దొంగలను పట్టుకోవాలంటే.. ఆ గుడికి వెళ్తే చాలు
అదేంటి.. దొంగలను పట్టుకోవాలంటే పోలీస్ స్టేషన్‌కి వెళ్లి కంప్లైంట్ ఇవ్వాలి కానీ గుడికి వెళ్లమంటున్నారేంటి అనుకుంటున్నారా? అవును, సాధారణంగా చోరీ జరిగితే ఎవరైనా పోలీస్ స్టేషన్‌కి వెళ్తారు... కానీ ఆ జిల్లా ప్రజలు మాత్రం ఓ దేవాలయానికి వెళ్లి అక్కడ దేవుడి ముందు తమకు జరిగిన నష్టం గురించి చెప్పి మొక్కుకుంటారు. అంతే వెంటేనే వారికి దొంగలు ఎవరో, వారెక్కడున్నారో స్పష్టంగా అక్కడ కనిపిస్తుందట.
అదే కడప జిల్లాలోని సంగమేశ్వర ఆలయంలోని మిస్టరీ. కడప జిల్లాలోని కమలాపురం నియోజకవర్గం వీరపునాయని పల్లి మండలంలోని సంగమేశ్వర దేవాలయం ఎంతో పవిత్రమైనది. ఈ దేవాలయానికి అనేక విశిష్టతలు ఉన్నాయి. ఆ ప్రాంతంలో దొంగతనాలు జరిగినా, వారి పశువులు కానీ, ఏవైనా విలువైన వస్తువులు కానీ పోయినా.. వారు పోలీస్ స్టేషన్ కు వెళ్లరు. వెంటనే సంగమేశ్వర ఆలయానికి వస్తారు. దేవునికి విషయం చెప్పి అక్కడ ఉన్న ఓ నాపరాయిపై చూస్తారు. అంతే.. ఆ దొంగతనం చేసిన వారి రూపం స్పష్టంగా కనిపిస్తుందట. అంతేకాదు ఎవరివైనా పశువులు కనిపించకుండా పోయినా అక్కడకు వచ్చి ఆ దేవాలయంలో ఆ నాపరాయిపై చూస్తే అవి ఎక్కడ ఉన్నాయి లేదా వాటిని ఎవరినైనా దొంగిలించారా అనేది చాలా క్లియర్ గా కనబడుతుందట. సంగమేశ్వర దేవాలయంలో గర్భగుడికి ముందు నేలపై ఒక పెద్ద నాపరాయి ఉంటుంది. ఆ నాపరాయి ఎంతో శక్తివంతమైనది అని స్థానికుల నమ్మకం. ఆ నాపరాయి అద్దం మాదిరి ఉంటుంది. ఎవరైనా అక్కడకు వచ్చి తమకు కలిగిన నష్టం గురించి దేవుడికి మొక్కుకుని ఆ రాయి దగ్గరకు వచ్చి నిలబడితే చాలు.. ఆ దొంగతనం ఎవరు చేశారనేది క్లియర్ కట్ గా కనబడుతుందని స్థానికుల విశ్వాసం.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
తన ప్రాణాన్ని అడ్డుగా పెట్టి భర్తను కాపాడుకున్న భార్య
నువ్వు దేవుడయ్యా సామీ !! రూ.కోటితో బిచ్చగాడు విందు
గర్ల్ ఫ్రెండ్ కోసం 11 వారాలు ఫ్లైట్ జర్నీ.. దేశాలే దాటేశాడుగా
టాయిలెట్ వాడకం తెలిసిన వాళ్లు మాత్రమే వందే భారత్ ఎక్కండి!
బేబీ అరిహా కథ.. ప్రధాని మోదీనే కదిలించింది
"పాలక్ పనీర్" దెబ్బకు రూ. 1.6 కోట్ల లాస్ అయిన అమెరికా వర్సిటీ
రైలుపై పడ్డ క్రేన్.. 22 మంది మృతి
కేజీ బంగారు నిధి కేసులో బిగ్ ట్విస్ట్..కుటుంబ సభ్యులకు పండగే పండగ
దారం లేని పతంగ్ చూసారా? ఎలా ఎగురుతుందంటే..
20 అడుగుల ఎత్తుతో భారీ బాహుబలి భోగిమంట.. వీడియో

