దారుణం.. ఉదయం పెళ్లి చేసుకున్నాడు.. కొన్ని గంటల్లోనే హతమార్చాడు
హైదరాబాద్ మియాపూర్‌లో సంచలనం సృష్టించిన బాలిక హత్య కేసుకు సంబంధించి పోలీసుల విచారణలో పలు విస్తుపోయే అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన బాలికను ప్రేమ పేరుతో వంచించి పెళ్లి నాటకంతో ఆమెను హత్య చేయడం.. ఆ తర్వాతి పరిణామాలు పోలీసులు షాకయ్యారు.
గతంలో పలు చిన్నచిన్న దొంగతనాల కేసుల్లో జైలుకెళ్లిన చింటూ హత్య అనంతరం పోలీసులు బాలిక కుటుంబసభ్యులను తప్పు దారి పట్టించేందుకు పలు యత్నాలు చేసినట్లు విచారణలో వెల్లడైంది. నవంబరు 8న ఉదయం పెళ్లి చేసుకుంటానని నమ్మించిన చింటూ పుస్తెలతాడు, పూలదండలు కొన్నాడు. స్నేహితుడి ఇంట్లో అదేరోజు తాళి కట్టి దండలు మార్చుకుని పెళ్లయిపోయినట్లు అందర్నీ నమ్మించేందుకు ఫొటోలు దిగాడు. ఇన్‌స్టాగ్రామ్‌తోపాటు స్నేహితులకు, బాలిక కుటుంబ సభ్యులకు, ఆమె స్నేహితురాలికి వాటిని షేర్ చేశాడు. పెళ్లి చేసుకున్నారని అందరికీ నమ్మకం కలిగేలా చేశాడు. అనంతం తన ప్లాన్ అమలు చేశాడు. తన స్నేహితుడు, అతని భార్య బయటకు వెళ్లిన సమయంలో గంటల వ్యవధిలోనే బాలికను హత్య చేశాడు. తన స్నేహితుడిని, అతని భార్యను ఒప్పించి శవాన్ని మాయం చేయడానికి పథకం వేశాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పొదుపు చేయలేదు.. జాబ్ పోయింది.. టెకీ ఆవేదన
ప్రాణాలకు తెగించి వృద్ధ దంపతుల వీరోచిత పోరాటం
మెస్సికి కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన అనంత్ అంబానీ..
నీరు తోడుతుండగా వచ్చింది చూసి.. పరుగో పరుగు..
జోరు వానలో చిక్కుకున్న ఏనుగు.. గొడుగుగా మారిన తల్లి ఏనుగు..
6 నెలలు చికెన్ మాత్రమే తిన్న యువతి.. చివరకు ఆస్పత్రిలో చేరి..
తవ్వకాల్లో బయటపడ్డ దుర్గమాత విగ్రహం

