజ్జా బ్రెడ్ మీద వేయించిన కప్ప ఉంది. ఈ కప్పను అందంగా డెకరేషన్ కూడా చేశారు.

నవంబర్ 21న షేర్ చేసిన ఈ పోస్ట్‌ని 17,000 మంది చూశారు. రకరకాల కామెంట్‌లు వచ్చాయి. ఒకరు కావాలంటే పైనాపిల్ పిజ్జా తినవచ్చు.. దీనిని మాత్రం తినలెం అని కామెంట్ చేయగా.. దీన్ని మరొకరు “స్స్స్… ఇది చూస్తుంటే నాకు జబ్బు వస్తుంది” అన్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

సాధారణ ప్రయాణికులకు కష్టాలు తప్పినట్లేనా.. జనరల్ బోగీల పెంపు
సాధారణ ప్రయాణికులకు కష్టాలు తప్పినట్లేనా.. జనరల్ బోగీల పెంపు
పుష్ప 2 స్ట్రీమింగ్‌కు వచ్చేది ఆ ఓటీటీలోనే.. డీల్ ఎన్ని కోట్లంటే?
పుష్ప 2 స్ట్రీమింగ్‌కు వచ్చేది ఆ ఓటీటీలోనే.. డీల్ ఎన్ని కోట్లంటే?
ఫీచర్స్‌తో టాప్ రేపుతున్న స్మార్ట్ ఫోన్లు..!
ఫీచర్స్‌తో టాప్ రేపుతున్న స్మార్ట్ ఫోన్లు..!
ప్రతి టికెట్‌పై రైల్వేశాఖ ఎంత సబ్సిడీ ఇస్తుందో తెలుసా..?
ప్రతి టికెట్‌పై రైల్వేశాఖ ఎంత సబ్సిడీ ఇస్తుందో తెలుసా..?
కొత్త ఏడాదికి అద్భుతంగా వెల్కం చెప్పాలంటే ఈప్లేసెస్ బెస్ట్ ఎంపిక
కొత్త ఏడాదికి అద్భుతంగా వెల్కం చెప్పాలంటే ఈప్లేసెస్ బెస్ట్ ఎంపిక
డ్రగ్స్ కేసులో అడ్డంగా బుక్కయిన నటుడి పుత్రరత్నం..
డ్రగ్స్ కేసులో అడ్డంగా బుక్కయిన నటుడి పుత్రరత్నం..
పిల్లలకు చాయ్‌ తాగిస్తున్నారా ?? ఈ వీడియో చూడండి
పిల్లలకు చాయ్‌ తాగిస్తున్నారా ?? ఈ వీడియో చూడండి
ఒకే చోట గంటల కొద్దీ కూర్చునేవారికి.. షాకింగ్‌ న్యూస్‌
ఒకే చోట గంటల కొద్దీ కూర్చునేవారికి.. షాకింగ్‌ న్యూస్‌
రైలుకు ఎదురుగా బైక్‌పై దూసుకెళ్లిన వ్యక్తి.. సరిగ్గా అదే సమయంలో
రైలుకు ఎదురుగా బైక్‌పై దూసుకెళ్లిన వ్యక్తి.. సరిగ్గా అదే సమయంలో
'మా ఆడబిడ్డల చదువును అడ్డుకోవద్దు'.. తాలిబన్లపై రషీద్ ఖాన్ ఆగ్రహం
'మా ఆడబిడ్డల చదువును అడ్డుకోవద్దు'.. తాలిబన్లపై రషీద్ ఖాన్ ఆగ్రహం