ఈ ఉద్యోగం వెరీ స్పెషల్.. కండిషన్స్ అప్లై
ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్ వినూత్న జాబ్ ఆఫర్‌ను ప్రకటించారు. చీఫ్ ఆఫ్ స్టాఫ్ పొజిషన్‌కు దరఖాస్తులు ఆహ్వానించారు. ఇక్కడే ఓ చిన్న మెలిక పెట్టారు. ఎంపికైన వారికి తొలి ఏడాది ఎలాంటి శాలరీ చెల్లించకపోగా.. సదరు అభ్యర్థే తిరిగి ₹20 లక్షలు చెల్లించాలన్న షరతు విధించారు. అంతేకాదు ఉద్యోగానికి కొన్ని అర్హత ప్రమాణాలను కూడా నిర్దేశించారు.
కొత్తగా ఉన్న ఈ జాబ్ ఆఫర్ పట్ల ప్రస్తుతం నెట్టింట చర్చ జరుగుతోంది. జొమాటోలో చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా వ్యవహరించాల్సిన వ్యక్తి గురుగ్రామ్‌లోని జొమాటో ప్రధాన కార్యాలయంలో పని చేయాల్సి ఉంటుంది. కొత్తగా ఏదైనా నేర్చుకోవాలన్న తపన, జీవితంలో ఎదగాలన్న దృఢ సంకల్పం ఉన్న వారు ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాలని దీపిందర్ గోయల్ తన పోస్టులో వివరించారు. దీనికి ఎక్స్‌పీరియెన్స్‌తో పెద్దగా పనిలేదని కొత్తగా ఆలోచించే వారు ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ ఉద్యోగానికి ఎంపికైన వారు జొమాటో, బ్లింకిట్, హైపర్ ప్యూర్, జొమాటోకు చెందిన ఫీడింగ్ ఇండియా ఎన్జీఓ సంస్థల కోసం పని చేయాల్సి ఉంటుందని దీపిందర్ చెప్పారు. ఉద్యోగానికి ఎంపికైన వ్యక్తికి తొలి ఏడాది ఎలాంటి చెల్లింపులూ చేయబోమన్నారు. పైగా సదరు అభ్యర్థే రూ.20 లక్షలు ఫీడింగ్ ఇండియాకు డొనేట్ చేయాల్సి ఉంటుందన్నారు. ఉద్యోగి కోరితే జొమాటో కూడా రూ.50 లక్షలు తన తరఫున ఎన్జీఓకు విరాళంగా ఇస్తుందన్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బంపర్ ఆఫర్.. కేవలం రూ.84 కే ఇళ్ల అమ్మకం !!
ఇదెక్కడి బైక్‌రా నాయనా.. ఇలాంటివి పాకిస్తాన్లోనే తయారవుతాయా
దారుణం.. ఉదయం పెళ్లి చేసుకున్నాడు.. కొన్ని గంటల్లోనే హతమార్చాడు
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

