Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Uttar Pradesh: DJ పాట కోసం పెళ్లి మండపంలో గొడవ.. కోపంతో పెళ్లి రద్దు చేసుకున్న వధువు..

ఇరువురు వ్యక్తులను ఇరు కుటుంబాలను ఒక్కటి చేసేది వివాహ బంధం. అటువంటి వివాహ వేడుకలో ఎన్నో సరదాలు, సంతోషాలను కలిగించే కార్యక్రమాలు ఉంటాయి. కొన్ని సార్లు చిన్న చిన్న విషయాలకు వధూవరుల కుటుంబాల మధ్య గొడవలు చోటు చేసుకుంటాయి. వాటిని సర్దుకుని పెళ్లి జరిపించే వారు గత కొంతకాలం క్రితం వరకూ.. అయితే మారిన కాలంతో పాటు ఇప్పుడు వధువు వరులతో పాటు కుటుంబ సభ్యుల ఆలోచనల్లో మార్పులు వచ్చి.. పెళ్లికాదనుకునే వరకూ వెళ్తున్నారు. తాజాగా డీజీ విషయంలో జరిగిన గొడవ వధువు దృష్టికి చేరుకుని పెళ్ళికి నో చెప్పింది. ఈ విచిత్ర ఘటన ఉత్తర్ ప్రదేశ్ లో చోటు చేసుకుంది.

Uttar Pradesh: DJ పాట కోసం పెళ్లి మండపంలో గొడవ.. కోపంతో పెళ్లి రద్దు చేసుకున్న వధువు..
Wedding Canceled Due To Dj Song
Surya Kala
|

Updated on: Nov 27, 2024 | 9:30 AM

Share

ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో ఓ విచిత్రమైన ఘటన వెలుగులోకి వచ్చింది. పెళ్లి సమయంలో డీజే ప్లే చేస్తున్న పాట విషయంలో పెళ్లికి వచ్చిన అతిథులు, వరుడికి సంబంధించిన చుట్టాలు పరస్పరం గొడవపడ్డారు. పెళ్లికి వచ్చిన అతిథులు డీజేలో ఓ పాట ప్లే చేయమని డిమాండ్ చేశారు. అయితే డీజేలో ఆ పాట ప్లే చేయకపోవడంతో పెళ్లికి వచ్చిన అతిథులు రచ్చ చేయడం మొదలుపెట్టారు. అంతేకాదు పెళ్లి కూతురు తరపు చుట్టాలు.. మహిళలతో తీవ్ర స్థాయిలో గొడవ పడ్డారు. ఈ విషయం వధువు దృష్టికి చేరుకుంది. దీంతో వధువు పెళ్లికి స్వస్తి చెప్పింది. పెళ్లి ఊరేగింపును వెనక్కి తీసుకెళ్లమని వరుడిని కోరింది. అయితే వధువు నిర్ణయం మార్చేందుకు ఇరు కుటుంబ సభ్యులు నచ్చ చెప్పేందుకు ప్రయత్నించారు. అయినా ఆమె తన నిర్ణయంపై గట్టిగా నిలబడింది. ఆమె పెళ్లిని సున్నితంగా నిరాకరించింది. ఈ ఘటన నిగోహాలోని భద్ది ఖేడా గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..

నవంబరు 25న రాయ్‌బరేలీలోని బచ్రావానా ఇచౌలీ గ్రామం నుంచి వరుడు , అతని కుటుంబ సభ్యులు, స్నేహితులు ఊరేగింపుగా భద్ది ఖేడా గ్రామంలోని వధువు ఇంటికి చేరుకున్నారు. వధువు తరపు బంధువులు వరుడు రాక కోసం వేచి ఉన్నారు. పెళ్లి ఊరేగింపు రాగానే వధువు తరపు వారు ఘనంగా స్వాగతం పలికారు. గడప దగ్గర పూజను నిర్వహించి వరుడు గడప దాటే సమయంలో డీజే పాటను ప్లే చేసే విషయంలో వివాదం నెలకొంది.

వరుడి బావ డిమాండ్ ..

వరుడి బావ తనకు నచ్చిన పాటను ప్లే చేయమని కోరినట్లు సమాచారం. DJ ఆ పాటను ప్లే చేయలేదు. డీజేతో వరుడి బావ గొడవ పడ్డాడు. ఇకపై తనకు నచ్చిన పాటలు మాత్రమే ప్లే చేయాలనీ చెప్పాడు. ఆ సమయంలో అక్కడ ఉన్న మహిళలు వరుడి బావ కోరికను వ్యతిరేకించారు. అప్పుడు ఇరువర్గాలు పరస్పరం ఘర్షణకు దిగాయి. వాగ్వాదం తర్వాత గొడవ మొదలైంది. దీంతో వధూ వరుల బంధువులు గాయపడ్డారు.

ఇవి కూడా చదవండి

వరుడి కోసం ఎదురు చూస్తున్న పెళ్లి కూతురు .. పెళ్ళికి నో అంది..

అయితే కొంత సమయం తర్వాత ఈ గొడవ సద్దుమణిగింది. అయితే ఈ గొడవ విషయం వధువుకి తెలిసింది.. అది కూడా ఓ పాట కోసం వరుడి తరఫు వారు రచ్చ రచ్చ చేశారని తెలియడంతో వధువు ఆగ్రహం వ్యక్తం చేసింది. పెళ్లికి నిరాకరించింది. పెళ్లికూతురు తాను పెళ్లి చేసుకోను అని చెప్పడంతో పెళ్లి మండపంలో ఉన్నవారు అవాక్కయ్యారు. వరుడు ఆమెను ఒప్పించేందుకు ప్రయత్నించాడు. అయినా ఆమె ఒప్పుకోలేదు. పెద్దలు కూడా ఇంత చిన్న విషయానికి వివాహాన్ని రద్దు చేసుకోవడం ఎందుకు అంటూ వధువుకు నచ్చ చెప్పడానికి చూశారు. అయితే వధువు ఎవరి మాట వినలేదు. చిన్న చిన్న విషయాలకే గొడవలు పడే అలాంటి ఇంటికి తాను వెళ్లను అని చెప్పింది. దీంతో చేసేది ఏమీ లేక వరుడు .. తమ బంధువులతో కలిసి తిరిగి వెళ్ళిపోయాడు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..