నువ్వు దేవుడయ్యా సామీ !! రూ.కోటితో బిచ్చగాడు విందు
అడుక్కుని జీవించే ఒక కుటుంబం అందరినీ ఆశ్చర్యపరిచింది. సుమారు 20,000 మందికి భారీ విందు ఇచ్చింది. దీని కోసం రూ.1.25 కోట్లు ఖర్చు చేసింది. ఇది చూసి ఆ ప్రాంతంలోని సామాన్య ప్రజలతోపాటు కోటీశ్వరులు షాక్ అయ్యారు. పాకిస్థాన్‌లోని గుజ్రాన్‌వాలాలో ఈ సంఘటన జరిగింది. ఒక బిచ్చగాడి నానమ్మ ఇటీవల మరణించింది. దీంతో 40వ రోజు స్మారకం సందర్భంగా అతడి కుటుంబం భారీ విందు ఏర్పాటు చేసింది.
స్థానికులను, తెలిసినవారిని దీనికి ఆహ్వానించింది. కాగా, గుజ్రాన్‌వాలాలోని రహ్వాలీ రైల్వే స్టేషన్ సమీపంలో ఈ భారీ విందు కార్యక్రమం జరిగింది. పాకిస్థాన్‌లోని పంజాబ్ నలుమూలల నుంచి సుమారు 20,000 మంది హాజరయ్యారు. సిరి పాయె, మురబ్బా వంటి సాంప్రదాయ వంటకాలతోపాటు వివిధ మాంసాహార వంటకాలను వడ్డించారు. ఈ విందు కోసం సుమారు 250 మేకలు కోశారు. అలాగే అతిథులను తరలించేందుకు సుమారు 2,000 వాహనాలు కూడా ఏర్పాటు చేశారు. ఈ భారీ విందు కోసం ఆ బెగ్గర్ ఫ్యామిలీ సుమారు రూ.1.25 కోట్లు ఖర్చు చేసింది. ఈ విషయం తెలిసి స్థానికులతోపాటు ధనవంతులు, కోటీశ్వరులు సైతం నోరెళ్లబెట్టారు. ఒక బిచ్చగాడి కుటుంబం ఇంత విలాసవంతమైన విందు ఇవ్వడంపై చాలా మంది హాస్యాస్పదంగా వ్యాఖ్యానించారు. కొందరు వారి ఔదార్యాన్ని మెచ్చుకోగా, వారి ఆర్థిక పరిస్థితిపై మరికొందరు ఆశ్చర్యపోయారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
గర్ల్ ఫ్రెండ్ కోసం 11 వారాలు ఫ్లైట్ జర్నీ.. దేశాలే దాటేశాడుగా
ఈ ఉద్యోగం వెరీ స్పెషల్.. కండిషన్స్ అప్లై
బంపర్ ఆఫర్.. కేవలం రూ.84 కే ఇళ్ల అమ్మకం !!
ఇదెక్కడి బైక్‌రా నాయనా.. ఇలాంటివి పాకిస్తాన్లోనే తయారవుతాయా
దారుణం.. ఉదయం పెళ్లి చేసుకున్నాడు.. కొన్ని గంటల్లోనే హతమార్చాడు
టాయిలెట్ వాడకం తెలిసిన వాళ్లు మాత్రమే వందే భారత్ ఎక్కండి!
బేబీ అరిహా కథ.. ప్రధాని మోదీనే కదిలించింది
"పాలక్ పనీర్" దెబ్బకు రూ. 1.6 కోట్ల లాస్ అయిన అమెరికా వర్సిటీ
రైలుపై పడ్డ క్రేన్.. 22 మంది మృతి
కేజీ బంగారు నిధి కేసులో బిగ్ ట్విస్ట్..కుటుంబ సభ్యులకు పండగే పండగ
దారం లేని పతంగ్ చూసారా? ఎలా ఎగురుతుందంటే..
20 అడుగుల ఎత్తుతో భారీ బాహుబలి భోగిమంట.. వీడియో

