AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బంపర్‌ ఆఫర్‌.. కేవలం రూ.84 కే ఇళ్ల అమ్మకం !!

బంపర్‌ ఆఫర్‌.. కేవలం రూ.84 కే ఇళ్ల అమ్మకం !!

Phani CH
|

Updated on: Nov 26, 2024 | 6:45 PM

Share

ఇటీవల జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ రిపబ్లికన్ పార్టీ తరపున ఘనవిజయం సాధించారు. రెండవసారి అమెరికా అధ్యక్షుడిగా జనవరి 2025లో ప్రభుత్వ పగ్గాలను ట్రంప్ చేపట్టనున్నారు. అయితే డొనాల్డ్ ట్రంప్‌ గెలుపుతో చాలా మంది అమెరికన్లు షాక్‌కు గురయ్యారు. ఆయన విజయాన్ని వారు ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. చాలా మంది తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు.

అయితే ట్రంప్ గెలుపుతో దుఃఖంలో మునిగిపోయిన అమెరికన్లకు ఇటలీలోని ఓ గ్రామం బంపరాఫర్ ప్రకటించింది. ట్రంప్ గెలుపుతో బాధపడుతున్న అమెరికన్లకు కేవలం 1 డాలర్‌కే ఇల్లు విక్రయిస్తామని ఇటలీ ద్వీపం సర్డినియాలోని ఒల్లోలై అనే గ్రామం ప్రకటించింది. గ్రామంలో భారీగా తగ్గిపోయిన జనాభాను పునరుద్ధరించేందుకుగానూ బయటి వ్యక్తులు గ్రామంలో నివసించేలా ప్రోత్సహించాలని ఆ గ్రామం నిర్ణయించింది. ఈ దిశగా చాలా కాలంగా వివిధ మార్గాల్లో ప్రయత్నాలు చేస్తోంది. శిథిలావస్థకు చేరిన ఇళ్లను కేవలం ఒక డాలర్ కంటే తక్కువ రేటుకు కూడా విక్రయిస్తోంది. నవంబర్ 5న జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఫలితం వెలువడిన తర్వాత అమెరికన్లకు ఇళ్లు అమ్మేందుకు ఆ గ్రామం ఒక వెబ్‌సైట్‌ను కూడా ప్రారంభించిందని సీఎన్ఎన్ కథనం పేర్కొంది. ఖాళీగా ఉన్న ఇళ్లు త్వరగా అమ్ముడుపోవాలనే ఉద్దేశంతో మరింత చౌకగా గృహాలను అందుబాటులో ఉంచిందని తెలిపింది. ప్రపంచ రాజకీయాలతో అలసిపోయారా? కొత్త అవకాశాలను వెతుకుతూ మరింత సమతుల్యమైన జీవనశైలిని స్వీకరించాలని భావిస్తున్నారా? అద్భుతమైన సర్డినియా స్వర్గంలో మీ జీవితాన్ని ప్రారంభించడానికి ఇదే సరైన సమయం’’ అంటూ వెబ్‌సైట్ పేర్కొంది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఇదెక్కడి బైక్‌రా నాయనా.. ఇలాంటివి పాకిస్తాన్లోనే తయారవుతాయా

దారుణం.. ఉదయం పెళ్లి చేసుకున్నాడు.. కొన్ని గంటల్లోనే హతమార్చాడు

ఆకాశంలో అద్భుత నగరం.. 250 ఏళ్లు ఉండేలా నిర్మాణం